రచన: కోనే నాగ వెంకట ఆంజనేయులు ఉగాది పండుగ రోజు. ఊళ్ళో ఇల్లిల్లూ తిరిగే కాకి ఉదయాన్నే అడవిలో జంతువులన్నిoటినీ మామిడి చెట్టు క్రింద సమావేశ పరిచింది. ఈ అత్యవసర సమావేశం దేనికో అర్థం కాని జంతువులన్నీ కాకి చెప్పే విషయం కోసం ఆత్రంగా ఎదురు చూడసాగేయి. కాకి గొంతు సవరించుకుంది. జంతువులన్నీ చెవులు రిక్కించాయి. “సోదరులారా! ఈరోజు ఉగాది పండుగ. ఊళ్ళో మనుషులందరూ ఈ పండుగని చాలా ఆనందంగా జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే […]
Category: బాల మాలిక
కోకో
రచన: వి. రాజారామమోహనరావు “కోకో – మా కుక్క పేరు, మీకు నచ్చిందా? కోకో వెనకాల ఒక కథ ఉంది. దానికన్నా ముందు లియో గురించి చెప్పుకోవాలి. పక్షుల్నీ, కుక్కల్నీ ఇంట్లో పెంచడం నాకు అయిష్టం. హాయిగా తిరగాల్సిన వాటిని బంధించటమేమిటని నా అభిప్రాయం. కానీ మా అమ్మాయికి వాటిని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఎవరింట్లో ఏ పెంపుడు జంతువు కనిపించినా వాటితో తెగ ఆడేది. అయినా నాకు ఇష్టం లేదని తెలిసి ఎప్పుడూ ఏ […]
పువ్వుల వనము
రచన: సుజాత తిమ్మన బలపం పట్టిన పసి కరము ఓం నమః చెప్పే స్వరము అమాయక చూపుల సరము దేవునిచే పొందిన వరము అమృతవాక్కులు రాసే కలము మానవతే మనందరి కులము గంగమ్మ ఇచ్చిన ఈ జలము పవిత్రతను వెలికి తీసే హలము ఒక్కటై ఉంటేనే అది మనము కలిసి పనిచేస్తే ఎంతో ఘనము సంతోషమే మనకున్న ధనము పసినవ్వుల పువ్వుల వనము ***
బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ
రచన: నండూరి సుందరీ నాగమణి అనగనగా… మరేమో… ఒకానొక దేశంలో… ఉల్లిపాయంత ఊరుండేదట. ఆ ఉల్లిపాయంత ఊరిలో బుడమకాయంత బుల్లోడు ఉండేవాడట… ఆ బుడమకాయంత బుల్లోడికి తామరకాయంత తండ్రి ఉన్నాడట. ఆ తామరకాయంత తండ్రి కాకరకాయంత కార్యాలయంలో పని చేస్తూ ఉండేవాడట. బుడమకాయంత బుల్లోడు బంగాళాదుంపంత బళ్ళో చదువుకుంటున్నాడట. ఆ బడిలో వీడికి చదువు చెప్పే పనసకాయంత పంతులమ్మ చెర్రీ పండంత చదువు చెప్పేదట. పుచ్చకాయంత ఫ్రెండ్స్ తో అనాసపండంత ఆటలా చదువు నేర్చుకుంటున్నాడు మన బుడమకాయంత […]
ఇటీవలి వ్యాఖ్యలు