April 19, 2024

మోదుగపూలు – 16

రచన: సంధ్యా యల్లాప్రగడ “ఈ ఫోటోలు వీరు ఎవరు సార్‌? మీకేమవుతారు? మీ దగ్గరకెట్ట వచ్చాయి!” అడిగాడు వివేక్. “ఇవి మా ప్యామిలి ఫోటోలు…” అని వివేక్‌ను చూస్తూ “ఫ్యామిలినా…?” “అవును. ఈ కూర్చున్న ఆయన గోండు రాజు హీర్ దేశ్ షా. బ్రీటీషు వారు తీసేసిన గోండు రాజు. చుట్టూ ఉన్నవారు ఆయన తమ్ములు నలుగురు. ఆయనకు ఆరుగురు కుమారులు. నీవు చూపిన ఆ చిట్టచివరున్న నిలుచున్నాయన చివరి కొడుకు” చెప్పాడాయన. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. […]

మోదుగపూలు – 15

రచన: సంధ్యా యల్లాప్రగడ ఆ కోట వివేక్ మునుపు చూసిన కోటలా చిన్నదిలా కాకుండా చాలా పెద్దగా ఉంది. ఆ కోటను పదమూడవ శతాబ్ధంలో నిర్మించారట. అయినా ఇప్పటికీ చాలా బలిష్టంగా ఉంది. పూర్తిగా పాడుపడిలేదది, కొంత నిలబడి ఉన్నది. పైకప్పు మాత్రం లేదు. గోండు రాజులు తమ రాజధాని మధ్యప్రదేశ్‌లోని చంద్రగిరి నుంచి ఉట్నూరుకు మార్చారు. అప్పుడు తమ నివాసము కోసం ఈ కోటను వారు నిర్మించారు. అది మొత్తం మూడు ఎకరాల స్థలంలో నిర్మించి […]

మోదుగపూలు – 14

రచన: సంధ్యా యల్లాప్రగడ వివేక్‌ స్కూలుకు వచ్చిన గంటకు వచ్చింది నాగలక్ష్మి. అప్పటికీ వివేక్‌ స్కూలు గ్రౌండులో పనిలో ఉన్నాడు. ఆమెను చూసి దగ్గరకు వచ్చాడు. “నా రూము ఇక్కడే అక్కడికి వెళదామా?” అడిగాడు ఆమెను. తల ఊపి “పద బిడ్డా!” అంది. “ఎమన్న తిన్నావా? తింటావా?” అంటూ కుశలం అడిగాడు. “దావత్ చేసినా గదా. అది చాలు!” అన్నది. “టీచర్ల ఇళ్ళు ఇవే…” అన్నాడు తలుపు తీస్తూ “నే చూసిన బిడ్డా!” అన్నదామె. లోపల ఉన్న […]

మోదుగపూలు – 13

రచన: సంధ్య యల్లాప్రగడ ఆడిటోరియంలో ఏర్పడిన ట్రాన్సు లాంటి నిశబ్ధం తెర వెనుక ఉన్న మధును, వివేక్‌ను, విద్యార్థులను కంగారు పెట్టింది. “ఏంటి ఒక్కరు చప్పట్లు కొట్టరు?” అన్నాడు మధు సార్‌. “ఎవరికీ అర్థం కాలేదా?” విచిత్రమైన డైలమాలో పడిపోతూ అన్నాడు వివేక్‌. “మేము మీరు చెప్పినట్లే చేశాము కదా సార్” అంటూ పాత్రలు వేసిన పిల్లలు చుట్టూ చేరారు. “ప్రసాదరావుసార్‌ కూడా చప్పుడు చెయ్యడా? లేక మనకు వినపడటంలేదా?” అన్నాడు వివేక్ కంగారుగా.. “చూద్దాం. ముందు […]

మోదుగపూలు – 12

రచన: సంధ్యా యల్లాప్రగడ గిరిజన గ్రామంలో అందరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం అనేది గోండుల సంస్కృతిలో భాగం. గ్రామంలో పెళ్లిళ్లు, పండుగలు అందరూ కలిసే చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక గ్రామానికి, మరో గ్రామానికి మధ్య తగవులు వస్తాయి. మాములుగా వారి తగవులు వారు తమ గ్రామపంచాయితిలో తీర్చుకుంటారు. గ్రామాల మధ్య గొడవలకు కూడా మార్గం ఉంది. పది పన్నెండు గ్రామాలకి ఒక రాజు ఉంటాడు. వారి తగవులు తీరుస్తాడు ఆ రాజు. ఈ చిన్న […]

మోదుగ పూలు – 11

రచన: సంధ్య యెల్లాప్రగడ వివేక్‌ లేచి కూర్చున్నాడు. చేయి విపరీతంగా సలుపుతోంది. రామును చూస్తే అతని తల నుంచి రక్తం కారుతోంది. క్షణం పాటు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. లేచి బండికున్న బ్యాగులోంచి ఒక టవల్ తీసి రాము తలకు కట్టు కట్టాడు. ముందు రక్తం కారటం ఆగాలి. అతని తలకు కట్టాక, మరో టవల్ తీసుకొని చేతికి కట్టుకున్నాడు. “దగ్గరలో మనకు ఆసుపత్రి ఉంటుందా?” అడిగాడు ఊపుతూ రాముని. “ఆ… ఆ రోడ్డు సీదా పో!” […]

మోదుగ పూలు – 10

రచన: సంధ్య యెల్లాప్రగడ సూర్యుడు పశ్చిమం వైపుకు సాగుతున్నాడు. అడవిలో కాలిబాట మీద జాగ్రత్తగా తోలుతూ రాము ఒక కూలిపోతున్న కోట దగ్గర ఆగాడు. అప్పటికి వాళ్ళు ‘చెట్టు దేవర’ దగ్గర్నుంచి బయలుదేరి తూర్పు దిశకు వచ్చి దాదాపు నాలుగు గంటలయ్యింది. ఒక చెట్టు క్రింద బండి ఆపి దిగారు మిత్రులిద్దరూ. తమతో తెచ్చుకున్న బ్యాగు లోంచి చక్కినాలు తీసి తిన్నారు ఇద్దరూ. చెట్టు దగ్గర పట్టుకున్న నీరు త్రాగారు. “ఇది దేవరకోట. ఇది దాటాక మనకు […]

మోదుగపూలు – 9

రచన: సంధ్యా యల్లాప్రగడ మామిడిపల్లి వచ్చాక. ఊపిరి హాయిగా పీల్చినట్లు ఫీల్‌ అయ్యాడు వివేక్‌. ఊరి నుంచి మామిడిపల్లి రాగానే రెండోరోజు రాము ఉన్నాడేమో అని వారింటికెళ్ళాడు. రాము ఇంట్లోనే ఉన్నాడు. బుక్సు ముందరేసుకొని, చదువుతూ, రాస్తూ… “ఎలా గడిచింది సిటీలో? రావాలనిపించిందా?” అడిగాడు స్నేహంగా చూస్తూ. “ఆ! అస్సలు వెంటనే రావాలనిపించినా పనులు చూసుకువచ్చాను. అసలు ఉండలేకపోయాను బాబు ఆ పొల్యూషన్ లో. ఇన్ని రోజులు ఎలా ఉన్నానా అని నాకే వింతగా ఉంది” అన్నాడు […]

మోదుగ పూలు – 8

రచన: సంద్యా యల్లాప్రగడ వేసవి ఫైనల్‌ పరిక్షలు పూర్తి కావొచ్చినాయి. పిల్లలను పరీక్షలకు సిద్ధం చెయ్యటంలో టీచర్లు తలమునకలయ్యారు. పెద్ద పరీక్షలు అయ్యాయి పదో తరగతి పిల్లలకు. మిగిలిన వారికి కూడా పరీక్షలయినాయి. ఆ సాయంత్రము టీచర్ల మీటింగు అయింది. రాజు సార్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ” మనం ఇంక పదిహేను రోజులు సెలవులు తీసుకుందాం. పదిహేను రోజుల తర్వాత సారులందరు వెనక్కి వచ్చేయ్యండి. మనము పిల్లలను తీసుకురావాలి. మన జ్యోతి టీచరు పెళ్ళి చేసుకు వెళ్ళిపోతోంది […]

మోదుగపూలు – 7

రచన: సంధ్యా యల్లాప్రగడ మళ్ళీ రాముని కలవటానికి వెంటనే సమయం చిక్కలేదు వివేక్‌కి. స్కూలు పనుల వలన, పిల్లలకు పరీక్షలు వస్తున్నందునా. అతను ఉట్నూరు వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్లో క్లాసులు అయ్యాక అతనూ మరో టీచరు కలిసి వెళ్ళి స్కూలు పని చూసుకు వచ్చేసరికే చాలా రాత్రి అవటం, ఇలా వరుసగా రెండు రోజులు జరిగింది. చంద్రయ్య తాత వచ్చి చెప్పాడు “సార్! నీ కోసము రాముడు వచ్చి పోయాడు”. అని ‘అయ్యో!’ అనుకున్నాడు వివేక్. పని […]