December 7, 2021

మలేషియ విహారయాత్రలు ( పెనాంగ్)

రచన: నాగలక్ష్మీ కర్రా ఈ సంచికలో “పెనాంగ్” లో కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. పెనాంగ్ కి దగ్గర గా చాలా చిన్న చిన్న అంటే మహ అయితే ఓ ఎకరం విస్తీర్ణం ఉన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. కొన్నిటికి పేర్లు ఉన్నాయి, పేరులేని ద్వీపాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రతీ నెలా వచ్చే ఆటూపోట్లకి మునిగి తేలుతూ ఉంటాయి. మా నివాసానికి ఎదురుగా అలాంటి ద్వీపం ఉండేది. ఓ నాలుగు వృక్షాలు చిన్న ఇల్లు ఉండేవి, […]

విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

రచన: కర్రా నాగలక్ష్మి మలేషియ, ఈ మధ్య కాలంలో బలమైన ఆర్ధిక దేశంగా రూపుదిద్దుకుంటున్న దేశం, మంచి పర్యాటక దేశంగా కూడా రూపు దిద్దు కుంటోంది. మలేషియ ముస్లిం దేశంగా ప్రకటించుకుంది. అయినా ఇక్కడ హిందూ బౌద్ద మతాలకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చేరు. పదమూడు రాష్టాలు, దక్షిణ చైనా సముద్రం వల్ల రెండు ద్వీపాలుగా విభజింపబడ్డ ఈ దేశం లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. ఈ సంచిక నుంచి మీకు మలేషియాలోని ప్రదేశాలను, ఒకటొకటిగా […]

యాత్రామాలిక – శృంగేరి

రచన: నాగలక్ష్మి కర్రా శృంగేరి అంటే తెలీని హిందువు వుండడనే నా అభిప్రాయం , వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ వే జ్ఞాపకం వస్తుంది , మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా , పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయివుంటారు. ఆది శంకరాచార్యులవారు స్థాపించిన శారదాపీఠం కూడా ఇక్కడే వుందనీ మనకు తెలుసు. మిగతా వివరాలు ఇవాళ తెలుసుకుందాం. శృంగేరీ కర్నాటకలోని ‘ చికమగళూరు ‘ జిల్లాలో పడమటి కనుమలలో ‘ తుంగ’ […]

అష్ట వినాయక మందిరాలు

రచన: నాగలక్ష్మి కర్రా అష్టగణపతులు పంచ ద్వారకలు, పంచబదరీలు, పంచప్రయాగలు, పంచపురాలు, అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు లాగానే మహారాష్ట్రాలో అష్ట వినాయకులు ప్రసిద్ది. ఈ అష్టవినాయక మందిరాలు పూణె నగరానికి సుమారు 15 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్నాయి. ఈ అష్టగణపతుల దర్శనం చేసుకోదలచిన వారు పుణె నగరం నుంచి మొదలుపెట్టుకుంటే సుమారు ఒకటిన్నర రోజులలో అన్ని గణపతులనూ దర్శించుకోవచ్చు. ఒక్కో గణపతి పుణె నగరం నుంచి యెంతదూరంలోవుంది, కోవెల వర్ణన, స్థలపురాణం […]

తిరుక్కడయూర్ అభిరామి కోవెల

రచన: నాగలక్ష్మి కర్రా ఈ తిరుక్కడయూర్ అనే పట్టణంలో అమృత ఘటేస్వర్ కోవెల ఉంది .ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉంది. ఈ తిరుక్కడయూర్ “మైలదుత్తురై “(మాయ వరమ్) నుంచి “పోరయార్ “వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8కిమి దూరంలో ఉంది. ముందు 60వ పెళ్లి రోజు ఇక్కడ చేయించుకునే వారు. తరవాత తరవాత ఈ కోవెలలో షష్టబ్దిపూర్తి (60 సం.), భీమార్థ శాంతి(70 సం ..నిండిన తరువాత చేసుకొనే […]

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు భృగుమహర్షి శాపము వలన దేవాలయాలు ఉండవు. ఉన్న దేవాలయాలు కూడా శివలింగాకృతిలో ఉంటాయి. అటువంటి దేవాలయాలు బ్రహ్మ, శివుడు పేర్లను కలిపి ఉంటాయి. అందుచేతనే శివుడిని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మను తలచుకుంటాము, అటువంటి దేవాలయాలలో గుంటూరు జిల్లా లోని చేబ్రోలు గ్రామములో వెలసిన చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయము చాలా ముఖ్యమైనది. ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంటాద్రి నాయుడు గారు 200 ఏళ్ల క్రితము అంటే […]

సీతాదేవి పుట్టిన జనకపురి

  రచన: నాగలక్ష్మి కర్రా     రాముడు అయోధ్య లో పుట్టేడు సరే మరి సీతాదేవి ఎక్కడపుట్టింది అని ఆలోచిస్తే జనకమహారాజు పరిపాలించిన మిధిలానగరం ప్రస్తుతం యెక్కడ వుంది అని పరిశోధిస్తే నేపాలులో “జనకపురి” అని పిలువబడుతోందని తెలిసింది, ఎక్కడుందో తెలిసిందికదా, ఆలస్యమెందుకని టూరిజం వారిని కనుక్కొని యాత్ర బుక్ చేసుకున్నాం. ఆ యాత్రా వివరాలు మీక్కూడా తెలియజేస్తాను. ఢిల్లీనుంచి ఖాట్మండు వెళ్లేం, ఆరోజు పశుపతినాధుడిని దర్శించుకొని మరునాడు ఒంటిగంటకు మా జనకపూర్ ప్రయాణం. ఖాట్మండు […]

ఉత్తరాఖండ్ లోని సప్త్ తాల్

రచన: రమ శాండిల్య Thal అంటే చెరువు అని అర్ధం. అంటే ఉత్తరాఖండ్ లో ఉన్న చెరువులు వాటి చుట్టుపక్కల గుళ్ళు , చూస్తుంటే ఆధ్యాత్మికత వద్దు మాకు అని అనుకున్నా కూడా ప్రశాంతంగా ఉండి తెలియని శాంతి వస్తుంది అక్కడ. దానికి కారణం హిమాలయ పర్వాతానికి ఉత్తరాఖండ్ పాదాలుగా చెప్పుకోవచ్చు . దూరంగా హిమాలయపర్వతాలు తెల్లగా సూర్యకిరణాలు పడుతుంటే బంగారు రంగులో కనిపిస్తుంటాయి . బద్రినాథ్ 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడినుంచి. నైనతాల్ మనందరికీ […]

శృంగేరి

రచన: నాగలక్ష్మి కర్రా ఈ వారం మనం శృంగేరీలో పర్యటిద్దాం, శృంగేరి అంటే తెలీని హిందువు వుండడనే నా అభిప్రాయం, వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ వే జ్ఞాపకం వస్తుంది, మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా, పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయి వుంటారు. ఆది శంకరాచార్యులవారు స్థాపించిన శారదాపీఠం కూడా యిక్కడే వుందనీ మనకు తెలుసు. మిగతా వివరాలు తెలుసుకుందాం. శృంగేరీ కర్నాటకలోని ‘ చికమగళూరు‘ జిల్లాలో పడమటి కనుమలలో […]

నాచారం నరసింహస్వామి గుడి

రచన: రమా శాండిల్య ఇవాళ ఉదయం లేస్తూనే ఏదైనా గుడికెళ్లాలనే కోరిక కానీ పిల్లలకు బోలెడన్ని పనులు .ఇద్దరికి వారి వారి కుటుంబాలతో పనులు నాకేమో ఎప్పటినుండో ( దగ్గర దగ్గర 8 సంవత్సరాల నుండి ) నాచారం నరసింహస్వామి గుట్ట అని వినడమే కానీ వెళ్ళడానికి అవలేదు . ఇవాళ్టి మూడ్ ఎలా అయినా గుడికెళ్లాలనుంది, నాతో పాటు ఎప్పుడైనా అడిగితే గుడికొచ్చే పంజాబీ స్నేహితురాలు ఉంది, తనకు ఫోన్ చేసాను . వెంటనే వస్తానని […]