February 23, 2024

విరించినై విరచించితిని… సిరివెన్నెల

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి చిత్రసీమలో చక్కటి పదలాలిత్యంతో, మధురమైన మాటలనే పాటలుగా మలుచుకుంటూ, చిన్న వయసులోనే పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిని వారి ఇంటి దగ్గర కలుసుకున్నాను. ఆయన గది ఒక సాహిత్యవనం లాగానే కనిపించింది. ఇంటినిచూసి, ఇల్లాలిని చూడమని సామెత. కాని ముందుగా ఇల్లాలిని చూశాకే ఇంటిని చూశాను. శ్రీమతి పద్మావతిగారు చక్కని ఆతిథ్యమిచ్చారు. “విరించినై విరచించితిని” మధురంగా మదిలో మెదులుతుండగానే చిరునవ్వుతో వచ్చారు సిరివెన్నెల. కబుర్ల కలబోతలోనే మా గోష్ఠి […]

విరించినై విరచించితిని – అడివి గీత

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి ఢిల్లీ వారిని ఆకట్టుకున్న తెలుగు కళాకారిణి గీతారావ్ కొందరిలో సహజంగా లలితకళలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ పాట ఎవరు నేర్పారు? ఈ నటనకి మార్గదర్శకులెవరు? ఈ కవిత ఎవరు రాయించారు అని ఆశ్చర్యపోనక్కరలేదు. గాలికి కదలిక ఎంత సహజమో, వెన్నెలకి చల్లదనం ఎంత సహజమో, అంత సహజంగా వారిలో కళాప్రతిభ బయటపడుతుంది. అలాంటి వ్యక్తుల కోవకు చెందిన ధీరవనిత అడివి గీత. నేనూ, శ్రీలక్ష్మీ గీత వాళ్ళ గుమ్మంలోకి అడుగుపెట్టగానే ‘రండి, రండి’ […]

విరించినై విరచించితిని – మంజుల ఘట్టమనేని

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి “నటించాలనే తపన చిన్నప్పటి నుండి వుంది” -‘షో’ మంజులతో ఇంటర్వూ చెవులు హోరెత్తే సంగీతం తోటి, అర్థం చేసుకున్నా వినిపించని సాహిత్యంతో వుండే పాటలతోటి, హింసాయుతమైన ఫైటింగ్లు, వెకిలిచేష్టలు, ద్వంద్వార్థాల హాస్యం, అర్ధనగ్న దృశ్యాలు, కలిగించే ప్రేమ సన్నివేశాలు – ఇవీ ఇప్పటి సగటు సినిమా ప్రాథమిక సూత్రాలు. వెర్రితలలు వేసే ప్రేమ సినిమాలతో విసిగెత్తిన తరుణంలో పన్నీటి జల్లులా ఇంటిల్లిపాది వెళ్ళి చూసేందుకు అనువుగా, పాటలు, ఫైట్లు లేకుండా అవసరమైనంత వరకే […]

ఆ కీర్తనల శృంగారం అతి గుంభనం – శోభారాజ్

విరించినై విరచించితిని రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి అన్నమాచార్య కీర్తన అంటే ఎవరైనా స్ఫురణకు వచ్చే అతికొద్దిమందిలో శోభారాజ్ ఒకరు. అలాగే శోభారాజ్ పేరు వినగానే అన్నమాచార్యుని కీర్తన మృదుమధురంగా వినపడుతున్నట్లే వుంది. ఆవిడ నిర్వహిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ని చూస్తేనే మనలో ఒక విధమైన భక్తిభావన కలుగుతుంది. ఆవిడతో కొన్ని ముచ్చట్లు: అన్నమాచార్య కీర్తనలపైన మీకు ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పటినుంచే నాలో భక్తిభావన ఉండేది. శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాదం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల అనుకుంటా, […]

విరించినై విరచించితిని… 2 , తనికెళ్ల భరణి

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి         నటుడైన రచయిత తనికెళ్ళ భరణి వీధి నాటకాలలో ప్రయోగాత్మకంగా అందరినీ ఆకట్టుకుని, తన డైలాగ్స్‌తో, అందులోనూ తెలంగాణా యాసలో హీరోయిన్‌కి పూర్తి పిక్చరంతా మాటలు వ్రాసి ప్రేక్షకుల మెప్పుపొందిన తనికెళ్ల భరణిగారిని అందరికీ పరిచయం చెయ్యాలనిపించింది. భరణి ఇంటికి వెళ్లాం. ‘సౌందర్యలహరి ‘ అని అందంగా రాసుంది. అందులోనే తెలుస్తున్నది ఆయన కవి హృదయం. గుమ్మంలోనే ఎదురయ్యారు వాళ్ల నాన్నగారు. మేము మాటల్లో వుండగానే వచ్చారు భరణి. […]

విరించినై… మనసున మల్లెలు – భానుమతి

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి డాకర్ పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ పేరు వినగానే కమ్మని సంగీతం, హాయిగా నవ్వుకోగలిగే హాస్యం గుర్తొస్తాయి. ఆమె అరవై సంవత్సరాల సినీజీవితంలో నటీమణిగా మాత్రమే కాదు, సంగీతజ్ఞురాలు సాహితీవేత్త, మధురగాయిని, దర్శకురాలు, నిర్మాత, ఎడిటర్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అన్నింటా ప్రవేశమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజ్యలక్ష్మీ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. గేటు దాటగానే నిలువెత్తు అలమేలుమంగా, వేంకటేశ్వరుల ఫోటోలు, ‘శరణం నీ దివ్య చరణం’ – కమ్మని కంఠం […]