April 19, 2024

విశ్వపుత్రిక వీక్షణం – 2035 లో…?!!

రచన: విజయలక్ష్మీ పండిట్   మా నాలుగో అంతస్తు అపార్ట్‌మెంట్  బాల్కనిలో రాత్రి 8 గం. సమయంలో కూర్చొని చూస్తున్న నాకు, బషీర్‌బాగ్‌  ఫ్లై ఓవర్‌పై వచ్చే వాహనాల లైట్లు మిణుకు మిణుకుమంటూ క్రిందికి జారుతూంటే కార్తీక పౌర్ణమినాడు నదిలో వదలిన దీపాలు అలలకు మెల్లగా కదులుతూ నదీ ప్రవాహంతో కూడా క్రిందికి ప్రయాణిస్తున్నట్టు అందంగా తోచాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తూ అలాగే ఆస్వాదిస్తూ వున్నాను. అంతలో రెండు రోజుల ముందు నాతో పదవతరగతి చదువుతున్న నా […]

విశ్వపుత్రిక వీక్షణం – “డిప్రెషన్‌”

రచన: విజయలక్ష్మీ పండిట్ మోగుతున్న ఫోన్‌ను తీసి ‘హలో’ అంది సుమతి. అవతలివైపు ‘హలో మేడమ్‌ నమస్కారమండి, బాగున్నారా? నేను సుధను మేడమ్‌, గుర్తుపట్టారా,” సుమతికి వెంటనే ‘సుధ’ ఎవరో గుర్తుకు రాలేదు. సుధ ”నేను మేడమ్‌ డిప్రెషన్‌ నుండి నన్ను రక్షించి నాకో భవిష్యత్తు నిచ్చారు ”. ”ఓ… సుధ బాగున్నావా అమ్మా, నీ టోన్‌లో మార్పుంది. ఎవరో అనుకున్నా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు” అడిగింది సుమతి సంతోషంతో. “మేడమ్‌ హైదరాబాద్‌లో నాకు ఇంగ్లీషు లెక్చరర్‌గా […]

విశ్వపుత్రిక వీక్షణం – కలల రెక్కలు

రచన: విజయలక్ష్మీ పండిట్ సాయంకాలం మిద్దెపైన వాకింగ్ చేస్తూంది విరజ. టప్ మని శబ్దం రావడంతో వెనుతిరిగి చూసింది. రెక్కతెగి రక్తం కారుతూ పడివుంది ఒక పావురం. ఒకరెక్కతో ఎగరడానికి ప్రయత్నిస్తూంది.  కాని వీలుకాక రెక్కను టపటపలాడిస్తూ శరీరాన్ని లాగుతూంది కష్టపడి.  క్రిందపడిన రక్తం చుక్కల పై తెగిన రెక్కను క్రిందలాగుతూ పోవడంతో ఎఱ్ఱగా రక్తం గీతలు పడ్డాయి. “అయ్యో పాపం ఎట్లా తెగింది నీ రెక్క “ అంటూ విరజ పావురాన్ని చేతుల్లోకి తీసుకుని రెక్కను […]

విశ్వపుత్రిక వీక్షణం – “మీ…టూ..అమ్మా”

రచన: విజయలక్ష్మీ పండిట్ ఆ రోజు ఆదివారం . రమ ఒకటే హడావుడి చేస్తూంది. భర్త ఆనంద్ కు ఏమి అర్థం కావడం లేదు . “ఏంటి రమ..,సండే అంత బిజీ బిజీగా ఉన్నావు ఎక్కడికెళుతున్నావు “ అని అడిగాడు భర్త ఆనందు. “ఈ రోజు సిటీలో వివిధ మహిళా మండళ్ళ మహిళలు, ఇతర ప్రోగ్రసివ్ ఉమన్ యాక్టివిస్ట్ గ్రూపులు కలిసి “ మీ ..టూ” ర్యాలీ చేస్తున్నామండి.నేను కొన్ని ప్లాకార్డులు వ్రాశాను. వాటిని ఈ కర్రలకు […]

విశ్వపుత్రిక వీక్షణం – “రహస్య స్నేహితులు”

రచన: డా. పి.విజయలక్ష్మి పండిట్ నింగిలోని నిశ్చల సంధ్య కిరణాలు నిశ్శబ్ధంగా నేలతల్లి ఒడిలో వాలి లాలిస్తున్నాయి తరులను లతలను , గడ్డి పోచలను, కొండ కోనలను. మెడలు వాల్చి పూలు ఆకులు పక్షులు నిదురమ్మ ఒడిలో తూగుతున్నాయి. అలసిన సూర్యుడ్ని అక్కున చేర్చుకుంది సంధ్య. కాలమే మైమరచి మమేక మయింది ఆ క్షణాలలో. అదనుచూసి ఆకుల సందులలో దూరి పరచుకుంటున్న నిశీధి నీడల ఊడలు, నాటుకుంటున్నాయి భూమాత శరీరంలో కర్కశంగా. అంతలో, అలముకున్న చీకటి తెరలను […]

విశ్వపుత్రిక వీక్షణం – రెక్కలకొండ

రచన: డా.విజయలక్ష్మీ పండిట్ జయ డైనింగు హాల్లోకొచ్చి “విహన్‌ను పిలిచాను వస్తున్నాడు” అంటూ భర్త అనిల్‌ వైపు తిరిగి, ”విహన్‌ మన పెరటి తోటలో వేపచెట్టును చూస్తూ నిలబడి చేతులూపుతూ మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు నాన్నా అంటే, అదిగో ఆ వేప చెట్టుతో మాట్లాడుతున్నాను. అది కొమ్మల చేతులతో పిలిచి నవ్వుతూ మాట్లాడుతుందమ్మా. దానికి పెద్ద కండ్లు, నోరు కూడా వున్నాయి చూడు అంటాడు. నాకు కనిపించడంలేదండి”అంటూ ఆందోళన పడింది జయ.అనిల్‌కు అంతా అర్థమయింది. తనకు వున్నట్టే […]

విశ్వపుత్రిక వీక్షణం .. “ప్రేమ రేఖలు”

రచన: డా. విజయలక్ష్మి పండిట్     మెరిసే మేఘల తివాసీపై నడిచి వస్తూందా హిరణ్యతార, ఆమె పాదాలు సోకి అడుగు అడుగుకు రాలుతున్నాయి నక్షత్రాలు ముత్యాల్లా .., రాలుతున్న ప్రతినక్షత్ర విస్పోటనం కురిపిస్తూంది బంగారు రజినివర్షం.., ధారగా జలజలా రాలుతున్న కాంచనచినుకులు.., ఆ హిరణ్యతార బంగారు చేలాంచలమై సముద్రుని ఒంటిపై జీరాడుతూ .., భూమ్యాకాశాన్ని కలిపే బంగారు జలతారు వంతెనయింది .., ఆ బంగారువారధి రజనిసోపానాలపై క్రిందుకి దిగితూ వచ్హాడు అందమయిన ఆ పురుషుడు..శశాంకుడు, సముద్రతలానికి […]

విశ్వపుత్రిక వీక్షణం – “ఆ ఏడు భూములు”

  రచన: విజయలక్ష్మీ పండిట్ అంతరిక్షకు ఆ రోజు కాలు ఒకచోట నిలవడం లేదు. అంతరిక్షంలో తేలుతున్నట్టే వుంది. అందుకు కారణం ఆమెకు అమెరిక అంతరిక్ష సంస్థ “నాసా”(NASA) నుండి తనకు “ట్రాపిస్ట్-।”నక్షత్రం చుట్టు తిరుగుతున్న 7 భూములపై ప్రయోగాలలో అవకాశాన్ని కలిగిస్తూ ఆహ్వానం. అంతరిక్షకు తన అద్భుతమైన కల నిజమయిన అనుభవం. తన బాల్యం నుండి అంతరిక్షకువిశ్వం అంటే ఎంతో మక్కువ. అందుకు పునాదులు వేసింది వాళ్ళ అమ్మ వసుంధర చిన్నప్పటి నుండి అంతరిక్షకు చేసిన […]

విశ్వపుత్రిక వీక్షణం 1 – రమ్య ది రోబో

రచన:విజయలక్ష్మీ పండిట్ సూపర్ బజార్ నుండి ఇంటికి వచ్చిన లక్ష్మి వరండాలో చెప్పుల స్టాండు పై చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్లి తన హాండ్ బ్యాగ్ ఢైనింగ్ టేబుల్ పై పెట్టి బాత్రూం వైపు నడిచింది. డ్రైవర్ సామాన్ల బ్యాగ్ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వెళ్లాడు. ఫ్రెషప్ అయ్యక కాఫీ తాగాలని వంటింటి వైపు నడుస్తూ అంతలో భర్త రామ్ కు కాఫీ టి ఏదయినా కావాలేమో అడగాలని ఆఫీస్ రూమ్ వై పు […]