మాలిక పత్రిక మే 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక రచయితలు, పాఠకులు, మిత్రులు, అర్చన కథల పోటీ విజేతలకు హార్ధిక స్వాగతం. మీకందరికీ తెలిసిందే. ఏదో చిన్న ఆపద అనుకున్నది ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. అన్ని దేశాలవాళ్లు తమ శక్త్యానుసారం పోరాడుతున్నారు. ఈ కోవిడ్ మహమ్మారికి బలైనవారికి శ్రధ్ధాంజలి అర్పిస్తూ, ఈ మహమ్మారినుండి మనలనందరినీ కాపాడడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, మున్సిపిల్

మాలిక పత్రిక ఏప్రిల్ 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు నమస్కారాలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మూలంగా తీవ్ర సంక్షోభంలో పడింది. పది రోజులుగా మనమంతా ఇంటికే పరిమితమయ్యాము. సాఫ్ట్ వేర్ వాళ్లు ఇంటినుండి వర్క్ చేసుకుంటున్నారు కాని ఇతర వ్యాపార, ఉద్యోగాల వాళ్లకు చాలా నష్టం… ఇక పిల్లలను గడప దాటకుండా కాపలా కాయడం, ఇంట్లోనివాళ్లకు అడిగినవి వండి పెట్టడం. పనిమనిషి డ్యూటీ అదనంగా ప్రతీ ఇల్లాలు చాలా తిప్పలు

మాలిక పత్రిక మార్చ్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head మార్చ్ నెల.. మామిడికాయలు… పళ్లు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయ్, మల్లెపూలు, మాడుస్తున్న ఎండలు… ఇవన్నీ కలసి మనని హడావిడి పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.. వీటితోపాటు నేను అంటూ కొత్తగా వచ్చిన అతిథి.. కరోనా/కోవిడ్ 2020. మహమ్మారిలా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. హైదరాబాదులో కూడా ఒకరున్నారని తేలింది. అందరూ ఖంగారు పడకుండా నివారణోపాయాలు పాటించండి. శుభ్రతని ఇంకా ఎక్కువ పాటించండి.. రూమర్స్ నమ్మకండి.. ఇక ఈ నెలలో ఎన్నో కొత్త

మాలిక పత్రిక ఫిబ్రవరి 2020 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head కొత్త సంవత్సరం వచ్చింది అప్పుడే నెల గడచిపోయింది. ఈ కాలానికి ఎందుకో అంత తొందర. ఇంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. కాలంతోపాటు మనమూ పరిగెత్తక తప్పదు మరి.. అప్పుడప్పుడు లైఫ్ బోర్ అనిపించినా ఏదో ఒక పని కాని, సంఘటన కాని, వ్యక్తి వల్ల కాని మళ్లీ జనజీవన స్రవంతిలో పడతాం. తప్పదు మరి.. ఈ నెలలో మన్నెం శారదగారి సీరియల్ చీకటి మూసిన ఏకాంతం ముగుస్తోంది. వచ్చేనెల

మాలిక పత్రిక జనవరి 2020 సంచికకు స్వాగతం..

  Jyothivalaboju Chief Editor and Content Head కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో  ముందుకు అడుగులేస్తూ, నడుస్తూ, పరుగులు పెడదాం. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది కదా. ఇప్పుడిప్పుడే కదా కొత్త సంవత్సరం అనుకున్నాం. అంతలోనే  మళ్లీ ఇంకో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ బిజీ బిజీ లైఫ్ లో అంతా వేగవంతమయిపోయింది. ఎలా తెల్లవారిందో, అప్పుడే రాత్రి కమ్ముకుందో అనపిస్తుంది. అంత వేగంగా గడిచిపోతుందని అందరూ ఒప్పుకుంటారు. పాఠకులకు,

మాలిక పత్రిక డిసెంబర్ 2019 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు ఈ సంవత్సరాంతపు సంచికకు తియ్యతియ్యగా స్వాగతం. నా అమెరికా పర్యటన కారణంగా నవంబర్ నెల సంచిక విడుదల చేయడం కుదరలేదు. దానికి క్షమాపణలు కోరుకుంటూ ఈ నెలలో కాసిన్ని ఎక్కువ సాహితీ మిఠాయిలు మీకోసం.. అప్పుడే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం కదా మళ్లీ సంవత్సరం చివరకి వచ్చేసామా అన్నట్టుంది కదా. ఏంటో ఈ కాలానికి ఇంత తొందరపాటు .. అలా వేగంగా

మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మిత్రులకు, రచయితలకు, పాఠకులకు, శ్రేయోభిలాషులందరికీ పూలపండగ, పటాకుల పండగ శుభాకాంక్షలు. ముందు రంగు రంగుల పూలతో సరాగాల పండగ , నవరాత్రులు రావణదహనంతో దసరా సంబరాలు, దీపాల వెలుగులు, హోరెత్తించే మతాబుల జోరులో దీపావళి పండగలు రాబోతున్నాయి. మీకందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాము.. ఇక ఈ నెల మాలిక పత్రికలో మీరు మెచ్చే ఎన్నో కథలు, కవితలు, సీరియళ్లు, ఆధ్యాత్మిక, ఉపయోగభరిత వ్యాసాలు, యాత్రా విశేషాలు, విజ్ఞానాత్మకమైన

మాలిక పత్రిక సెప్టెంబర్ 2019 సంచికకు స్వాగతం..

    Jyothivalaboju Chief Editor and Content Head స్వాగతం.. సుస్వాగతం.. చిరుజల్లులు, జడివానలు కలిసి మనతో ఆటాడుకుంటున్నాయి కదా.. తప్పదు మరి. ఎండలెక్కువగా ఉంటే వానలు కావాలనుకుంటాం. వానలు కాస్త జోరు పెంచితే వామ్మో అంటాం. ప్రకృతితో అడ్జస్ట్ అవ్వక తప్పదు మరి. ఈ చిరుజల్లులతో జతగా సన్నజాజులు కూడా ఉంటే ఎంత బావుంటుంది కదా.. ఎండాకాలంకంటే మనోహరమైన ఈ కాలంలో సన్నజాజుల పరిమళాలు అద్భుతం.. మహాద్భుతం.. మాలిక పత్రిక రచయితలకు, మిత్రులకు, పాఠకులకు

మాలిక పత్రిక ఆగస్టు 2019 సంచికు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ప్రియ పాఠక మిత్రులు, రచయితలకు  శ్రావణ మాసంతో పాటు రాబోయే పండగల శుభాకాంక్షలు. గత నెలలో చాలామంది ప్రముఖులు ఈ లోకం వీడిపోయారు. వారందరికీ మనఃఫూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారు చెప్పిన మంచిమాటలను మననం చేసుకుంటూ, వీలైతే పాటిస్తూ ఉందాం.. ఈ మాసంలో కూడా మీ అందరికోసం మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాము. రాబోయే రోజుల్లో మాలిక పత్రికలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాను.

మాలిక జులై స్పెషల్ సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head   శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ మరియు అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ U.S.A సంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా అందిస్తోంది.