October 16, 2021

మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులు, రచయితలందరికీ నమస్సుమాంజలి. కృతజ్ఞతలు. ప్రపంచం మొత్తాన్ని కదిలించేసిన కరోనా 2020 సంవత్సరాన్ని మింగేసింది/చెడగొట్టింది అని చెప్పవచ్చు.  కరోనా మూలంగా లాక్ డౌన్,  క్వారంటైన్ అంటూ ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉంటున్నాము. వ్యాధి తగ్గుముఖం పట్టినా ఇంకా ప్రమాదంలోనే ఉన్నాం. వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వచ్చే 2021వ సంవత్సరం మనందరికీ సుఖఃసంతోషాలను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురుచూద్దాం.. మీ రచనలను పంపవలసిన చిరునామా: […]

మాలిక పత్రిక నవంబర్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రికను ఆదరిస్తున్న రచయితలు, పాఠక మిత్రులకు ముంధుగా హృదయపూర్వక ధన్యవాదాలు .. దీపాల పండగ దీపావళి శుభాకాంక్షలు…. మాలిక పత్రిక ఎల్లప్పుడూ కొత్త రచయితలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది అని మీకు తెలిసిందే. ప్రతీ నెల కొత్త రచయితలు తమ కథలు, కవితలు పంపిస్తున్నారు. చాలా సంతోషం. మీ రచనలు ప్రతీ నెల 15 తారీఖు వరకు మాకు పంపించాలి. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com […]

మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head చిన్న గడ్డిపువ్వు కాని, కాగితం పువ్వు కాని, గులాబీ అయినా, బుల్లి మల్లియ అయినా, లిల్లీ అయినా, కార్నేషన్స్ అయినా పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటూనే తమ అందాలతో అందరికీ ఆనందాన్నిస్తాయి. కొన్ని అలంకరణకు వెళితే, కొన్ని తరుణుల వేణిలో వయ్యారంగా కూర్చుంటాయి, కొన్ని దేవుడి కొలువుకు వెళితే మరి కొన్ని అంతిమ ప్రయాణంలో తళుక్కుమంటాయి. అలంకరణ అయినా, ఆరాధన అయినా, అంతిమయాత్ర అయినా ప్రతీ పువ్వు […]

మాలిక పత్రిక సెప్టెంబర్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు సాదరపూర్వక నమస్కారములు. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఏ కష్టమొచ్చినా, తట్టుకుని ముందుకు సాగేది ఈ ప్రకృతి మాత్రమేనేమో. ఇన్నాళ్లు అందరం అనుకున్నాం. మనం ప్రకృతిని పట్టించుకోలేదు. నాశనం చేస్తూ వచ్చాము. లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండడం మూలంగా ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకుంది అని. కాని కాలానుగుణంగా పువ్వులు, మొక్కలు, అన్నీ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. వేసవిలో మల్లెల […]

మాలిక పత్రిక ఆగస్టు 2020 సంచికకు స్వాగతం…

Jyothivalaboju Chief Editor and Content Head రచయితలకు, పాఠక మిత్రులకు సాదర ఆహ్వానము. నమస్కారములు. కరోనా, లాక్ డౌన్ అని మనమంతా ఇంట్లోనే ఉన్నా, ప్రకృతి ఊరుకుంటుందా. తనపని తాను చేసుకుంటూంది. వేసవి ఎండలు, మామిడి, మల్లెలు అయిపోయి వానాకాలం మొదలైంది. చినుకులు, అప్పుడప్పుడు కుంభవృష్టితో నగరాలు, పల్లెలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. వ్యవసాయం పనులు కూడా మొదలయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు తగు జాగ్రత్తలతో వెళ్లి వస్తున్నారు. చాలామంది ఇంటినుండే పని చేస్తున్నారు. మంచిదే.. తగు జాగ్రత్తలతో […]

మాలిక పత్రిక , అర్చన 2020 పోటీ ప్రత్యేక సంచిక

Jyothivalaboju Chief Editor and Content Head పాఠకులకు, రచయితలకు సాదర ఆహ్వానం.. కొద్ది కాలం క్రిందట కోసూరి ఉమాభారతి నేతృత్వంలో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ, శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ తరఫున సామాజిక స్పృహ అంశంగా కథలు, కవితలు, కార్టూన్ల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన 33 కథలు, 19 కవితలతో మాలిక ప్రత్యేక సంచిక ముస్తాబై వచ్చింది. రచయితలందరికీ అభినందనలు.. ఎడిటర్ నుండి ఒక మనవి: […]

మాలిక పత్రిక జులై 2020 సంచికకు స్వాగతం

yothivalaboju Chief Editor and Content Head నమస్కారం.. పాఠక మిత్రులు, రచయితలు అందరికీ స్వాగతం.. మాలిక పత్రికలో మంచి వ్యాసాలు, కవితలు, కథలు మీ అందరినీ అలరిస్తున్నాయి అని భావిస్తున్నాను. అదేంటోగాని ఈ సంవత్సరం 2020 అసలు లేకుంటే బావుండు అనిపిస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అప్పుడే ఆరునెలలు గడిచిపోయాయి. ఎవరనుకున్నారు హ్యాపీ కాస్తా వరస్ట్ కి మారుతుందని. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా ఇంకా చల్లబడలేదు. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో […]

మాలిక పత్రిక జూన్ 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పాఠకులకు, రచయితలకు నమస్కారం.. ఎలా ఉన్నారు అందరూ.. కరోనా భయం పోయి, దానితో సహజీవనం మొదలెట్టేసారా… తప్పదు కదా.. ఇక మెల్లిగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి కాని చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా..  ఇంకా  ప్రమాదం తప్పలేదు. మాలిక పత్రికలో మంచి మంచి వ్యాసాలు, కథలు, సీరియల్స్  అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. […]

మాలిక పత్రిక మే 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక రచయితలు, పాఠకులు, మిత్రులు, అర్చన కథల పోటీ విజేతలకు హార్ధిక స్వాగతం. మీకందరికీ తెలిసిందే. ఏదో చిన్న ఆపద అనుకున్నది ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. అన్ని దేశాలవాళ్లు తమ శక్త్యానుసారం పోరాడుతున్నారు. ఈ కోవిడ్ మహమ్మారికి బలైనవారికి శ్రధ్ధాంజలి అర్పిస్తూ, ఈ మహమ్మారినుండి మనలనందరినీ కాపాడడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, మున్సిపిల్ […]

మాలిక పత్రిక ఏప్రిల్ 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు నమస్కారాలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మూలంగా తీవ్ర సంక్షోభంలో పడింది. పది రోజులుగా మనమంతా ఇంటికే పరిమితమయ్యాము. సాఫ్ట్ వేర్ వాళ్లు ఇంటినుండి వర్క్ చేసుకుంటున్నారు కాని ఇతర వ్యాపార, ఉద్యోగాల వాళ్లకు చాలా నష్టం… ఇక పిల్లలను గడప దాటకుండా కాపలా కాయడం, ఇంట్లోనివాళ్లకు అడిగినవి వండి పెట్టడం. పనిమనిషి డ్యూటీ అదనంగా ప్రతీ ఇల్లాలు చాలా తిప్పలు […]