March 29, 2024

చిన్ని ఆశ

రచన: నాగజ్యోతి రావిపాటి పక్షిగా నా పయనం ఎటువైపో తెలియదు..కాని నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నా.. ఆ దూర తీరాలు కనిపించి కవ్విస్తున్నా.. అలుపెరగక ముందుకు సాగుతున్నా.. నా ఈ ఒంటరి పయనంలో ఒక చోట నాలాగే మరిన్ని ఆశా జీవులు కనిపించాయి..మాట మాట కలిసి మనోభావాలు తెలిపి ఈ సారి గుంపుగా తరలి వెళుతుంటే..ఎన్నో సూర్యోదయాలు పలకరించి పారవశ్యం కలిగించాయి. ఆ మేరు పర్వతాలు గర్వంగా నిల్చుని తమ శోభను చూపుతున్నాయి. హిమాని నదుల అందం […]

కాశీ లోని పాతాళ వారాహి అమ్మవారి దేవాలయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు… వారాహి అమ్మవారి దేవాలయము కాశీలో విశ్వనాధమందిరానికి దగ్గరలో త్రిపుర భైరవి ఘాట్ వద్ద ఉన్నది. ఈ దేవాలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. వారాహి అమ్మవారు సప్తమాతలలో ఒకరు.  శ్రీ మహావిష్ణువు హిరాణ్యాక్షుడిని చంపి భూమిని కాపాడటానికి వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ అమ్మవారు శక్తిని ఇచ్చింది. ఈ దేవాలయము ఉదయము ఐదు గంటలనుండి ఎనిమిది గంటలవరకే భక్తుల సందర్శనార్ధము తెరచి ఉంచుతారు అమ్మవారికి జరిపే పూజలు సూర్యోదయానికి ముందే  తలుపులు మూసి […]

సంజయుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో ఆ రాజును నడిపించే మంత్రి అంత ముఖ్యము చాలా మంది రాజులు పేరు ప్రఖ్యాతులు వాళ్ళ మంత్రుల వల్లే వచ్చినాయి ఉదాహరణకు శ్రీ కృష్ణ దేవ రాయలు మంత్రి తిమ్మరుసు ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు వంటి వారు. రాజులు యుద్దాలు చేసి రాజ్య విస్తరణలో ఉంటె మంత్రులు రాజులకు మంచి సలహాలు ఇస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా రాజు పాలించటానికి సహకరించేవారు పాలనలో మంత్రి పాత్ర చాలా […]

కాశీలోని 12 సూర్యుని ఆలయాలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.   మన పురాణాలలో వేదాలలో 12 సూర్యుని ఆలయాల ప్రస్తావన ఉంది. మన కాల నిర్ణయం లో నెలల విభజన సూర్యుడు ఉండే నక్షత్రాల రాసుల బట్టి నిర్ణయించబడింది మన పురాణ కాలమునుండి ఉన్న నగరము కాశీ ఈ నగరానికి ఏంతో ప్రాముఖ్యత ఉంది ఈ కాశీ నగరము శివుని త్రిసూలం పై సమతుల్యముగా ఉండటం వలన వేద కాలము నుండి భౌగోళికంగా ఎన్ని మార్పులు వచ్చిన దాని ప్రాముఖ్యత కోల్పోకుండా […]

ఉదంకుడు

అంబడిపూడి శ్యామసుందర రావు. పురాణకాలములో భారతావనిలో అనేక మంది మహర్షులు ఋషి పుంగవులు ఉండి, వేదానుసారము రాజ్యాలను ఏలే రాజులకు దిశా నిర్దేశించి పాలన సక్రమముగా జరిగేటట్లు సహకరించేవారు. కానీ వారు కూడా కొన్ని సందర్భాలలో కోపతాపాలకు సామాన్యువలే గురై ప్రవర్తించేవారు. అటువంటి ఋషులలో ఉదంకుడు గురించి తెలుసుకుందాము. ఉదంకుడు వ్యాసుని శిష్యులలో ఒకరైన పైలుడి శిష్యుడు. ఉదంకుడు గురువును భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామన సాయిత ఆనే […]

అష్టావక్రుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు పూర్వము ఏకపాదుడనే నిరంతర తపోనిరతుడైన బ్రాహ్మణుడు భార్య సుజాతతో శిష్యకోటికీ వేదములు బోధిస్తూ హాయిగా గురుకులములో కాలక్షేపము చేయసాగారు. వేద విద్య బోధించే ఏకపాదుడు విద్య బోధించే విషయములో శిష్యుల పట్ల చాలా కఠినముగా వ్యవహరించేవాడు. చాలా కాలానికి ఎన్నో నోముల ఫలితముగా భర్త అనుగ్రహము చేత సుజాత గర్భవతి అయినది. గర్భములో నున్న శిశువు తండ్రి శిష్యులకు భోధించుచున్న వేదములను వల్లె వేయసాగాడు. ఒకనాడు తండ్రి వల్లె వేస్తున్నప్పుడు గర్భములో […]

సరదాకో అబద్దం

రచన: రాజన్ ప్రపంచం లో ఎక్కువ శాతం మంది ఆడేది, ఆడేకొద్దీ ఆడాలనిపించేది …….అబద్దం. నాటి ధర్మరాజు దగ్గర నుండి నేటి రాజకీయనాయకుల వరకు అందరూ ఈ ఆటలో నిష్ణాతులే. ఆ మాటకొస్తే వారే ఏమిటిలెండి.. మీరు, నేను కూడా చిన్నవో, పెద్దవో అబద్దాలు చెప్పే వాళ్ళమే. మనం ఆడిన అబద్ధాన్ని నమ్మితే అవతలి వాడు, నమ్మకపొతే మనం ఓడిపోతాం. ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంది కాబట్టే అబద్దాన్ని ఆడటం అంటారనుకుంటా. మానవ జీవితం నుండి […]

కాముని పున్నమి

రచన: లక్ష్మీదేవి ఫాల్గుణ పూర్ణిమ నాటికి పువ్వుల రంగులతో చిగుళ్ళ ఎఱుపుతో వెన్నెల నిండిన నింగీ నేలా వసంతాలాడు కుంటుంటాయి. ఫాల్గుణాలలో తెలివెన్నెలలు కురిసే కామునిపున్నమి (హోళీ) ఆమని రంగిలి శోభించడానికి ముందుమాట/ స్వాగత గీతం వంటిదే. నిండుగా పూచిన వేప , మామిడి, కానుగ అనేముంది, తరువులన్నీ, తనువులన్నీ పూలగుచ్ఛాలై శుభాకాంక్షలు అంది పుచ్చుకుంటుంటాయి. సంజె వేళల్లో వీచే ఆహ్లాదకరమైన పిల్లగాలుల వేణునాదాలకు మదిలోని తలపులు పదాలు పలుకుతుంటే పెదాలు ఒద్దికగా ఒదిగిపోతూ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి. […]

అంబ -శిఖండి వృత్తాంతము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మాహా భారతములో అనేక పాత్రలలో కారణజన్మురాలై భీష్ముడి మరణానికి కారణము అయిన అంబది చాలా ప్రత్యేకమైన పాత్ర ఈమె కాశీ రాజు ముగ్గురు కుమార్తెలలో పెద్దది ఈవిడ సాళ్వుని ప్రేమించింది ఇద్దరు వివాహము చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు ఈవిడకు భీష్ముడి మరణానికి గల సంబంధము ఏమిటో తెలుసు కుందాము. శంతనుడు మరణించాక రాజ్యపాలన భారము సత్యవతి పుత్రుల పరము అయింది భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల రాజ ప్రతినిధిగా ఉండి సత్యవతి […]

మరుజన్మంటూ ఉంటే..

రచన: స్వరూప నేను మహిళా పక్షపాతిని కాదు. పురుష ద్వేషినీ కాదు. ఆడ-మగతోనే సమాజానికి బ్యాలెన్స్ అని నమ్మే వ్యక్తిని. వాస్తవానికి నేను నా కుటుంబంలో ఎక్కడా మహిళా పక్షపాతాన్ని, ఆడపిల్లను అనే చిన్నచూపును ఎదుర్కోలేదు. మా అన్నయ్యలతో సమానంగా మా అమ్మానాన్న నాకు స్వేచ్ఛనిచ్చారు. మా అన్నయ్యల కంటే కూడా నాన్న నన్ను ఎక్కువ ప్రేమగా చూసేవారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే అయి ఉంటుందని నా కాలేజీ రోజుల నుంచే మా కుటుంబానికి […]