June 25, 2024

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -10

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 24. పని- కుటుంబం, పని-కుటుంబం. డా. పీజే బ్రహ్మానందం (డా. పీజేబీ) పీజీ ఐ ఎమ్ ఈ ఆర్ లో మా ఆర్థోపీడిక్ కొలీగ్స్ లో ఒకరు, విజయ వాడలో రెండేళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ మాకు చాలా సహాయపడుతున్నారు. అతను నన్ను చుట్టుపక్కల గ్రామాలకు తీసుకువెళ్ళి నన్ను ప్లాస్టిక్ సర్జన్ గా పరిచయం చేస్తాడు. మేం సలీం ఒక గాస్ట్రోస్కోప్ తెప్పిస్తాడనీ , మొట్టమొదటిసారి వస్తున్న పరికరం […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8

రచన: శ్రీమతి లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 21. కష్టమైన నిర్ణయం వేసవి పూర్తయే వేళకు సలీం తన ఎక్జామ్ తో బిజీగా ఉన్నాడు. కాని అతను మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు కనిపించాడు. ముఖ్యంగా రాత్రిళ్ళు బాబీ విషయంలో సాయపడుతూనే ఉన్నా అతన్ని ఏం బాధిస్తోందో నాకు అర్ధం కాలేదు. తన ఎక్జామ్ రాయడానికి జూన్ లో డబ్లిన్ వెళ్ళాడు. కాని అది క్లియర్ చెయ్యకుండానే నిరాశగా తిరిగి వచ్చాడు. సలీం కొత్త జాబ్ మొదలుపెట్టే […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 8

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 18. ఒక సంఘటనాత్మక శీతాకాలం అది మంచు కురిసే క్రిస్మస్ సమయం. మాకంటే ఎక్కువ అమ్ము ఈ పండుగ సందడిని ఆనందిస్తోంది. శాంటా నుండి తనకు కావలసిన బహుమతుల పట్టిక నిర్దాక్షిణ్యంగా రాసింది. సలీం క్రిస్మస్ పార్టీలకు వెళ్తూంటే, నేను అమ్ముతో ఇంట్లో ఉండిపోయాను. అలాగని నాకు పెద్ద బాధగా కూడా లేదు. ఒకప్పుడు సలీం గురించి ఎలా అనుకునేదాన్నో ఇప్పుడలా అనిపించడం లేదు. అతని పట్ల […]

స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు -7

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 16. ఏమీ తెలియని దేశంలో ప్రవేశం 1978 నవంబర్ లో ఏమీ తెలియని మట్టి మీద, హీత్రో విమానాశ్రయంలో, చేతుల్లో నా కూతురితో కాలు మోపాం. జాతి వివక్ష గురించి ఎన్నో చదివాం, ఎన్నో విన్నాం. ఆసియా డాక్టర్ల స్థితి గతుల గురించీ, భెల్ఫాస్ట్ లో బాంబ్ విసరడాల గురించీ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో.. నాలో ఎన్నో ప్రశ్నలు, తొందరపడి ఇక్కడికి వచ్చామా అనికూడా అనుకున్నాను. నేను […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 6

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 13. మా జీవితల్లోకి ఒక అపరిచిత ఆగమనం. మా పని మేం చేసుకుంటూ, చిన్నారిని చూసుకుంటూ గడిపేస్తున్న సమయంలో జీవితం ఒక అనుకోని మలుపు తిరిగింది. అయితే అప్పుడు నాకా విషయం తెలీదు. వింటర్ సెమిస్టర్ సమయంలో ఒక ఆంధ్రా అమ్మాయి, నాగ్, పారామెడికల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయింది. అక్కడ నేను మాత్రమే మరో ఆంధ్రా అమ్మాయిని కావడంతో ఆమె సోదరుడు నన్ను అడిగాడు. తనకు […]

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -5

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 10. ఎమ్ సీ ఎచ్ ప్లాస్టిక్ సర్జరీ – ఒక జీవితకాలపు అవకాశం ఎలాటి సహాయమూ సపోర్ట్ లేకుండా, ఢిల్లీలో ఉండే నా సోదరుడు ప్రేమ్ అతని భార్య సుజాత నుంచి కొంత ఎదురు చూస్తూన్నాను. వాళ్ళు మమ్మల్ని చూడటానికి చండీఘడ్ వచ్చినప్పుడు నన్ను డెలివరీకి ఢిల్లీ ఆహ్వానిస్తారని ఆశ పడ్డాను. కాని అలాటిదేమీ లేకపోడంతో నేనూ ఆ విషయం ప్రస్తావించలేదు. కాని ఒప్పుకోవలసిన విషయం నేను […]

స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు – 4

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 8. పెళ్ళికి రహదారి ఇంటి మీద బెంగతో మిగతావన్నీ వదిలేసి వెళ్ళి అమ్మనూ నాన్ననూ చూడాలని నిశ్చయించుకున్నాను. నాతో పాటు సలీమ్ కూడా రావాలని ఆశపడినా, పనిలో అతనికి క్షణం తీరిక దొరక్క కనీసం నన్ను బస్ ఎక్కించడానికి కూడా రాలేకపోయాడు. నెలల గర్భవతిని అయినా చండీఘడ్ నుండి ఢిల్లీ బస్ ప్రయాణం, అక్కడినుండి ముప్పై ఆరు గంటల రైలు ప్రయాణం తప్పలేదు. రెండు రోజుల తరువాత […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -3

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 4. ప్రేమ ప్రకటన మిగతా ఆ వయసులో ఉండే చాలామంది అమ్మాయిల్లాగే విదేశాల్లో సెటిల్ అయిన ఎంతో మంది డాక్టర్ల సంబంధాలు వరదలా వచ్చిపడ్డాయి. ప్రతి సంబంధమూ ఏదో ఒక వంక పెట్టి తిరగగొట్టేదాన్ని. ఈ విషయ్ం సలీమ్ తో చర్చించి ఇద్దరం నవ్వుకునే వాళ్ళం. నా మనసులో మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే అది సలీమ్ తప్ప మరొకరు కాదని నిశ్చయించుకున్నాను. ఇంకెవరినో పెళ్ళి చేసుకుని […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -2

రచన: డా.లక్ష్మీ సలీమ్ ఎం ఎస్. ఏమ్ సీ ఎచ్ అనువాదం: స్వాతీ శ్రీపాద 2. మెడికల్ స్కూల్‌లో ప్రవేశం నా స్కూల్ జీవితం పుస్తకాల్లో, అసైన్మెంట్లలో పీకల్లోతు మునిగి ఉండేదనుకుంటే మెడికల్ స్కూల్ ప్రవేశానికి నా తయారీ మరింత కఠినతరం అయింది. నాన్న నిజామీ హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న జహీరాబాద్ బ్ర్రిడ్జ్ ప్రాజెక్ట్ కు పనిచేస్తూ ఉండడంవల్ల కుటుంబాన్ని హైదరాబాద్ కు మార్చారు. మళ్ళీ మాధ్యమం ఇంగ్లీష్ కావడం వల్ల క్లాసులో ఫస్ట్ రాడానికి […]

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -1

ఒక భారతీయ ప్లాస్టిక్ సర్జన్ జీవిత చరిత్ర ఆంగ్లమూలం : డా.లక్ష్మీ సలీమ్ ఎం ఎస్. : ఏమ్ సీ ఎచ్ తెలుగు సేత : స్వాతీ శ్రీపాద 1. బాల్యం అందరి రాతలూ భగవంతుడు రాసే ఉన్నాడని అంటారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన శక్తి అంతా ఆ వైపుకే మళ్ళుతుంది. రసవాది పాల్ కియొహో చెప్పినట్టు “నువ్వు ఏదో ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు విశ్వమంతా నీకు సహాయపడేందుకు సమాయత్తమవుతుంది […]