March 29, 2024

రాజీపడిన బంధం – 14

రచన: ఉమాభారతి కోసూరి ఆరేళ్ళ తరువాత పొద్దునే పిల్లలకి టిఫిన్లు వడ్డిస్తుండగా, టీ.వి న్యూస్ ఛానల్ చూడమని ఫోన్ చేసింది చిత్ర. టీవి ఆన్ చేసాను. క్రీడారంగం వార్తలు చెబుతున్నారు… ‘…ఢిల్లీ స్విమ్మింగ్ కమిషన్ వారు, సందీప్ మధురై అనే యువ స్విమ్మర్ ని నేషనల్ జూనియర్ స్విమ్ టీమ్ కి కెప్టెన్ గా సెలెక్ట్ చేసారు. పదహారేళ్ళ వయసులో అంతటి గుర్తింపు అనూహ్యమైనదే’. ‘అంతే కాదు, ఈ యువ ఈతగాడు ఒకప్పటి ప్రఖ్యాత క్రీడాకారుడు శ్యాంప్రసాద్ […]

చంద్రోదయం – 14

రచన: మన్నెం శారద సారధి బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి టేబుల్ మీద లెటర్ వుంది. అది శేఖర్ దస్తూరి గుర్తుపట్టేడు సారధి. వెంటనే ఆత్రంగా విప్పేడు. డియర్ సారధి, నువ్వెళ్లిపోయాక వైజాగ్ కళ పోయింది. సముద్రం చిన్నబుచ్చుకుంది. బీచ్ రోడ్డు బావురుమంటోంది. ఎల్లమ్మ తోట సెంటర్ వెలవెలా బోతోంది. మరి నీకక్కడ ఎలావుందో? ఈ పరిస్థితిలో స్వాతే లేకపోతే నీ ఎడబాటు నాకు పిచ్చెక్కించేసేదే. నీ బెంగవల్లనేమో నా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మరేం కంగారుపడకు. కాస్త […]

అమ్మమ్మ – 24

రచన: గిరిజ పీసపాటి వారం రోజులు ఉన్నాక తిరిగి విశాఖపట్నం వెళ్ళి, అక్కడి నుండి హైదరాబాదు వెళిపోయింది అమ్మమ్మ. తరువాత రెండు సంవత్సరాల పాటు మళ్ళీ నాగను, మనవలను చూడడానికి వెళ్ళలేకపోయింది. మూడవ సంవత్సరం సంక్రాంతికి ‘నాగను పిల్లలనీ తీసుకుని తెనాలి రమ్మని, అక్కడ అందరూ ముఖ్యంగా పెద్దన్నయ్య కుటుంబం నాగను చూడాలని ఉందని తనకు ఉత్తరాలు రాసున్నారని, ఈ సంవత్సరం పండుగ తెనాలిలో జరుపుకుందామ’ని పెదబాబుకి ఉత్తరం రాసింది అమ్మమ్మ. ‘ఆ విషయం మా నాన్నని […]

అమ్మమ్మ – 23

రచన: గిరిజ పీసపాటి ‘పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు మాత్రమే’ అనుకునే రోజులవి. తనకు కొడుకు పుట్టినా దక్కలేదు. కనుక, వియ్యంకుడికైనా మనవడు పుడితే బాగుండునని అమ్మమ్మ ఆరాటం. అంతే తప్ప ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఎంత మాత్రమూ కాదు. నాగ తోడికోడలికి కూతురు పుట్టిన ఏడు నెలలకు నాగ మళ్ళీ గర్భవతి అయిందని వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మమ్మకి. మళ్ళీ అమ్మమ్మకి హడావుడి మొదలైంది. ఈసారి తొమ్మిదవ నెలలో రాముడువలస వెళ్ళి, […]

చంద్రోదయం 13

రచన: మన్నెం శారద అతని కళ్ళు మసకబారుతున్నాయి. చీకటిని మింగుతోన్న సముద్రం నల్లగా మారుతోంది. అతని కళ్లనుంచి రెండు వేడి కన్నీటి బొట్లు జారిపడ్డాయి. ఇప్పటికే శేఖర్‌కి తానన్ని విభాగాలుగా రుణపడిపోయి వున్నాడు. ఇంకా అతన్ని స్నేహం పేరుతో దోచలేడు. శేఖర్ మనస్ఫూర్తిగా స్వాతిని ఇష్టపడుతున్నాడు. పెళ్ళికూతుర్ని చూసి వచ్చిన దగ్గర నుంచి ఊహాలోకంలో తేలిపోతున్నాడు. అలాంటి శేఖర్‌కి నిజాన్ని చెప్పి అఘాధంలోకి త్రోయలేడు. ఈ రోజు తను, తన వాళ్ళు ఇలా సుఖంగా బ్రతకటానికి అతనే […]

అమ్మమ్మ – 21

రచన: గిరిజ పీసపాటి తమ పక్కింటి వాళ్ళకు ఫోన్ ఉండడంతో, వాళ్ళ పర్మిషన్ తీసుకుని, తెలిసిన వాళ్ళకు వాళ్ళ నంబర్ ఇచ్చింది అమ్మమ్మ. కేవలం వంట పని ఉంటే తనకు చెప్పడానికి తప్ప ఇతర కారణాలకు ఆ నంబర్ కి ఫోన్ చెయ్యొద్దని అందరికీ మరీ మరీ చెప్పింది. దగ్గరలో ఉంటున్న భార్యాభర్తలను కూడా తనతో కలిసి వంట పనికి తీసుకెళ్ళసాగింది. పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వార్చడం వంటి కొన్ని బరువు పనులకు అతన్ని వినియోగించసాగింది. […]

అమ్మమ్మ – 20

రచన: గిరిజ పీసపాటి తెనాలిలో పది రోజుల పాటు కష్టపడినా రాని సొమ్ము హైదరాబాదులో ఒక్కరోజు వంట చేస్తే వచ్చింది. అదే అమ్మమ్మకి చాలా అబ్బురంగా అనిపించింది. “రాజేశ్వరమ్మా! వాళ్ళు పొరపాటున ఎక్కువ ఇచ్చినట్లున్నారు. ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళకు ఎక్కువ ఇచ్చారని చెప్తాను” అన్న అమ్మమ్మను ఆపేసారు రాజేశ్వరమ్మ గారు. “ఈ ఊరిలో వంట చేసేవారు ముఖ్యంగా మన గుంటూరు వంట చేసే బ్రాహ్మణ స్త్రీలు దొరకడం కష్టం. అందుకే వాళ్ళు మీ పని మెచ్చుకుని […]

తామసి – 1

రచన: మాలతి దేచిరాజు సూర్యోదయమైన కొన్ని గంటలకి, సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఒక విల్లా… “జగమంత కుటుంబం నాదీ… ఏకాకి జీవితం నాదీ!” అంటూ మోగుతోంది రింగ్ టోను.. దుప్పటిలో నుంచి చేయి బయట పెట్టి ఫోన్ అందుకున్నాడు గౌతమ్. “హలో.. ” అప్పుడే నిద్రలో నుంచి లేవడంతో బొంగురుగా ఉంది అతని గొంతు. “హలో నేను…”అమ్మాయి స్వరం ఆ స్వరం వినగానే అతని నాడీ వ్యవస్థ అప్రమత్తమైంది. ఉదయాన్నే చెవిలో అమృతం పోసినట్టు ఉందా […]

రాజీపడిన బంధం .. 4

రచన: ఉమాభారతి ఇవాళ ఆదివారం అవడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు.. పొద్దుటే సందడిగా ఇంటి వెనుకనున్న పోర్టికోలో స్టవ్ పెట్టించి దోసెలు వేసి వడ్డించారు అత్తమ్మ. తరువాత మార్కెట్టుకి వెళ్లి శ్యాం స్వయంగా తనకి కావాల్సిన కూరలవీ తెచ్చి దగ్గరుండి వండించారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక అందరూ కాస్త నడుం వాల్చారు. బాబుని నిద్రపుచ్చాక వాడి గదిలోనే క్రిబ్బులో వేసి, ఎదురు గదిలో పేపర్ చదువుతున్న శ్యాం వద్దకు వెళ్లాను. “రాత్రంతా బాబు కడుపునొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడే […]

చంద్రోదయం.. 1.

రచన: మన్నెం శారద అవి కృష్ణపక్షపు తొలి రోజులు. మిగలకాగిన పాలలా వెన్నెల ఎర్రగా వుంది. దూరంగా చర్చి గంటలు పదకొండుసార్లు మ్రోగేయి. సారధి చెయ్యి చుర్రుమంటే చేతిలో చివరిదాకా కాలిన సిగరెట్టుని క్రిందకి విసిరేసి మరొకటి అంటించేడు. ఆ చీకటిలో అతని నోట్లో వెలుగుతోన్న సిగరెట్టు ఒంటికన్ను రాక్షసుడిలా ఎర్రగా వుంది. కళ్ళెర్రబడి మండుతుంటే సారధి ఇదమిద్దంగా లేని ఆలోచనలతో అస్థిమితంగా కదిలేడు. గుమ్మం దగ్గర గాజుల చప్పుడు. సారధి వెనక్కి తిరిగి చూసేడు. స్వాతి […]