April 19, 2024

బ్రహ్మలిఖితం 13

రచన: మన్నెం శారద అర్ధరాత్రి దాటింది. ఈశ్వరికెంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. పదే పదే వెంకట్ రూపం కళ్ళలో కవ్విస్తూ కనబడుతోంది. అతనే తన భర్తన్న భావన ఆమె మస్తిష్కంలో క్షణక్షణం బలపడసాగింది. పక్కనే పడుకున్న కుటుంబరావు నిద్రలో ఆమె మీద చెయ్యి వేసాడు. బలమైన సర్పం మీద పడినట్లుగా ఆమె ఉలిక్కిపడింది. వెంటనే ఆ చేతిని చీదరగా విసిరికొట్టింది. కుటుంబరావుకి మెలకువ రాలేదు. ఈశ్వరి అతన్ని పరాయి వ్యక్తిలా గమనించింది. అతను కొద్దిగా నోరు తెరిచి […]

రెండో జీవితం 3

రచన: అంగులూరి అంజనీదేవి ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్‌ చేసి.. కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు ద్రోణ. కూర్చుంది ఆముక్త. ద్రోణ వేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది ఆముక్త. మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదేస్థాయి ఆనందంలో వున్నాడు ద్రోణ. ద్రోణ చాలా చిన్న వయసునుండే చిత్రాలు గీస్తున్నాడు. ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తుంటాడు. అతని చిత్రాలు మిగిలిన వాళ్లకన్నా విభిన్నంగా వుంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని […]

మాయానగరం – 40

రచన: భువనచంద్ర జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని అలరిస్తావు… సడన్ గా మమల్ని నీలో కలిపేసుకుంటావు! చావు పుట్టుక.. యీ రెండు అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమేగా యీ జీవితం. ఆలోచిస్తూ నడుస్తున్నాడు రుషి. సవ్యాద్రి అండతో […]

రెండో జీవితం

రచన : అంగులూరి అంజనీదేవి జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామో అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి […]

బ్రహ్మలిఖితం .. 11

రచన: మన్నెం శారద అతను తలదించుకుని టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాడు. కోయదొర లిఖిత వైపు చూసి చిరునవ్వుతో “మేం కూడా కూటి కోసం అబద్ధాలడతాం. కాని మా సమ్మక్క జాతరలు నిష్టగా చేస్తం. పూజలో వుంటే పెళ్ళాన్ని కూడా తల్లిలానే చూస్తం. ఇపుడు చెప్పు. పుస్తకల్లో చ్ అదివి నాగరికత తెలుసుకునే మీ బస్తీ జనాలు పరగడుపునే పాపాలు చేస్తారా లెదా? ఇంతోటీ గోరాలు మా అదవిలో చిత్తకార్తి ఊరకుక్కలు కూదా సెయ్యవు!” అన్నాడూ. లిఖిత అతనికి […]

మాయానగరం – 38

రచన: భువనచంద్ర “ఇన్నేళ్ళుగా మీరిక్కడ వుంటున్నారు? నాకు తెలిసి, ఇది నీరు లేక మోడుగా మారిన దేవాలయం. దీన్ని ఇంత పచ్చగా చేసినవారెవరు? ” అడిగాడు రుషి. రుషికి ఇరవై తొమ్మిదేళ్ళు వుంటాయి. అందంగా, దబ్బపండుగా వుంటాడు. వొంటి మీద కాషాయ రంగు పైజామా లాల్చీ వున్నాయి. మెడలో రెండు మూడు పూసల దండలూ, ఓ రుద్రాక్షమాలా వున్నాయి. భుజాన వేలాడుతూ ఓ కాషాయ సంచీ. అతడంతట అతను వచ్చి అమరేశ్వర అవధానిగార్ని పరిచయం చేసుకున్నాడు. ” […]

బ్రహ్మలిఖితం – 10

రచన: మన్నెం శారద “రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా […]

జీవితం ఇలా కూడా ఉంటుందా? – 12

రచన: అంగులూరి అంజనీదేవి రోజులు గడుస్తున్నాయి. అరుణోదయం వేళ అప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఇళ్ల మధ్యలోంచి, చెట్ల మధ్యలోంచి తొంగి చూస్తున్నాడు. ఆ సూర్యుని లేలేత కిరణాలు సోకి ఆరుబయట గంగిరావిచెట్టు కింద నవారు మంచంలో పడుకొని వున్న సతీష్‌చంద్ర కొడుకు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. గాలికి వూగే మొక్కజొన్న కంకుల్లా పిడికిళ్లను పైకి లేపి కదిలిస్తూ కాళ్లతో మంచం మీద తన్ని పైకి జరగాలని చూస్తున్నాడు. సతీష్‌చంద్ర ఫ్రేమ్‌ కుర్చీలో కూర్చుని బాబునే చూస్తూ […]

Gausips.. ఎగిసే కెరటాలు-13

రచన:- శ్రీసత్యగౌతమి రాకేష్ తో తెగతెంపులు చేసుకొని నేరుగా కౌశిక్ రూం వైపు నడుస్తూ … లహరి ఆఫీసు రూం ని దాటుతోంది. ఎందుకో కాస్త మనసు బాధ కలిగింది సింథియాకు, అక్కడ లహరి కనబడకపోయేసరికి. ఆమె రూం లో లైట్ లేదు. అందరూ ఆ చుట్టు ప్రక్కలే ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నారు. కౌశిక్, సింథియాల అలికిడి ఉన్నా, శబ్దం రాని సముద్రపు అలలా అనిపిస్తున్నది సింథియాకు. “లహరి నిష్క్రమణ ఇంత బాధిస్తున్నదెందుకు నాకు? చేసిన పాపం […]

ఇస్లాం మతం

రచన: శారదా ప్రసాద్ భారతదేశంలో హిందూమతం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది . 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు ఉన్నారు.ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు. ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది.ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త (ఆఖరి ప్రవక్త) స్థాపించిన మతం కాదు ఇది […]