April 25, 2024

అమ్మమ్మ – 56

రచన: గిరిజ పీసపాటి మగ పెళ్ళివారి బంధువులలో ఒకాయన ముఖ్యమైన ఘట్టాలను ఫోటోలు తీస్తున్నాడు. పురోహితుడు చెప్పిన విధంగా పూజ చేస్తున్న కామేశ్వరి చెవిలో “అందుకే నీకు చిన్నప్పుడు చిలక్కి చెప్పినట్లు చెప్పాను. తలంటి పోసుకునేటప్పుడు ఏడుస్తే… నీ పెళ్ళిలో పెద్ద వాన పడుతుందని. నా మాట విన్నావా!? ఇప్పుడు చూడు… ఎంత పెద్ద వానో…” అంది వసంత ఆట పట్టిస్తూ… కాబోయే భర్త పక్కనే ఉండడంతో…. కామేశ్వరి తిరిగి అక్కను ఏమీ అనలేక గుర్రుగా చూస్తూ […]

అమ్మమ్మ – 55

రచన: గిరిజ పీసపాటి భోజనం పిలుపులకు పాపమ్మ గారు చిన్న కోడలితో పాటు బావగారి కోడలిని, అక్కగారి కోడళ్ళను, వారి భర్తలను వెళ్ళమన్నారు. వారితో పాటూ పొలోమంటూ మిగిలిన పిల్లలంతా బయలుదేరడంతో… వీళ్ళతో వీళ్ళ టీమ్ లీడర్, పెళ్ళికూతురి వయసువాడు, వరుసకు మామయ్య అయ్యే చంద్రమౌళి కూడా ఉన్నాడు‌. “చంద్రా! మళ్ళీ వాళ్ళను తోటకి తీసుకెళ్ళకు. ఇందాకే తాతకు కోపం వచ్చింది. చెల్లిని పల్లకిలో తోటకి పంపిద్దామనుకున్నారు. అది లేకపోతే లక్ష్మినో, వాణినో (కామేశ్వరి తరువాతి ఆడపిల్లలు) […]

అమ్మమ్మ – 53

రచన: గిరిజా పీసపాటి వసంతకు మూడు రోజుల తరువాత, కాళ్ళు తీసేయాల్సిన ప్రమాదం తప్పిందని చెప్పి, రెండు కాళ్ళకి ఆపరేషన్ చేసారు డాక్టర్. మరో పదిహేను రోజుల తరువాత డిస్చార్జ్ చెయ్యడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత కూడా నెలరోజుల పాటు నడక లేకపోవడంతో నాగ, గిరిజ పసిపిల్లను సాకినట్లు సాకారు వసంతను. రెండు పూటలా డ్రెస్సింగ్ నాగే చేసేది. వసంత తేరుకుని కాస్త నడక మొదలుపెట్టిందనగా ఉద్యోగం, ఇంటి పని, చదువు మొదలైన వత్తిడి […]

అమ్మమ్మ – 52

రచన: గిరిజ పీసపాటి “తెలియదు పెద్ద తల్లీ! ఈ రోజు రాత్రికి విజయనగరంలో పెళ్ళి ఉంది. అక్కడికని చెప్పి ఇలా వచ్చాను” అన్నారాయన. మరో రెండు గంటల పాటు మాట్లాడుకుని బాగా చీకటి పడటంతో ‘ఇక బయల్దేరరామని’ చెప్పి లేచారంతా. “ఒక్క నిముషం” అంటూ తన కేష్ బేగ్ లోంచి పాత డైరీ ఒకటి తీసి, అందులోంచి ఒక పేపర్ చించి, దాని మీద ఒక అడ్రెస్ రాసి ఇస్తూ “ఇక మీద మీరు నాకు ఉత్తరం […]

అమ్మమ్మ – 50

రచన: గిరిజా పీసపాటి ఇక తప్పదన్నట్లు గబగబా అన్నీ సర్దేసి, బయట ఉన్న మారుతీ వేన్ దగ్గరకు వెళ్ళింది. డ్రైవింగ్ సీట్లో కూర్చుని కనిపించారు గణేష్‌గారు. గిరిజ కారు దగ్గరకు రాగానే ఉల్లాస్ వెనుక సీట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. గిరిజ వెనుక సీట్లో కూర్చోగానే, డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో ఉల్లాస్ కూర్చున్నాడు. గిరిజ చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ళ ఇంటి ముందు వేన్ ఆగగానే “లోపలికి రండి సర్” అంది గిరిజ మర్యాదగా. “నో […]

అమ్మమ్మ – 49

రచన: గిరిజ పీసపాటి అందరూ ప్రసాదం తిన్నాక, గిరిజకు రెండు స్టీల్ బాక్సులలో పులిహోర, రెండు బాక్సులలో పరమాన్నం పెట్టిచ్చి, గణేష్ గారికి ఒక బాక్స్ పులిహోర, పరమాన్నం, మిగిలిన రెండు బాక్స్ లలో ఉన్నవి స్టాఫ్ అందరికీ పంచమని చెప్పింది వసంత. లేట్ పర్మిషన్ పెట్టినప్పటికీ టైమ్ కే షాప్ కి చేరుకుంది గిరిజ. గిరిజను చూస్తూనే “హేపీ బర్త్ డే తల్లీ!” అంటూ విష్ చేసిన గణేష్ గారితో “థాంక్యూ సర్” అంటూ, తన […]

అమ్మమ్మ – 48

రచన: గిరిజ పీసపాటి వెంటనే గిరిజ కాలిక్యులేటర్ ముందేసుకుని లెక్క చూసి ఐదు వందలు జీతం, రెండు రోజులు సెలవు పెట్టనందుకు అదనంగా ముఫ్ఫై మూడు రూపాయలు ఇచ్చినట్టున్నారమ్మా!” అంది. “నీకెమన్నా మెంటలా? జాయిన్ అయి రెండు నెలలు కూడా కాలేదు! అప్పుడే జీతం పెంచుతారా ఎవరైనా?” అని వసంత అడగడంతో ఆరోజు షాప్ లో జరిగినదంతా చెప్పింది. అంతా విన్న నాగ “ఆయనకు నీ వర్క్ నచ్చి జీతం పెంచితే సంతోషించాల్సిన విషయమే. కానీ మన […]

అమ్మమ్మ – 47

రచన: గిరిజ పీసపాటి వేసవి కాలం కావడంతో పగలు పెద్దగా కస్టమర్ల తాకిడి ఉండకపోవడంతో ఖాళీగా ఉన్న గిరిజ, తనతో పాటు కనిపిస్తున్న మరో ఆడ ప్రాణిని కుతూహలంగా చూడసాగింది. ఆ అమ్మాయి కూడా మధ్యమధ్యలో గిరిజను చూసినా, బాస్ తననే చూస్తూ ఉండడంతో తల తిప్పేసుకుంటోంది. మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వెళ్ళడానికి సీట్లోంచి లేచి, బాస్ దగ్గరకు వెళ్ళి “సర్! భోజనానికి వెళ్ళొస్తాను” అని చెప్పింది గిరిజ. ఆయన “ఒక్క నిముషం ఉండండి మేడమ్!” […]

అమ్మమ్మ – 45

రచన: గిరిజ పీసపాటి రాత్రి షాప్ నుండి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన గిరిజ, తనకోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులందరికీ షాప్ సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరించి “అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే, ఇదివరకు బిల్స్ రాసే ఆవిడ తిరిగి వచ్చేవరకే నాకీ ఉద్యోగం ఉంటుంది.” “ఆవిడ తమిళియన్ కావడంతో మద్రాస్ (ఇప్పుడు చెన్నై) వెళ్ళిందట. రెండు మూడు నెలల్లో ఆవిడ వచ్చేస్తుంది. తరువాత మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి” అంది కొంచెం దిగులుగా. “ఏం పరవాలేదు గిరీ! […]

అమ్మమ్మ – 44

రచన: గిరిజ పీసపాటి   కానీ, ఆరోజు మధ్యాహ్నం అవుతున్న కొద్దీ విపరీతమైన తలనొప్పితో పాటు వాంతులు కూడా అవసాగాయి గిరిజకి. ఇదివరకు తండ్రి ఉన్నప్పుడు కూడా అలా తరచూ జరుగుతూండడంతో డాక్టర్ కి చూపిస్తే, అది మైగ్రేన్ తలనొప్పి అని, తలనొప్పి వచ్చినప్పుడల్లా వాడమని టాబ్లెట్స్ ఇచ్చారు. కొద్దిగా మజ్జిగ అన్నం తిని టాబ్లెట్ వేసుకొని అరగంట ఆగి, తలనొప్పి ఇంకా తగ్గక ముందే గబగబా ఇంటర్వ్యూ కి వెళ్లడం కోసం తయారవసాగింది. ఇంతలో అమ్మమ్మ […]