April 20, 2024

భగవత్ తత్వం

రచన: సి.హెచ్.ప్రతాప్ దైవశక్తి భిన్ననామాలతో ప్రకాశిస్తుంది. ఏ రూపమైనా వాటి మూల తత్త్వం, పరతత్త్వం ఒక్కటేనని ముందుగా అర్ధం చేసుకోవాలి. భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. నేటి కాలంలో భగవంతుని గూర్చి మిడి మిడి జ్ఞాతంతో తమకు అన్నీ తెలుసనుకునేవారే ఎక్కువగా వుంటారని శ్రీ కృష్ణుడు ఆనాడే మానవాళిని హెచ్చరించాడు. అసలు భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అసలు ఉన్నాడా? లేడా? అన్న సందేహం మాత్రం అందరికీ ఉంటుంది. కాని భగవంతునికి ఆకారం లేదు. నామం […]

రామాయణంలో తాటక వధ

రచన: కర్లపాలెం హనుమంతరావు తన యజ్ఞ సంరక్షణార్ధం, రామలక్ష్మణులను, విశ్వామిత్రుడు అయోధ్య నుండి తీసుకొని పోతున్నాడు. సరయూ నదీ దక్షిణ తీరం చేరారు ముగ్గురూ. బల, అతిబల అనే మంత్రాలు , విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రబోధించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల అలసట కలుగదు. జ్వరం రాదు. ఆకలి దప్పులు ఉండవు. రూపంలో మార్పురాదు. నిద్రలో ఉన్నా , జాగ్రదావస్థలో ఉన్నా రాక్షసులు బెదిరించలేరు . ఆ రాత్రి ముగ్గురూ సరయూ నదీ తీరంలో సుఖంగా విశ్రమించారు. […]

దానశీలత

రచన: సి.హెచ్.ప్రతాప్     దానంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. నభూతో నభవిష్యతి అన్న చందాన అతని దాన ప్రస్థానం సాగింది. జన్మత: సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఒక కపట ఉపాయం ఆలోచించి పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు. దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు. […]

|| భక్తి మాలిక తిరుప్పావై ||

రచన: శ్రీ సత్య గౌతమి కడలిలో మహానదులు కలిసిపోయేట్లు విష్ణుభక్తి అనే కడలిలో నిరంతరంగా సాగే అలే “గోదా”. విష్ణుభక్తిని చిత్తము నందు ధరించిన భట్టనాధుడికి ఆ భక్తే తులసీవనాన ఒక పాపగా దర్శనమయ్యింది. ఆ పాపే, విష్ణుచిత్తుడు బిడ్డగా పొందిన “కోదై (తులసి మాల)”. ఆమె యే ఈ “గోదా”. నిరంతర విష్ణుభక్తి కలబోసిన వాతావరణం లో పెరిగిన గోదా, కృష్ణతత్వాన్ని శోధిస్తూ ప్రణయతత్వం అనే నావలో ప్రయాణం మొదలుపెట్టి అచంచలమైన ఆరాధనా, భక్తి, విశ్వాసాలతో […]

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టకం

రచన: ఇరువంటి మాధురి దేవి అంబా శాంభవి శాంకరీ శార్వరీ పార్వతీ కాశీ ప్రాసాద నాయకీ శ్రీ క్రీం శుహదరీ సాయుజ్యామృత ప్రదాయినీ ప్రభావతీ భైరవీ ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ || అంబా మోక్ష స్వరూపిణీ మోహినీ భార్గవీ మాతా మలయాచల వాసినీ మాహిషాసుర మర్థినీ మూకాసురాంతకా ముదితామణీ మృణాళినీ ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ || అంబా శారద శార్ంగధాదరా శ్రీ శివా […]

అష్ట భైరవులు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు కాశీ యాత్రకు కాలభైరవుని అనుమతి కావలి అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటి వాడు అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు సాధారణముగా అందరు కాశీ లో శివుడిని దర్శించుకొని వస్తారు అలాకాకుండా కాశీలోని కాల భైరవ ఆలయము అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ […]

భగవంతునికి లేఖ… భగవంతుడి సమాధానం

రచన: రాజన్ సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి, జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ. భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 27

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య సంసార పూరితులైన జనావళికి ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి శ్రీహరి ఒక్కడే దిక్కు మరి ఇంక వేరే దారి లేనే లేదు అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును తేప యితడె మఱి తెరగేది చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి యీసులేని సుఖ మెక్కడిది చేసినపాపము చేతుల నున్నది మోసపోనిగతి ముందర నేది ॥ శ్రీపతి॥ చ.2. కోపము గొందుల గుణముల నున్నది […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 20

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి చేసుకునే విన్నపం ఈ కీర్తనలో మానవజీవితం, భ్రమలు మాయలతో గడచిపోవడం గురించి చేసే నివేదన. ఈ లోకంలో జన్మంచిన ప్రతి మానవుడు ఎలా సుఖంగా.. సంతోషంగా జీవించాలా? అనే ఆలోచనతోనే గడుపుతారు. కానీ అసలు నేనెవరిని? ఈ ప్రపంచం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించ్చారు? ఈ జీవులంతా ఎవరు? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు? అని అలోచించడంలేదు. ఈ సృష్టికి లోనై మిమ్ములను గమనిచలేని స్థితిలో ఉన్నాము. మీరే కరుణజూపి మమ్ము […]

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం

రచన: జి.సందిత మానవులు జన్మను సార్థకం చేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే! అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము. కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేకపోవటమే! ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం. అప్పుడు వండి సిద్ధం చేయటం, వడ్డించటం శరీరకర్మ. అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం […]