April 23, 2024

నవరసాలు..నవకథలు.. అద్భుతం 9

రచనః శ్రీమతి నండూరి సుందరీ నాగమణి. నదీ సుందరి నర్మద ఆకాశంలో ఇంద్రధనువును చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో నర్మదను చూసినా అంతే నాకు. పూలలోని మకరందాన్ని, ఆకాశంలోని అనంతాన్ని, కడలిలోని గాంభీర్యాన్ని, హిమవన్నగాల ఔన్నత్యాన్ని, సంగీతంలోని మాధుర్యాన్ని, సూరీడి వెచ్చదనాన్ని, జాబిల్లి చల్లదనాన్ని, మల్లెపూవుల సౌరభాన్ని కలిపి రంగరించి నర్మదను తయారుచేసాడేమో ఆ బ్రహ్మ! అదీ నా కోసం. ఆమె ఎప్పుడూ అద్భుతమే మరి నాకు! *** నేను వేదిక మీద పాడినపుడు పరిచయమైంది నర్మద. […]

నవరసాలు..నవకథలు.. భీభత్సం 8

రచన: మంథా భానుమతి చిట్టి చెల్లెలు ఆదివారం. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు తీరిగ్గా పనులు చేసుకుంటున్నారు. శబ్దాలు బయటికి వినిపించకుండా తయారయి, తమ గది తలుపులు వేసి బైటికొచ్చింది పదమూడేళ్ల వినత. ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్లింది.. ఆదివారం మొక్కలకి నీళ్లుపెట్టటం వినత పని. ఇల్లంతా దులిపి ఒక కొలిక్కి తెచ్చి, పిల్లల గది సర్దుదామని లోపలికెళ్లిన వనజ, కంఠనాళాలు పగిలిపోయేట్లు కెవ్వుమని అరిచింది. తోటలోంచి వినత, వరండాలో కూర్చుని పేపరు చదువుతున్న వాసు, ఒకేసారి గదిలోకి […]

నవరసాలు..నవకథలు.. రౌధ్రం 7

రచన: మణికుమారి గోవిందరాజుల ఆదిశక్తి “ఆంటీ నేను ఇక్కడ మీతో పాటు కూర్చోనా నేనెక్కిన కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా వుంది. నాకు భయమేస్తున్నది. మీరున్నారని చెప్పి టీసీ నన్నిక్కడికి పంపారు” ఆడపిల్ల గొంతు విని తలెత్తింది సుకన్య. ఇరవై యేళ్ళుంటాయేమో రిక్వెస్టింగ్ గా అడుగుతున్నది. “అయ్యో దానికి నన్నడగడమెందుకు? నా బెర్త్ కాదుగా నువ్వడిగేది? ”నవ్వింది. నిజమే ఈ రోజేంటో అన్ని కంపార్ట్మెంట్సూ ఖాళీగా వున్నాయి. టీసీ అదే చెప్పి తలుపులు తెరవొద్దని చెప్పి యేమన్నా అవసరం […]

నవరసాలు..నవకథలు.. శాంతం 6

రచన: ఉమాదేవి కల్వకోట ఇక అబద్ధాలు చెప్పకండి నాన్నా. సాయంత్రం ఆరుగంటలు దాటింది. పార్కులో చిన్నపిల్లల ఆటలూ, కేరింతలు,పెద్దవాళ్ళ కబుర్లు, ప్రేమికుల ఊసుల బాసల సందడులన్నింటికీ దూరంగా ఒక బెంచిమీద ఒంటరిగా కూర్చొని తన కొడుకు కార్తీక్ రాసిన ఉత్తరం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు రామారావుగారు. ఇప్పటికే రెండుసార్లు చదివిన ఆ ఉత్తరాన్ని అప్రయత్నంగానే జేబులో నుండి తీసి మరోసారి చదవసాగారు.. నాన్నా ! ఒకే ఇంట్లో ఉంటూ మీకీ ఉత్తరం రాయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని […]

నవరసాలు..నవకథలు.. హాస్యం 5

రచన: కలవల గిరిజారాణి. జలజాపతి బదీలీ బాధలు.. ప్రతీ మూడేళ్ళకయినట్లే జలజాపతికి మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయింది. నిజామాబాద్ నుంచి విజయనగరానికి. ఇదోమూల అదోమూల.. తప్పదుగా.. తిట్టుకుంటూ.. విసుక్కుంటూ సామాను సర్దడం మొదలెట్టింది జలజం. పైన అటకల మీద సామాను దించలేకపోతోంది.. పనిమనిషి రెండు రోజుల నుంచీ రావడం లేదు.. ప్రయాణం వారంలో పడింది.. ఎవరైనా మనిషినైనా పంపడు ఈ అయోమయం మొగుడు. చెపితే కోపం.. మొడితే ఏడుస్తాడు అన్నట్టుంటాడు.. అని తిట్టుకుంటూ జలజాపతి కి ఫోన్ […]

నవరసాలు..నవకథలు.. వీర 4

రచన: జ్యోతి వలబోజు ధైర్యం. రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. భాస్కర్ తన దుకాణం మూసేసి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి రాగానే కూతుళ్లిద్దరూ మొహాలు మాడ్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ కనపడ్డారు. అమ్మానాన్నలు అప్పుటికే నిద్రపోయినట్టున్నారు. వాళ్ల రూమ్ తలుపు దగ్గరగా వేసుంది. చెప్పులు విప్పి తన రూమ్ లోకి వెళ్తున్న భాస్కర్ ని చూసి “నాన్నా!” అరిచినట్టుగా పిలిచారు పిల్లలిద్దరూ. “ఏంట్రా బంగారం? తినండి. నేను స్నానం చేసి వస్తాను.” అన్నాడు ప్రేమగా. “అదంతా […]

నవరసాలు..నవకథలు.. కరుణ 3

రచన: జి.సుబ్బలక్ష్మి ఫోటో “ప్రయాగ వెడుతున్నార్ట కదా సావిత్రీ.. “ రెండిళ్ళ అవతలున్న జానకి సందు చివరనున్న కొట్టు దగ్గర కూరలు కొంటున్న సావిత్రిని అడిగింది. “అవును జానకీ. ఒక్కసారి ఆ త్రివేణీసంగమంలో మునగాలనుందిరా, కుంభమేళాకి తీసికెళ్ళరా అనడిగితే ఆ రష్ లో మనం వెళ్లలేవమ్మా అన్నాడు ముందు. కానీ తర్వాత మా గిరిజ వాడికి నచ్చచెప్పింది. ఎంత బాగా చెప్పిందనుకున్నావ్! మనం కాకపోతే అత్తయ్యగారిని ఎవరు తీసికెడతారండీ అంటూ మొత్తానికి వాణ్ణి ఒప్పించింది.” సంతోషంతో వెలిగిపోతున్న […]

నవరసాలు..నవకథలు.. భయానకం ..2

రచన: చెంగల్వల కామేశ్వరి “హెల్ప్ మి” భలే సంతోషంగా ఉందిరా ! ఎప్పటినుండో అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది ఇలా ట్రైన్ లో అరకు వెళ్లాలని. అంటున్న వాసు మాటలకి నవ్వేసి ఏం చేస్తాము? ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరదు. ఆ గోపాల్, వర్మ , రాంబాబు గొడవ ! ఎప్పుడూ మేమే రావాలా! ఎక్కడెక్కడివాళ్లో వస్తున్నారు. మీరిద్దరూ రారేంటిరా ! ఆ భాగ్యనగరంలో ఉన్నారని పెద్దబడాయి.” అని సాధింపులు. ఇంట్లో పెళ్లాం పిల్లలని వదిలి, బాస్ గాడికి […]

నవరసాలు.. నవకథలు.. శృంగారం .. 1.

రచన: రజనీ శకుంతల అది ఒక ఇదిలే…!! “ప్లీజ్ బామ్మా! నా మాట విను. అందరిలో నాకు ఇలా ‘కార్యం’ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. చెప్తుంటే వినవేం.. కాలం మారింది. ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తా.. నైట్ అక్కడికి వెళ్తాం. తెల్లారి వచ్చేస్తాం. ఇలా అందరిలో నా పెళ్ళాన్ని అలంకరించి, పాల గ్లాసుతో గదిలోకి పంపడం లాంటివి ఏం వద్దు… ” రుషి బామ్మ వింటుందనే నమ్మకం లేకున్నా తన ప్రయత్నంగా మరోసారి […]