March 29, 2024

మాయానగరం – 38

రచన: భువనచంద్ర “ఇన్నేళ్ళుగా మీరిక్కడ వుంటున్నారు? నాకు తెలిసి, ఇది నీరు లేక మోడుగా మారిన దేవాలయం. దీన్ని ఇంత పచ్చగా చేసినవారెవరు? ” అడిగాడు రుషి. రుషికి ఇరవై తొమ్మిదేళ్ళు వుంటాయి. అందంగా, దబ్బపండుగా వుంటాడు. వొంటి మీద కాషాయ రంగు పైజామా లాల్చీ వున్నాయి. మెడలో రెండు మూడు పూసల దండలూ, ఓ రుద్రాక్షమాలా వున్నాయి. భుజాన వేలాడుతూ ఓ కాషాయ సంచీ. అతడంతట అతను వచ్చి అమరేశ్వర అవధానిగార్ని పరిచయం చేసుకున్నాడు. ” […]

బ్రహ్మలిఖితం – 10

రచన: మన్నెం శారద “రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా […]

జీవితం ఇలా కూడా ఉంటుందా? – 12

రచన: అంగులూరి అంజనీదేవి రోజులు గడుస్తున్నాయి. అరుణోదయం వేళ అప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఇళ్ల మధ్యలోంచి, చెట్ల మధ్యలోంచి తొంగి చూస్తున్నాడు. ఆ సూర్యుని లేలేత కిరణాలు సోకి ఆరుబయట గంగిరావిచెట్టు కింద నవారు మంచంలో పడుకొని వున్న సతీష్‌చంద్ర కొడుకు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. గాలికి వూగే మొక్కజొన్న కంకుల్లా పిడికిళ్లను పైకి లేపి కదిలిస్తూ కాళ్లతో మంచం మీద తన్ని పైకి జరగాలని చూస్తున్నాడు. సతీష్‌చంద్ర ఫ్రేమ్‌ కుర్చీలో కూర్చుని బాబునే చూస్తూ […]