April 24, 2024

వాట్సప్ వాట్సప్ వల్లప్పా! (సామాజిక పద్య నాటకం)

రచన: తుమ్మూరి రామ్మోహన్ రావు 1 వ రంగము కాళి:- కం.అయ్యా లేలే లెండిక బియ్యము పప్పులు సరుకులు వే గమె తేవన్ దయ్యముగా నను దలచుచు కుయ్యో మొయ్యో అనకుడి కొట్టుకువెళ్లన్-1 దాసు:-ఓసినీ! తెలుగు పద్యాభిమానం గ్రూపు గగనమెక్క! హాయిగా వెనకటి లాగా సరదాగా,ఏవండోయ్ సరుకులైపోయాయి, తెస్తే తేండి.లేకుంటే పస్తులే -అనటంలో ఎంత ఆత్మీయత ఉండేది.ఈ మధ్య ఈ వాట్సప్ఛందోభాషణం పుణ్యమా అని మాటలు కరువై, పద్యాల ఊటలు షురువ య్యాయి గదే! కాళి:-కం.ఎప్పటి కెయ్యది […]

హిమవత్పద్యములు-2

  రచన:  జెజ్జాల కృష్ణ మోహన రావు   కందగీతి – బేసి పాదములు – తేటగీతి మొదటి మూడు గణములు, సరి పాదములు – తేటగీతి పాదము ప్రేమ యామనిన్ బెంపొందు ప్రేమ నీరామనిన్ నిండి – పెల్లుబుకును ప్రేమ శిశిరపు రంగులౌ ప్రేమ హేమంత కాలపు – వెచ్చదనము   కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె భువిని చెట్టులెల్ల – మ్రోడువారె దివిని పులుఁగు […]

సీతారామ కల్యాణం

రచన: కిభశ్రీ రండి కన రండి – – – – తరలి రండి రండి రండి రారండి – – – – కదలి రండి నవ్య యుగములో అందరూ సవ్యముగా జరుపుకునేది దివ్యానుభూతిని ఇచ్చేదీ భవ్యమైన కల్యాణమే ఇది || రండి|| తుల్యమే లేని సీతమ్మే కౌసల్యతనయుని చేరునటా కల్యాణం చూసినవారికి కైవల్యం తథ్యమటా ధరణిని జనకుని పట్టియట ఆ సిరియే- – – పెండ్లికూతురట సరియైనవాడె జోడట ఆ హరియే – – […]

తల్లి *వేరు*

రచన:సందిత ధరణిన్ చాలా గొప్పది తరుమూలముతరచిచూడతగువిధిఁ! బీజాం కురమదిప్రథమాంకురమది! గురుతరమగుప్రథమమూల గుణితంబదియౌ! బలమునొసంగెడుదుంపగు తొలగింపగరోగమోషధులరూపమ్మౌ తెలియసుగంధపువేరగు పలువిషములవిరిచివేయుపరమామృతమౌ పైపైకెదుగన్ జూడక పైపైమెరుగులనుకోరిపరుగులనిడకన్ పైపైకెదుగన్ సహజుల కాపై జూపకనసూయ నాహారమిడున్ స్వర్గసుగంధసుధలఁతరు వర్గోద్భూతప్రసూనఫలరూపమునన్ దుర్గమమైనట్టియథో మార్గంబందునచరించిమరియందించున్ సౌందర్యముమాధుర్యము విందులుబడసినవియెదుగవేరులవలనన్ పొందుచునథోగతులనటు నందించున్ సాయమటుల నమ్మనఁవేరుల్ పొగడునులోకంబారయ నగుపించగవృక్షశోభనాహాయనుచున్ దిగుచున్ తానెదిగించును సుగుణమ్ములరాశి *వేరు*సూనృతమరయన్ దిగుచున్ తొలుచుచుజేరును పగలున్ రేయనకఁబూని పాతాళమ్మున్ భగవంతునిపాదమ్మది సగమాకసమందు సగము సాగుచు భూమిన్ !