March 19, 2024

మాయానగరం 50

రచన: భువనచంద్ర “షీతల్” ఉద్వేగంతో వణికిపోయాడు కిషన్. రుషి షాక్ తిన్నాడు. ఠక్కున వెనక్కి తిరిగింది షీతల్. కిషన్‌ని చూసి సర్వం మర్చిపోయి అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని మండపం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. అతని గుండె ఎగసి పడుతోంది. కళ్లవెంట ధారగా నీరు కారుతోంది. ‘రుషి సైలెంటుగా, శబ్దం రాకుండా గుడిలో వున్న అవధానిగారి దగ్గరకు చేరాడు. బిళహరి అక్కడే వున్నది. జరిగిన విషయాన్ని లోగొంతుకతో బిళహరికీ, అవధానిగారికీ చెప్పాడు […]

మాయానగరం 49

రచన: భువనచంద్ర “మీరొక్కసారి మా ఆలయాన్ని చూడండి బాబూజీ. చూశాక మీకే అర్ధమవుతుంది” జరిగిన విషయాలన్నీ చమన్‌లాల్‌కి వివరించి అన్నాడు రుషి. ప్రభుత్వం కదలాలన్నా, ప్రభుత్వ యంత్రాంగం పని చెయ్యాలన్నా ‘పరపతి’ వున్నవాళ్ళని ఆశ్రయించక తప్పదు. జిల్లా కలెక్టరుకి వివరంగా చెప్పాడు. కలెక్టరు ఎలా పరిచయం అంటే కలెక్టరుగారి అబ్బాయి ఒడుక్కి ఆయన రుషికి కేటరింగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల. కలెక్టర్ చాలా పాజిటివ్‌గా స్పందించి విషయాన్ని స్వయంగా చూచి వారం రోజుల్లోగా రిపోర్టు అందించాలని పి.ఏ.కి […]

మాయానగరం – 47

రచన: భువనచంద్ర మబ్బులు కమ్ముకుంటున్నై. అప్పటిదాకా జనాల్ని పిప్పి పీల్చి వేసిన ఎండలు నల్లమబ్బుల ధాటికి తలవొంచక తప్పలేదు. తెలుపు నలుపుల సమ్మేళనంలా వుంది వెలుగు. గాలి చల్లగా వీస్తూ చెట్లని, మనుషుల్నీ పరవశింపజేస్తోంది. “ఓ రెంకన్నొరే.. వర్షవొచ్చీసినట్టుంది. రారేయ్ “ఏలూరినించి వచ్చిన ఓ రిక్షా కార్మికుడు ఆనందంగా అరిచాడు. “హా భయ్.. బారిష్ ఆయేగీ “ఓ ముస్లీం సోదరుడన్నాడు. “సారల్.. సారల్.” సన్నగా పడుతున్న చినుకులని చేతుల్లో పట్టేట్టు అటూఇటు నాట్యం చేస్తున్నట్టుగా కదులుతూ అనంది […]

మాయానగరం 46

రచన: భువనచంద్ర రెండు శవాలు. ఒకటి చాకు గుండెల్లో సూటిగా గుచ్చుకుపోగా చచ్చిపోయిన మహాదేవన్‌ది. రెండోది త్రాచుపాము కాటుతో చనిపోయిన పరమశివానిది. చాకుమీద వేలిముద్రలు పరమశివానివని రుజువు కావాలి. త్రాచుపాము కోరల గుర్తులు రుజువయ్యాయి. కోరల గుర్తులే కాదు నల్లగా విషంతో మాడిన శరీరమూ, నోటి నుండి నురగ. మౌనదేవతలా నిల్చుంది నందిని. ఎంతమంది కూర్చోమన్నా కూర్చోలేదు. తెల్లార్లూ నిలబడే వుంది. నిలబడే ఓపిక లేక కూర్చుండిపోయాడు వెంకటస్వామి. అతని కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. పోలీస్ స్టేషన్ […]

మాయానగరం 45

రచన: భువనచంద్ర జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు. అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు. జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం, మాయలాంటి అనేక విధానాలు వుంటాయి.నిన్నటి దేవుడు ఇవ్వాళా దేవుడుగానే వుంటాడని గ్యారంటీ లేదు. అదే విధంగా నిన్నటి విలన్ ఇవ్వాళా విలన్ పాత్రనే పోషిస్తాడనే నమ్మకమూ లేదు. ఆకాశంలో […]

మాయానగరం .. 44

రచన: భువనచంద్ర “ఆపండి. ఏమిటీ ఆలోచన?”మృదువుగా అడిగింది వందన. “ఏమీలేదు వందనా? జస్ట్ ఓ ఉత్తరం. తెలిసినవాళ్లు రాసింది” మామూలుగా అవడానికి ప్రయత్నించాడుగాని, ఓ రకమైన అనిశ్చిత స్థితి ఆ సమాధానంలో బయటపడింది. వ్యక్తావ్యక్తలకి మధ్యనుండే స్థితి అది. “ఎనీ ప్రాబ్లం?” :నో.. ఇట్స్ నాటే ప్రాబ్లం” “ఎవరన్నా అమ్మాయి రాసిందా? లవ్ లెటరా?”పకపకా నవ్వింది వందన. ఆ నవ్వు వాతావరణాన్ని తేలికపరచడానికి నవ్వినట్టుంది. “అమ్మాయ్! లవ్ లెటర్ కాదుగానీ మేరేజ్ ప్రపోజల్” అప్రయత్నంగానే నిజం చెప్పాడు […]

మాయానగరం 43

రచన: భువనచంద్ర “మరోసారి కల్తీ సారా పేరుతో మారణహోమం సాగిస్తే?” చాలా మెల్లగా స్పష్టంగా అన్నాదు శామ్యుల్‌రెడ్డి సర్వనామంతో. “నో..” స్థిరంగానూ, స్పష్టంగానూ అన్నాడు సర్వనామం. “అదే అడుగుతున్నాను. ఎందుకు వొద్దని?” చికాగ్గా అన్నాడు శామ్యూల్‌రెడ్డి. ప్రధాన సమస్య బోస్. గత రెండు నెలలుగా బోస్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. గుడిసెలు, సిటీలోనే కాదు, ఏ వార్డు నించి ఎవరికి ఏ సమస్య వొచ్చినా తక్షణం ఆ సమస్యని పరిష్కరిస్తున్నాడు. తనవల్ల కాలేకపోతే ఆ సమస్యని అధికారుల దగ్గరికీ, […]

మాయానగరం – 42

రచన: భువనచంద్ర “మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస. “ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు. ఎలా తినబుద్ధి అవుతుంది? ” దీనంగా అన్నాడు సేఠ్ చమన్ లాల్. ఒక్క నెల రోజుల్లోనే అతను సగానికి సగం తగ్గిపోయాడు. బాధతోనూ, మనోవ్యధతోనూ శరీరం సగం వడిలిపోయింది. […]

మాయానగరం – 40

రచన: భువనచంద్ర జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని అలరిస్తావు… సడన్ గా మమల్ని నీలో కలిపేసుకుంటావు! చావు పుట్టుక.. యీ రెండు అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమేగా యీ జీవితం. ఆలోచిస్తూ నడుస్తున్నాడు రుషి. సవ్యాద్రి అండతో […]

మాయానగరం – 39

రచన: భునవచంద్ర “మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు. ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకునేవారు కూడా! ” ఓ క్షణం ఆగాడు బోసు. “అదంతా నాకెందుకు చెబుతున్నారూ? ” ఏ మాత్రం కుతూహలం ధ్వనించని స్వరంతో […]