April 16, 2024

అతడే ఆమె సైన్యం – 6

రచన: యండమూరి వీరేంద్రనాధ్ జీపుల తాలూకు ముందు వుండే రేకులు (బోయినెట్లు) విప్పి, కత్తియుద్ధంలో ఉపయోగించే “డాలు” లాగా తమని తాము రక్షించుకుంటూ వస్తున్నారు సైనికులు. ఆ దృశ్యాన్ని చూస్తున్న అజ్మరాలీ, వాళ్ళ మూర్ఖత్వానికి నవ్వుకున్నాడు. మరోవైపు కోపమూ, విసుగూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే “డాళ్ళు” రైఫిల్ బుల్లెట్లకి అడ్డు నిలబడవు. వంతెనకి కాస్త ఇటువైపుకి దగ్గరకి రాగానే చైతన్య ఇస్మాయిల్ పేల్చే కాల్పులకి అందరూ నల్లులా మాడిపోతారు. అయితే అతని అంచనాని తప్పుచేస్తూ సైనికులు […]

అతడే ఆమె సైన్యం – 5

రచన: యండమూరి వీరేంద్రనాధ్         ఆ మరుసటి రోజు ప్రోగ్రాం సైనికాధికారుల కోసం! మధ్యాహ్నం మూడింటికి అజ్మరాలీ వచ్చి చైతన్యని స్టేజి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. లైట్స్ అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. సైనికులు ఖైదీలతో ఏర్పాటు చేయిస్తునారు. కొందరు యుద్ధ ఖైదీలు తెరలు కడుతున్నారు. మరికొందరు స్టేజీమీదకు దూలాలు మోసుకు వెళుతున్నారు. పూర్వకాలం రోమన్ రాజులు బానిసలతో పనులు చేయించినట్లు సైనికులు ఆ ఖైదీలతో పనులు చేయిస్తున్నారు. అజ్మరాలీ నవ్వేడు… “మీ దేశపు సైనికులే.. […]

అతడే ఆమె సైన్యం – 4

రచన : యండమూరి వీరేంద్రనాధ్  “అదీ భాబీ జరిగింది” పూర్తిచేశాడు ఇస్మాయిల్. రంగనాయకి నిశ్శబ్ద రోదన ఆ గదిలో శబ్దాన్ని భయపెడుతూంది. చైతన్య మోకాళ్ళ మీద చేతులాన్చి మొహాన్ని అరచేతుల మధ్య దాచుకుని చాలాసేపు వుండిపోయాడు. నిమిషం తరువాత ఆవేశంగా లేచాడు. “మొత్తం ప్రభుత్వాన్ని కదుపుతాను. నాకున్న పలుకుబడి అంతా ఉపయోగిస్తాను. డబ్బు వెదజల్లుతాను. నా తండ్రిని అక్కడనుంచి వెనక్కి రప్పిస్తాను.” ఇస్మాయిల్ అడ్డంగా తలూపుతూ, “ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసింది. ఎందరో సీక్రెట్ ఏజెంట్స్‌ని […]

అతడే ఆమె సైన్యం – 3

రచన: యండమూరి వీరేంద్రనాథ్     “కాశ్మీర్ లోయవైపు నా ప్రయాణం ఒక అందమైన అనుభవం” ప్రనూష ప్రారంభించింది. అతడు ‘టీ’ తాగుతూ వింటున్నాడు. ఆ విశాలమైన హాలు, ఎత్తైన గోడలు, తైలవర్ణ చిత్రాలు, ఖరీదైన సామాగ్రి, అన్నీ ఆమె చెప్పబోయే కథకోసం ఎదురుచూస్తున్నాయి. “డిల్లీనుంచి జమ్మూవరకూ నేను ప్రయాణించే రైల్లో నాకోసమొక ప్రత్యేకమైన కంపార్ట్‌మెంట్ రిజర్వ్ చేయబడింది. కేవలం నేనూ, నా ఆయా. మరో కంపార్ట్‌మెంట్‌లో మరో ఇద్దరు నౌకర్లు..” ఆమె ఆగి అన్నది. “ఇదంతా […]

అతడే ఆమె సైన్యం – 2

రచన: యండమూరి వీరేంద్రనాధ్.. ఇస్మాయిల్ ఖాన్ జేబులు తడిమి చూసుకున్నాడు. అర్ధరూపాయి దొరికింది. ఆఖరి అర్ధరూపాయి. ఇస్మాయిల్ ఖాన్ భారత దేశ సైన్యంలో పనిచేశాడు. పది సంవత్సరాల క్రితం అతడు కాశ్మీర్‌లో శత్రుసైన్యానికి పట్టుబడ్డాడు. అతడిని మిలటరీ క్యాంప్‌లో బంధించారు. పది సుదీర్ఘమైన సంవత్సరాలు. అతడిని వాళ్లు ఒకటే కోరేవారు. “నిన్ను వదిలిపెడతాం.. భారతదేశానికి వెళ్లు. తిరిగి సైన్యంలో చేరు. ఈసారి మా గూఢచారిగా పనిచెయ్యి. సంవత్సరానికి లక్షరూపాయిలిస్తాం..” ఇస్మాయిల్ ఒప్పుకోలేదు. అతడు నిజాయితీ వున్న భారత […]

అతడే ఆమె సైన్యం

రచన: యండమూరి వీరేంద్రనాధ్                                                                                      ఎపిలోగ్ : సాయంత్రం అయిదయింది. ఆ వీధి అంత రష్‌గా లేదు. అలా అని పూర్తి నిర్మానుష్యంగానూ లేదు. అంజిగాడి పాన్‌షాప్ దగ్గర మాత్రం ముగ్గురు నిలబడి అరటిపళ్ళు తింటున్నారు. అంజిగాడి మొహంలో బాధలేదు. అలా అని మనసులో బాధ లేదని కాదు. ముగ్గుర్నించి పైసా రాదని తెలుసు.  ఏడవలేక నవ్వుతున్నాడు. “ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు. అలాగే మూడు పాన్‌లు కట్టు” అన్నాడు ఆ ముగ్గురిలో కాస్త అప్రెంటిసులా వున్నవాడు.  వాడు […]