April 24, 2024

శ్రీగణేశ చరిత్ర

రచన: నాగమంజరి గుమ్మా 101 ముల్లోకమ్ముల జనులకు కల్లోలము సేయుచున్న కర్కశ దనుజుల్ ఉల్లము దలచిన కదిలెడు ఇల్లులు గట్టుకు తిరుగుచు నిడుముల పెట్టెన్ భావం: మూడు లోకాలలో ఉన్న ప్రజలను బాధలు పెడుతున్న రాక్షసులు మనసులో తలచుకోగానే కదిలే ఇళ్లు కట్టుకుని నానా కష్టాలు పెడుతున్నారట. (త్రిపురాసురుల వృత్తాంతం) 102 వ పద్యం అసురుల బాధల కోర్వక వెసవెస వేల్పులు కదిలిరి వెన్నుని కొలువన్ అసురుల కిచ్చిన వరములె లసకమ్మౌ సమయమిదని లచ్చిమగడనెన్ భావం: రాక్షసుల […]

*శ్రీ గణేశ చరిత్ర* 81 – 100

రచన: నాగమంజరి గుమ్మా..   82.   బాలుని మూడవ పిలుపును ఆలించిన రావణుండు హా వలదన్నన్ నేలందించెను లింగము జాలిగ చూచిన శివుడు నిజసదన మేగెన్ భావం: బాలుడు మూడవ పర్యాయము కూడా పిలిచేసరికి “వస్తున్నా ఆగు” మని రావణుడు ఎంతగా చెబుతున్నా వినకుండా బాలుడు లింగాన్ని నేలకు దించేసాడు. ప్రాణలింగము లోని శివుడు బయటకు వచ్చి రావణుని ప్రయత్నం విఫలమైనందుకు జాలిగా చూసి, తన ఇంటికి చేరుకున్నాడు. (భూకైలాస ఆలయం పేరుతో కోల్కతా, తెలంగాణ, […]

*శ్రీగణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా 61 వ పద్యం దండమయా విఘ్నేశ్వర దండమయా ఏకదంత దానవనిహతా కొండవు విద్దెల కెల్లను ఖండపరశు ముద్దుపట్టి కామితమిమ్మా భావం: విఘ్నేశ్వరా నీకు వందనం. ఏకదంతుడవైన నీకు వందనం. దానవులను సంహరించిన వాడా, అన్ని విద్యలకు నిలయమైనవాడా, శివునికి ముద్దుల కొడుకా మా కోరికలు తీర్చవయ్యా ఖండపరశువు: శివుడు 62 వ పద్యం కొలిచెద నే కుడుముల దొర కొలిచెద నే తొలుత వేల్పు కోర్కెలు తీరన్ పులకపు ముద్దలు పెట్టెద వెలయుచు […]

*శ్రీ గణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా 31 వ పద్యం వటువు ప్రయోగించెనపుడు పటువున దంతమును పీకి పరిఘకు మారున్ మిటమిట లాడెను మోషకు డటగొని శరణం బనన్ గజాననుడాపెన్ భావం: తండ్రి ఆదేశంతో గజాననుడు లేచి, తన దంతాన్ని విరిచి ఎలుకపై విసిరాడు. అది ఒక ఇనుప గదలా తగలగా ఎలుకకు ప్రాణాలు కళ్ళలోకి వచ్చినంత పనిఅయ్యింది. వెంటనే ఆ ఎలుక శరణు కోరింది. గజముఖుడు తన దాడిని ఆపి ఉపనయన కార్యక్రమం కొనసాగించెను 32 వ పద్యం […]