April 19, 2024

శ్రీ గణేశ చరిత్ర (అష్టోత్తర శత కందములు)

రచన: నాగమంజరి గుమ్మా 1. స్మరియించెద గణనాధుని* స్మరియించెద విఘ్నపతిని మానసమందున్* స్మరియించెద నీశ సుతుని* స్మరియించెద గౌరి తనయు శత కందములన్* భావం: గణములకు అధిపతి యైన గణేశుని స్మరిస్తాను. విఘ్నములకు అధిపతి అయిన విఘ్నేశుని మనసులో స్మరిస్తాను. ఈశ్వరుని కుమారుడైన వినాయకుని స్మరిస్తాను. గౌరీదేవి కుమారుడైనటువంటి బొజ్జ గణపతిని నూట ఎనిమిది కంద పద్యములలో స్మరించుకుంటాను. 2. గణనాథుని నుతియించితి* నణువును నే విద్య జూప నంబిక పుత్రా* గణపయ్య నన్ను గావుము* కణమును […]