రచన: డా. వివేకానందమూర్తి గోపాల్: నా రాధకి ఎలా వుంది డాక్టర్ గారూ! డాక్టర్ : మిస్టర్ గోపాల్! మీరొక్కసారి నాతో అలా పక్కకి రండి. గోపాల్ : ఏం డాక్టర్! కొడతారా! నేనేం తప్పు చేశాను. డాక్టర్ : అదికాదు. నీతో రహస్యంగా మాట్లాడాలి (ఇద్దరూ కారిడార్ లోకి నడుస్తారు) డాక్టర్ : ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా వుంది. గోపాల్ : ఆం! డాక్టర్ : కంగారుపడకండి. ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం […]
Category: కలగూరగంప
వెంటాడే కథ – 18 పేదవాడు మనసు
రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]
అమ్మమ్మ – 46
రచన: గిరిజ పీసపాటి “ఆయన చెప్పాడు కానీ నాకు వీలు కాదు. మొత్తం డబ్బు కట్టండి. లేదా, వెంటనే ఇల్లు ఖాళీ చేసెయ్యండి” అన్నాడు తిరిగి. “ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకాలి కదా అన్నయ్యగారు! ఇన్నాళ్ళు ఆగారు. ఈ ఒక్క నెల పిల్లల ముఖం చూసైనా దయచేసి ఆగండి. వచ్చే నెల మొత్తం ఇచ్చేస్తాను” అంది నాగ బతిమాలుతూ. “కుదరదు. వెంటనే ఖాళీ చెయ్యండి” అన్నాడు తిరిగి. అంతవరకు సహనంగా వీళ్ళ మాటలు వింటున్న అమ్మమ్మ […]
పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!
రచన: డా. వివేకానందమూర్తి రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి. ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను […]
విరించినై విరచించితిని … వంటింట్లోనే కాదు మార్కెటింగ్‌లోనూ వీరు అసాధ్యులే!
రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి గృహిణిలు వ్యాపారం చెయ్యటం సాధ్యమా? సాధ్యమేనని నిరూపించారు విజయలక్ష్మి, శకుంతల, కృష్ణవేణి, నాగలక్ష్మి. గృహిణులు కూడా వ్యాపారం చేసి ఎలా విజయం సాధించగలరో తెలుసుకోటానికి వీరిని పాఠకులకు పరిచయం చేస్తున్నాము. ప్ర. విజయలక్ష్మిగారూ! మీరు ఈ ఒన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? జ. మొదట్లో లక్ష రూపాయల పెట్టుబడితో 2001లో బంగారు నగల వ్యాపారం ప్రారంభించాను. బంగారం రేటు పెరగటంతో 2003 నుంచి ఒన్ గ్రామ్ […]
సుందరము – సుమధురము – వ్రేపల్లియ ఎద జల్లున
రచన:- నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘సప్తపది’ చిత్రంలోని ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై, 1981లో విడుదల అయిన ఈ చిత్రానికి, కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. శ్రీ భీమవరపు బుచ్చిరెడ్డి గారు ఈ చిత్రనిర్మాత. నృత్యం ప్రధానాంశంగా సాగే ఈ చిత్రంలో కథకులు, దర్శకులు విశ్వనాథ్ గారు కులమత భేదాలను […]
యాత్రామాలిక – ముక్తినాథ్
రచన: నాగలక్ష్మి కర్రా కైలాశ్ మానససరోవరం యాత్ర చేసుకున్నాక నేపాలులో ఉన్న ముక్తినాథ్ యాత్ర చేసుకోవాలనిపించింది. సరే గూగుల్ లో చూసుకొని ఓ ట్రావెల్స్ వాళ్లని సంప్రదించి బేరసారాల తరువాత మేం మొత్తం ఏడుగురం బయలుదేరేం. మేం మాట్లాడుకున్న పేకేజీ ప్రకారం రెండురోజులు ఖాట్మండు, ఒకరోజు జనకపూర్, ఒక రోజు పోకర, ఒక రోజు ‘జోమ్ సోమ్’, తిరుగు ప్రయాణంలో ఒక రోజు పోకర, రెండురోజులు ఖాట్మండు. మొత్తం మా పాకేజీ ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు. […]
కాశీలోని రహస్య ద్వాదశ ఆదిత్యుల మందిరాలు
రచన: నాగలక్ష్మి కర్రా ప్రత్యక్ష నారాయణునిగా పూజింపబడే సూర్యునికి మన దేశంలో ఒక్క ‘అరసవల్లి’ తప్ప ఎక్కడా గుడి లేదు అని మనం ఎప్పుడూ అంటూ వింటూ ఉంటాం, కాని కాశీనగరంలో ద్వాదశ, అవును అచ్చంగా పన్నెండు సూర్య మందిరాలు ఉన్నాయని (నమ్మబుద్ది కావటం లేదు కదా? కాని ఇది నిజంగా నిజం) మొదటిమారు విన్నప్పుడు నాకూ నమ్మబుద్ది కాలేదు. వాటిని చూస్తున్నప్పుడు పొందిన శక్తి, కలిగిన అనుభూతి వర్ణనాతీతం, అందుకే కాశీ వెళ్లే ప్రతీవారు ఈ […]
*శ్రీగణేశ చరిత్ర*
రచన: నాగమంజరి గుమ్మా 17 వ పద్యం నేటి మొదలు నీ పేరున మేటిగ తొలిపూజచేసి మేలునుపొందున్ కోటీజనులు తమ పనులను, సాటిగ రారెవ్వరనుచు సాంబశివుడనెన్ భావం: పునర్జీవితుడైన బాలుని చూచి, పార్వతీదేవితో కూడిన శివుడు (సా అంబ శివుడు), “గజముఖుడు, గజాననుడు అనే పేర్లు కలిగిన నీకు జనులందరూ తమ కార్యముల కొరకు తొలి పూజలు అందజేస్తారు. ఈ విషయంలో మరెవ్వరూ నీకు సాటిగా రాబోరు. వారికి తగిన మేలు చేకూర్చుము” అని దీవించెను. 18 […]
పరవశానికి పాత(ర) కథలు – 1 – గూడు విడిచిన గుండె
రచన: డాక్టర్ కె.వివేకానందమూర్తి (U.K) ఇది కథో, వ్యథో కచ్చితంగా చెప్పలేను. లండన్ హీత్రో ఎయిర్ పోర్ట్ ఎప్పటిలాగే ఎంతో బిజీగా వుంది. పెద్ద పెద్ద అద్దాలకు అవతల రన్ వే మీద అనుక్షణం యెగిరి, వాలే విమానాలతో, గుంపులు గుంపులుగా సేద దీర్చుకుంటున్న జంబో జెట్లతో జటాయువుల సంతలా వుంది. మా అవిడా, పిల్లలు ఇండియా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. వాళ్లకి కనిపించదని తెలిసినా చెయ్యూపి నేను ఒంటరిగా యింటికి కదిలాను. కదిలో కార్లోంచి ఆకాశం […]
ఇటీవలి వ్యాఖ్యలు