April 19, 2024

ఆయుధం

రచన: రోహిణి వంజరి   “ఎక్కడమ్మా నీకు రక్షణ ఓం నిర్బయా,అభయా, ఆయోషా,ఆసిఫా… నువ్వేవరైతే  ఏమి ఈ భువిలో అమ్మ గర్భంలో నువ్వు రూపుదిద్దుకోక ముందే ఆడపిల్లవని గర్భంలోనే నిన్ను చిదిమేసే కసాయి తల్లిదండ్రులున్నారు ఈ లోకంలో జాగ్రత్త తల్లి జాగ్రత్త… నువ్వు పుట్టాక ఎదిగీ ఎదగని నీ చిరుదేహాన్ని మందంతో కాటేసే కామాంధులు ఉన్నారు ఈ లోకంలో జాగ్రత్త తల్లీ జాగ్రత్త… కులాంధత్వం,మతమౌఢ్యం, కక్షలు, కార్పణ్యాలు, అన్నీంటీకీ ప్రతీకారం తీర్చుకోవడానికి నీ దేహాన్నే వేదిక చేసుకునే […]

గిలకమ్మ కతలు – గిలకమ్మా.. మజాకా…

రచన: కన్నెగంటి అనసూయ   “ ఇత్తెలిసిందేటే సరోజ్నే….” నిలువునా పరిసిన గోనుసంచి మీద దోసిలితో దోసెడు  తొక్కి , కడిగి ఆరబెట్టిన నూగింజలు పోసి మడిగాళ్లేసుకుని మరీ బత్తాకేసి పావుతా పిన్నత్త కూతురు సూరయ్యమ్మన్న మాటలకి .. అలా బత్తాగుడ్దకేసి  పావిన నూగింజల్నల్లా  సేట్లో పోసుకుని పొట్టు సెరిగేత్తన్న సరోజ్ని సెరిగే సెరిగే సేట్ని ఆమట్నే ఆపేసి దాన్ని మడిసిన  కాళ్ల మీదెట్టి  కళ్ళు సికిలిచ్చి మరీ  సూరయ్యమ్మకేసే అదోలా సూత్తా..”ఏటది..? “ అంది  ఇంత […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2019 సంచికకు స్వాగతం.

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు, కవులకు మాలిక తరఫున సాదర ఆహ్వానం. వీడిపోయేముందు విజృంభిస్తున్న చలిగాలులు, వేసవి ఎంతగా వేధిస్తుందో అన్న ఆలోచనలు మొదలైన వేళ మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మాలిక కొత్త సంచిక మీకోసం వచ్చేసింది.  మాలిక పత్రిక మీడియా పార్టనర్ గా ఉన్న ఒక సాహితీ కార్యక్రమంగురించి కొన్ని మాటలు. అమెరికా వాసులైన నాట్యకారిణి, నటి, రచయిత్రి శ్రీమతి […]

భగవంతుల రహస్య సమావేశం

రచన: రాజన్ పి.టి.ఎస్.కె సర్వాంతర్యామి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆయన వదనంలో నిత్యం నాట్యం చేసే చిరునవ్వు ఎందుకో ఈ రోజు అలిగినట్టుంది. ఆయన గంభీర వదనాన్ని చూసి భయపడ్డ పాలసముద్రపు కెరటాలు కూడా మెల్లిగా ఆడుకుంటున్నాయి. ఆదిశేషుడు తను కొట్టే చిన్నిపాటి బుసలను కూడా మాని నిర్లిప్తంగా చూస్తున్నాడు. విష్ణు పాదాలు ఒత్తుతున్న జగన్మాతకు మాత్రం ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఎన్నడూ లేనిది స్వామి ఇలా వ్యాకులం గా కనిపించడంతో అమ్మవారు ఉండబట్టలేక… […]

మానవత్వం

రచన: గిరిజారాణి కలవల ”శిరీషా! ఏం చేస్తున్నావు?” అన్న అత్తగారి మాటకి సమాధానంగా శిరీష. “గోపమ్మకి కాఫీ కలుపుతున్నా అత్తయ్యా” అంది. ఆవిడ గబుక్కున గిన్నెలోకి చూసి ”ఇంత చిక్కగానే… ఇంకా నయమే… ఇలా అలవాటు చేస్తే ఇంకేవన్నా వుందా..”అంటూ శిరీష చేతిలో పాలగిన్నె తీసుకుని ఏదో వంపీ వంపనట్లు పాలు వంపి, ఆ కాఫీలో ఇన్ని నీళ్లు కలిపేసి పంచదార కాస్త ఎక్కువ వేసింది. పైగా “వాళ్ళు మనలాగా స్ట్రాంగ్ గా తాగరు… పల్చగా తియ్యగా […]

బ్రహ్మలిఖితం 22

రచన: మన్నెం శారద ఆమె ఆందోళనగా కంపార్టమెంటంతా గాలించింది. ఎక్కడా కార్తికేయన్ జాడలేదు. రైలు దిగి ప్లాట్‌ఫాం మీద నిలబడింది. నిస్తేజమైన ధృకులతో ప్రతి మనిషినీ పరిశీలంగా చూస్తూ. ప్లాట్‌ఫాం మీద రైలు వెళ్ళిపోయింది. అమ్ముకునేవాళ్ల రద్దీ తగ్గిపోయింది. ఎక్కడా కార్తికేయన్ కనిపించలేదు. ఆమె తల గిర్రున తిరిగిపోతోంది. తన తండ్రి ఏమయ్యేడు. తిరిగి ఆయన మానసిక పరిస్థితి క్షీణించి ఎక్కడో రైలు దూకెయ్యలేదు కదా. ఒక వేళ తనకంటే ముందే ఇల్లు చేరుకున్నారేమో. అది సరికాదని […]

కంభంపాటి కథలు – దేవతలాంటి నిన్ను…

రచన: రవీంద్ర కంభంపాటి డోర్ బెల్ రింగైన వెంటనే పరిగెత్తుకెళ్లి తలుపు తీసింది శిరీష. తలుపు బయట నుంచున్న దేవిని చూసి, ‘అయ్యో.. నీకు వొంట్లో బాగోలేదని మీ అమ్మ ఫోన్ చేసింది.. ఇవాళ పన్లోకి రావనుకున్నానే ?’ అంది ‘ఆఁ.. ఏదో కొంచెం జొరంగా అనిపించి మా అమ్మకి చెబితే, వెంటనే మీకు ఫోన్ చేసేసిందమ్మా.. కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందని వచ్చేసేను ‘ అంటూ లోపలికెళ్ళిపోయింది. దేవి వెనక్కాలే కిచెన్ లోకి నడుస్తూ […]

దారి తప్పిన స్నేహం

రచన: గిరిజ పీసపాటి ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి శైలజ, సరిత ప్రాణ స్నేహితులు. శైలజ చాలా బిడియంగా, నెమ్మదిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. సరిత తప్ప వేరే స్నేహితులు కూడా లేరు. కానీ సరిత గలగలా మాట్లాడుతూ తను ఎక్కడ ఉంటే అక్కడే చొరవగా కొత్త స్నేహితులను తయారుచేసుకునేది. స్కూల్ లో మొదలైన వారి స్నేహం కాలేజ్ లో కూడా కొనసాగడంతో ఏ చిన్న విషయాన్నైనా ఇద్దరూ షేర్ చేసుకునేవారు. కాకపోతే ఇద్దరి […]

చిన్న చిన్నవే కానీ….

రచన: మణి గోవిందరాజుల “యెన్నిసార్లు చెప్పాలి ఆ సెంట్ కొట్టుకోవద్దని? నాకస్సలు నచ్చదని నీకు తెలుసుకదా?” విసుక్కున్నాడు శేఖరం. వుత్సాహంగా బయల్దేరబోతున్న సంధ్య మొహం చిన్నబోయింది. నిజమే శేఖర్ చెప్తుంటాడు తనకు సెంట్ వాసన నచ్చదని, కాని మొదటినుండీ . తనకేమొ చక్కగా తయరయ్యి కొద్దిగా పెర్ఫ్యుం స్ప్రే చేసుకోవడం ఇష్టం. ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అందుకని చాలా లయిట్ గా స్ప్రే చేసుకుంది. అయినా పట్టేసాడు. మౌనంగా లోపలికి వెళ్ళబోయింది చీర మార్చుకోవడానికి. “ఇప్పుడు […]

విశ్వపుత్రిక వీక్షణం – “డిప్రెషన్‌”

రచన: విజయలక్ష్మీ పండిట్ మోగుతున్న ఫోన్‌ను తీసి ‘హలో’ అంది సుమతి. అవతలివైపు ‘హలో మేడమ్‌ నమస్కారమండి, బాగున్నారా? నేను సుధను మేడమ్‌, గుర్తుపట్టారా,” సుమతికి వెంటనే ‘సుధ’ ఎవరో గుర్తుకు రాలేదు. సుధ ”నేను మేడమ్‌ డిప్రెషన్‌ నుండి నన్ను రక్షించి నాకో భవిష్యత్తు నిచ్చారు ”. ”ఓ… సుధ బాగున్నావా అమ్మా, నీ టోన్‌లో మార్పుంది. ఎవరో అనుకున్నా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు” అడిగింది సుమతి సంతోషంతో. “మేడమ్‌ హైదరాబాద్‌లో నాకు ఇంగ్లీషు లెక్చరర్‌గా […]