April 23, 2024

బ్రహ్మలిఖితం 21

రచన: మన్నెం శారద “ఈ రోజు పౌర్ణమి”. చోటానికరా పూజారి వైపు అర్ధం కానట్లుగా చూశారు కాన్హా, లిఖిత. పక్షపు దినాలుగా మీ నాన్నగారికి చేతబడి తీయడానికి నిరంతర నిర్విరామ కృషి జరిగింది. ఇలా ఇంతవరకూ ఎవరికీ ఇంత దీర్ఘకాలపు చికిత్స జరగలేదు. మీ నాన్నగారి మానసిక స్థితి చాలా బలహీనంగా వుంది. నాడీమండలం నీచ స్థాయిలో పని చేస్తోంది. అందుకే ఇలా జరిగింది. మేం చేయవలసిందంతా చేసేం. మానసిక శారీరక రుగ్మతలన్నింటిని తీసేసే అద్భుత మూలికా […]

కంభంపాటి కథలు – ఆవే పులి

రచన: కంభంపాటి రవీంద్ర ఆ రోజు మధ్యాహ్నం టీ తాగుతూ, టీవీ చూస్తున్న హైందవికి భర్త నుంచి వాట్సాప్ లో వీడియో కాల్ వచ్చింది, ఎవరా అని చూసేసరికి , భర్త గోవర్ధన్ . ‘ఏమిటండీ ఇప్పుడు ఫోన్ చేసేరు?’ అని అడిగితే ‘ప్రణతి స్కూల్ నుంచి జాగ్రత్తగా వచ్చిందా ?’ అని అడిగేడు . ‘ఆ ..వచ్చింది .. బ్యాగు హాల్లో పడేసి దాని గదిలోకెళ్ళిపోయింది ‘ అంది హైందవి ‘ఏం .. ఏవైంది ? […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన । మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే। (సాంఖ్య యోగము-భగవద్గీత) “కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు” అంటాడు భగవానుడు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం మరియు చెడు […]

కథలరాజు- పద్మరాజు

రచన: శారదా ప్రసాద్ ప్రపంచ కథానికల పోటీలో ఒక తెలుగు కథానికకు ద్వితీయ బహుమతిని తెచ్చిపెట్టి ప్రపంచ సాహిత్యంలో తెలుగు కథానికకు వన్నె తెచ్చిన ఈ ప్రతిభామూర్తి, 24-06 -1915 న, పశ్చిమ గోదావరి జిల్లాలోని, అత్తిలి మండలానికి చెందిన తిరుపతిపురం అనే గ్రామంలో జన్మించారు. చదువుకునే రోజుల్లోనే, వీరిపైన యమ్. యన్. రాయ్ గారి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందువల్ల హేతువాదిగా మారాడు. సైన్సులో మాస్టర్స్ డిగ్రీ చేసిన వీరు 1939 నుండి 1952 వరకు, […]

తేనెలొలుకు తెలుగు – 5

రచన: తుమ్మూరి రామ్మోహనరావు తెలుగు భాషలో పాటలు పద్యాల్లాగే సామెతలు, జాతీయాలు, నుడికారాలు కూడా జనుల అనుభవాల్లోనుండి పుట్టినవే. వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. వాక్యం చిరస్థాయి కావడానికి వాక్యంలోని అనుభవ సారాంశం, లయాత్మకత అతి ముఖ్యమైనవి. పదాలలోని తూగు లయాత్మకతను అందిస్తే, వాక్య భాగం విరిగే చోట యతి, అంత్య ప్రాసలు వాక్యాన్ని శబ్దరమ్యంగా తీరుస్తాయి. కొన్ని సామెతలు చూద్దాం. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి చెరపకురా చెడేవు ఇల్లలుకగానే పండుగవుతుందా అమ్మ అల్లం […]

బాధ్యతను మరచిపోలేక…

రచన: భవాని ఫణి “అమ్మాయ్, ఈ రోజు పంచమే కదూ ” అన్న మాటలకి లంచ్ బాక్స్ సర్దుతున్న మాధవి ఉలికిపడి తలెత్తి చూసింది. స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయి తొందర తొందరగా హోమ్ వర్క్ పూర్తి చేస్తున్న పదేళ్ల సిరి రాయడం ఆపేసి ఆమె వైపే చూస్తోంది. “సిరీ, టైమైపోతుంటే ఏమిటి ఆ వేళాకోళం, హోంవర్క్ కంప్లీట్ చెయ్యి ముందు ” అంది మాధవి, కూతురు ఈ మాటలు ఏ సీరియల్ లో విని […]

విశ్వపుత్రిక వీక్షణం – రెక్కలకొండ

రచన: డా.విజయలక్ష్మీ పండిట్ జయ డైనింగు హాల్లోకొచ్చి “విహన్‌ను పిలిచాను వస్తున్నాడు” అంటూ భర్త అనిల్‌ వైపు తిరిగి, ”విహన్‌ మన పెరటి తోటలో వేపచెట్టును చూస్తూ నిలబడి చేతులూపుతూ మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు నాన్నా అంటే, అదిగో ఆ వేప చెట్టుతో మాట్లాడుతున్నాను. అది కొమ్మల చేతులతో పిలిచి నవ్వుతూ మాట్లాడుతుందమ్మా. దానికి పెద్ద కండ్లు, నోరు కూడా వున్నాయి చూడు అంటాడు. నాకు కనిపించడంలేదండి”అంటూ ఆందోళన పడింది జయ.అనిల్‌కు అంతా అర్థమయింది. తనకు వున్నట్టే […]

కౌండిన్య హాస్యకథలు.. ఫారిన్ రిటర్న్డ్

రచన: రమేష్ కలవల విమానాశ్రయం! ఎప్పటి లానే రద్దీగా ఉంది. ఆ విమానాశ్రయం లో ఇద్దరు పెద్దవాళ్ళు మొదటి సారి విదేశాలకు ప్రయాణం చేయబోతూ సహజంగా కొంచెం టెన్షన్ పడుతూ, వాళ్ళ సామాన్లు చెకిన్ చేసి, క్యాబిన్ లగేజీతో గేటు నెంబర్ కోసం వేచి ఉన్నారు. ఆ దగ్గరలోనే అర్నాల్డ్ నించొని వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు. ఎయిర్పోర్టులో బరువులు ఎత్తి ఎత్తి అర్నాల్డ్ స్వాజ్నేగర్ లా బాడీ పెంచడం మూలాన అందరూ ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అర్నాల్డ్ […]

ఫ్రీ… ఫ్రీ….. ఫ్రీ..

రచన: గిరిజారాణి కలవల పొద్దున్నే అష్టావధానం.. శతావధానం అయిపోతోంది.. ఓ పక్క కుక్కర్.. ఓ… తెగ కూసేస్తోంది రా.. రమ్మని.. రా.. రా.. రమ్మని.. ఇంకో పక్క సాంబారు కుతకుతలాడిపోతోంది… పోపుకి టైమయిందంటూ.. మరో వేపు శ్రీవారు కారుతాళాలు కనపడక కారుకూతలతో.. తైతక్కలాడుతున్నారు.. . ఇంకో వైపు పనిమనిషి గిన్నెల మోతలు.. సుతుడి సుత్తి ఇంకో రకం.. పూజగదిలో అమ్మవారి అష్టోత్తరమే చదివాను.. నాది చదవలేదేమని అయ్యవారు అలిగి.. ఎక్కడ అష్టకష్టాలు పెడతారో అని.. అదో భయం […]