April 24, 2024

బ్రహ్మలిఖితం – 20

రచన: మన్నెం శారద జోసెఫ్ మీదపడి నిశ్శబ్దంగా రోదిస్తున్న అతని భార్యని భుజాలు పట్టుకొని లేవదీసింది లిఖిత. ఆమె కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని అదుపు చేస్కునే ప్రయత్నం చేసింది. “మిమ్మల్ని ఓదార్చే ధైర్యం చేయలేను. కాని.. ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని కూడా మీరు ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదంటే.. మీలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉంటారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను” అంది లిఖిత బాధగా. ఆమె శుష్క మందహాసం చేసింది. ఆ నవ్వు తుఫానులో […]

రెండో జీవితం 8

రచన: అంగులూరి అంజనీదేవి ఏది ఏమైనా తన బొమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి తన అభిమానురాలే… అభిమానం ఓవరం! కానీ అభిమానులతో మాట్లాడేంత ఉల్లాసంగా తను లేడు. అనుకుంటూ వెంటనే ఆ మొబైల్‌ని పక్కన పెట్టాడు. కానీ ఆ మెసేజ్‌లు మాత్రం అతని గతం తాలుకు భావరేఖల్ని కదిలించి ‘మా సంగతేంటి? నీ బొమ్మల్లో మమ్మల్నెప్పుడు ఒలికిస్తావు.’ అన్నట్లు తొందర చేస్తున్నాయి. పైకి కన్పించేది ఒకటి… అంతర్లీనంగా దోబూచులాడేది ఒకటి… అంతర్లీనంగా వున్నదాన్ని అవసరాన్ని బట్టి అణగదొక్కాలని చాలా […]

కంభంపాటి కథలు.. ‘జానకి’ ఫోన్’ తీసింది

రచన: కంభంపాటి రవీంద్ర ఫోను ఒకటే బీప్ బీప్ మని శబ్దం చేస్తూండడంతో బద్ధకంగా లేచింది భార్గవి . అప్పటికే ఉదయం ఎనిమిదయ్యింది. ఫోన్లో వాట్సాప్ చూసేసరికి అప్పటికే ఇరవైకి పైగా మెసేజీలున్నాయి, జానకి పీఎం అనే గ్రూపులో ! ఛటుక్కున ఆ గ్రూప్ ఓపెన్ చేసేసరికి , ఒకటే చర్చ నడుస్తూంది . ఇంకా జానకి రాలేదు .. ఫోన్ కూడా తియ్యడం లేదు .. అంటే ఇవాళ డుమ్మా కొట్టేసినట్లే అనుకుంటూ ! వంద […]

కలియుగ వామనుడు 8

రచన: మంథా భానుమతి వణుకుతున్న చేత్తో మళ్లీ, ఎన్నోసారో.. చూసింది మెస్సేజ్. ఎన్ని సార్లు చూసినా అవే మాటలు. తల అడ్డంగా తిప్పింది, మాట రానట్లు. “మెస్సేజ్ ఎక్కడ్నుంచొచ్చిందో నంబర్ ఉండదామ్మా? ఫోన్ లో మాట్లాడుతే వస్తుందంటారు కదా?” బుల్లయ్య ప్రశ్నకి మరింత తెల్ల బోయింది సరస్వతి. తనకెందుకు తట్టలేదు? చదుకున్న వాళ్లకంటే చదువురాని వాళ్లు నయం అంటారందుకే. మెస్సేజ్ చూసిన హడావుడిలో బుర్ర పన్చెయ్య లేదు. వెంటనే మెస్సేజ్ మళ్లీ చూసింది. నంబర్ ఉంది. ఏం […]

ఆచరణ కావాలి.

రచన: గిరిజరాణి కలవల రాత్రి తొమ్మిది అవస్తోంది. కోడలు హోటల్లో నుంచి తెప్పించిన టిఫిన్ తినేసి తన రూమ్ లోకి వెళ్ళబోతూ.. మనవడిని పిలిచారు రామారావు గారు. ” చిన్నూ ! ఇక రా, బజ్జుందువుగాని, తొమ్మిదవుతోంది, మంచి కధ చెపుతాను విందువుగాని..” అని పిలిచారు. ” ఉండండి.. తాతయ్యా ! ఈ గేమ్ సగంలో వుంది అయ్యాక వస్తాను. మీరు పడుకోండి.” టాబ్ లోనుంచి తల పైకెత్తకుండానే, ముక్కు మీదకి జారిపోతున్న కళ్ళజోడుని పైకి లాక్కుంటూ, […]

ఎన్నెన్నో జన్మల బంధం

రచన: కొప్పరపు సుబ్బలక్ష్మి అయ్యగారు, స్నానం చేయించి బట్టలు మార్చాను. చిన్న గ్లాసు పాలు కూడా పట్టాను. సాగరంగారు కారేజి ఇచ్చి వెళ్ళారు. నేను వెళ్తానండయ్యా. సాయంత్రం రా రాములమ్మా, స్నానం చేయించి వెళుదువుగాని. సరేనయ్యా. రామచంద్రంగారు అనుష్టానం పూర్తి చేసుకుని గావంచాలోనుండి అడ్డపంచలోకి మారి, సుశీల గదిలోకి వచ్చారు, తను నిద్రపోతోంది. అలికిడికి కళ్ళు తెరిచింది. పెదాలమీద సన్నని చిరునవ్వు. లేచేశావా. ఫారెక్స్ బేబికి టిఫిన్ పెడతానుండు అంటూ కారేజి తెరిచి ఒక ఇడ్లీ పాలల్లో […]

కౌండిన్య హాస్యకథలు – కథ కంచికి ప్రేక్షకులు ఇంటికి

రచన: రమేశ్ కలవల ఇంద్రుడితో యుద్ధం చేసి అమృతం తెచ్చిన వైనతేయుడిలా డిస్ట్రిబ్యూటర్లతో పోరాడి డబ్బులు కట్టల బ్యాగు అచ్యుతరావుగారికి అందించాడు పక్కిసామి. సినిమా ప్రొడ్యూసర్ అచ్యుతరావు గారికి ఎక్కడకైనా వెళ్ళేటపుడు పక్కిసామి పక్కన ఉండి తీరాల్సిందే. పక్కిసామి ఎన్ని డబ్బులు కట్టలు బ్యాగులలో మోసుకొచ్చిన ఒక్కసారి కూడా లోపలకు కన్నేసి కూడా చూడడు. నిస్వార్థపరుడు, అచ్యుత రావు గారి మీద గౌరవం అలాంటిది. అచ్యుతరావుగారు ఆ అందించిన బ్యాగులోంచి డబ్బుల కట్టలు తీసి తను పడుకునే […]

మార్నింగ్ వాక్

రచన: మణికుమారి గోవిందరాజుల “రేపటినుండి యేమైనా సరే వాకింగ్ కి వెళ్ళాల్సిందే. ” అద్దంలో ముందుకూ వెనక్కూ చూసుకుంటూ అనుకుంది . “కానీ మరీ లావణ్య వర్ణించినంత లావుగా యేమీ లేనే?” మళ్ళీ చూసుకుంది . యేమోలే చూసేవాళ్ళకు లావుగా కనపడుతున్నానేమో. . అయినా అయ్యో అయ్యో యెంత మాట అనేసింది దొంగమొహం. వారం క్రితం ఇంట్లోకి వస్తూనే అన్నది కదా “ఒసే రేఖా! పేరుకి తగ్గట్లు రేఖలా వుండేదానివల్లా సున్నాలా అవుతున్నావే” అని దానికి శ్రీవారి […]

నాకు నచ్చిన కధ చెన్నూరి సుదర్శన్ గారి “అడకత్తెరలో పోక చెక్క-“

అంబడిపూడి శ్యామసుందర రావు చెన్నూరి సుదర్శన్ గారు ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసి సెకండ్ ఇన్నింగ్ లో రచయిత అవతారమెత్తి వ్రాసిన కధల సంపుటి నుండి తీసుకున్న కధ. ఇప్పటివరకు నేను వివిధ పత్రికలలో (ఆన్ లైన్) చాసో, రావి శాస్త్రి మునిమాణిక్యం , కొడవటిగంటి వంటి పాత రచయితల కథలకే సమీక్షలు వ్రాశాను అనుకోకుండా సుదర్శన్ గారి “ఝాన్సీ హెచ్ ఎమ్ “అనే కధల సంపుటి చదవటం తటస్తించింది అందులో అడకత్తెరలో పోక చెక్క కధానిక […]

తేనెలొలుకు తెలుగు-4

రచన: తుమ్మూరి రామ్మోహనరావు కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ. . . ఇది నేను చిన్నప్పుడు చూచిరాత కాపీలో అభ్యాసం చేసిన మొదటి పద్యం. దీని తరువాత చీమలుపెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ ఉపకారికినుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా! […]