April 20, 2024

ఒద్దిరాజు అపూర్వ సోదరులు

రచన: శారదాప్రసాద్ ‘ఒద్దిరాజు అపూర్వ సోదరులు’ గా ప్రసిద్ధులైన సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గార్లు సంస్కృతాంధ్ర పండితులు మరియు ప్రచురణ కర్తలు. ఒద్దిరాజు సీతారామచంద్రరావుగారు ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు. ఒద్దిరాజు రాఘవ రంగారావుగారు ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. వీరికి సుమారు పది భాషలలో పాండిత్యం ఉంది. వీరి తల్లిదండ్రులు వెంకట రామారావు మరియు రంగనాయకమ్మలు. వీరు వరంగల్లు మండలం మానుకోట తాలూకా, ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. ఈ గ్రామం నుండే వీరు తెనుగు అనే పత్రికను నడిపారు. ఈ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 29

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “అర్ధము పురుషార్ధములలో నుత్తమము. అర్ధవంతుడు న్యాయము దప్పక మరియే ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదించవచ్చును” అంటాడు పరవస్తు చిన్నయసూరి తన నీతిచంద్రికలో. అలాగే అన్నమయ్య ఆ ధనాన్ని గురించి మరొక విషయం చెప్తున్నాడు. ఆపదలలో ఉపయోగపడకుండా వున్న ధనం ఎవరికోసం? అని ప్రశ్నిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. ఆ వివరాలేమిటో ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే చ.1. దండితో […]

విశ్వపుత్రిక వీక్షణం .. “ప్రేమ రేఖలు”

రచన: డా. విజయలక్ష్మి పండిట్     మెరిసే మేఘల తివాసీపై నడిచి వస్తూందా హిరణ్యతార, ఆమె పాదాలు సోకి అడుగు అడుగుకు రాలుతున్నాయి నక్షత్రాలు ముత్యాల్లా .., రాలుతున్న ప్రతినక్షత్ర విస్పోటనం కురిపిస్తూంది బంగారు రజినివర్షం.., ధారగా జలజలా రాలుతున్న కాంచనచినుకులు.., ఆ హిరణ్యతార బంగారు చేలాంచలమై సముద్రుని ఒంటిపై జీరాడుతూ .., భూమ్యాకాశాన్ని కలిపే బంగారు జలతారు వంతెనయింది .., ఆ బంగారువారధి రజనిసోపానాలపై క్రిందుకి దిగితూ వచ్హాడు అందమయిన ఆ పురుషుడు..శశాంకుడు, సముద్రతలానికి […]

బాల్యం… ఓ అద్భుతలోకం, ఓ సుందర స్వప్నం

రచన: శ్రీధర్ చౌడారపు   ఆ కళ్ళు నిష్కల్మషాలు ఆ పెదాలపై అనుక్షణం నవ్వు తాండవిస్తూంటుంది అది బోసినవ్వో? భళ్ళుమన్న నవ్వో అక్కడ సిగ్గు బుగ్గల్లో ఎరుపుతో తలదాచుకుంటూంది అక్కడ ఉక్రోషం కాళ్ళను నేలకు బలంగా తాటిస్తుంటూంది అక్కడ కోపం “గీ”మంటూ “గయ్యి”మంటూ అరుస్తూంటుంది అక్కడ ఆశ కళ్ళను పెద్దవి చేసుకుని పెదాలు తడుపుకుంటూంటుంది అక్కడ నిరాశ సర్వం కోల్పోయి దిగాలుగా కూర్చుంటుంది అక్కడ గెలుపు దిగంతాలకెగురుతుంటుంది అక్కడ ఓటమి భోరుమని ఏడుస్తూంటుంది అక్కడ ఆనందం అంతులేని […]

జీవితపుటంచులు

  రచన: మూల వీరేశ్వరరావు     అంచుల దాక వచ్చాక అంచనాలు ఎందుకు ? అంచుల దగ్గర అర్దాల వెతుకు లాట అర్ధ రహితం ! గతం జైలులో జ్జాపకాల సంకెళ్ళేసుకున్న మనో విహంగానికి రెక్కలు ఏవి ? మతంతో మతి తప్పిన మర్కటాలకు జీవిత మార్మికత ఏలా తెలుస్తుంది ? కొలతలతో వెతలు చెందే వాడికి జీవితం ఉత్సవ మని ఎప్పుడు అవగతమవుతుంది ? , మిత్రమా రా కాంతి రహదారిపై ముద్రలు లేని […]

మాలిక పత్రిక జులై 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ఒక నెల ఆలస్యమైనా అదే ఉత్సాహంతో  మరింత ఎక్కువ కథలు, వ్యాసాలతో మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక జులై సంచిక.  ఎల్లవేళలా మాకు అండగా ఉండి ఆదరిస్తున్న పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు. మాలిక పత్రిక కంటెంట్ గురించి మీ అభిప్రాయములు, సలహాలు, సూచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ సంచికలోని విశేషాలు: మాయానగరం– 47 బ్రహ్మలిఖితం – 19 3.   ఏడు విగ్రహాలు  గిలకమ్మకథలు […]

మాయానగరం – 47

రచన: భువనచంద్ర మబ్బులు కమ్ముకుంటున్నై. అప్పటిదాకా జనాల్ని పిప్పి పీల్చి వేసిన ఎండలు నల్లమబ్బుల ధాటికి తలవొంచక తప్పలేదు. తెలుపు నలుపుల సమ్మేళనంలా వుంది వెలుగు. గాలి చల్లగా వీస్తూ చెట్లని, మనుషుల్నీ పరవశింపజేస్తోంది. “ఓ రెంకన్నొరే.. వర్షవొచ్చీసినట్టుంది. రారేయ్ “ఏలూరినించి వచ్చిన ఓ రిక్షా కార్మికుడు ఆనందంగా అరిచాడు. “హా భయ్.. బారిష్ ఆయేగీ “ఓ ముస్లీం సోదరుడన్నాడు. “సారల్.. సారల్.” సన్నగా పడుతున్న చినుకులని చేతుల్లో పట్టేట్టు అటూఇటు నాట్యం చేస్తున్నట్టుగా కదులుతూ అనంది […]