April 25, 2024

సుచి

రచన- డా.లక్ష్మి రాఘవ. కారు దారి తప్పింది అని తెలుస్తూంది! తారు రోడ్డు అయిపొయింది. మట్టి రోడ్డు మొదలయినా ఎక్కడో మళ్ళీ తారు రోడ్డు ను కలుస్తుందని అనిపించి రవి ముందుకు వెడుతూనే వున్నాడు. కాస్త నిద్రవచ్చి జోగుతున్న గాయిత్రి కి కారు కుదుపులతో మెలుకువ వచ్చింది. ‘ఎక్కడ వున్నాం?” అనడిగింది. “తారు రోడ్డు అయిపోతే ముందుకు వచ్చా ..రోడ్డు రిపేరు ఉండచ్చు అనుకుంటూ..” అన్నాడు రవి. కానీ చూద్దాం ఎక్కడో కలవకపోతుందా అన్న ఆశతో ముందుకే […]

సర్ప్రైజ్ ట్విస్ట్

రచన: మోహన కాలింగ్బెల్ మోగగానే, లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది మాయ. . విష్ణు వస్తాడని గంట నుంచి వెయిట్ చేస్తోంది. కానీ ఫ్లైట్ లేట్ అవడంతో, రావడం లేట్ అయ్యింది. అందుకే మాయకి అంత ఆతృత. విష్ణు మాయ బెంగళూరు లో ఉంటున్నారు. వాళ్లకి రాకేష్ అనే పదేళ్ల అబ్బాయి. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది, రాకేష్ కూడా పెద్దవాడు అయ్యేడు కదా అని మాయ ఈ మధ్యనే ఫేషన్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ […]

తేనెలొలికే తెలుగు-3

రచన: తుమ్మూరి రామ్మోహనరావు మారిషస్ లో సంజీవనరసింహ అప్పడు అనే ఆయన ఉన్నారు. ఆయనకు తెలుగంటే ఎంత అభిమానమంటే, ఆయన మాట్లాడేటప్పుడు పొరపాటున కూడా ఒక్క ఆంగ్ల పదం దొర్లకుండా మాట్లాడుతారు. ఆంగ్లభాషాపదాలను ఆయన అనువదించే తీరు భలే అనిపిస్తుంది. పరాయి దేశంలో ఉన్నవాళ్లకు మన భాష మీద మమకారం ఎక్కువ. ఆ విషయం అమెరికాలో సైతం గమనించాను. అక్కడిమన వారు మన తీయని తెలుగు పలుకులకై మొహం వాచి ఉంటారు. తెలుగులో మాటాడేవారు కనిపిస్తే చాలు […]

మన ఇళ్లలో ఉండే క్యాన్సర్ కారకలు (కార్సినోజెనిక్ మెటీరియల్స్)

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మన మన ఇళ్లలో ఏ రోగాలు రొష్టులు లేకుండా సుఖముగా బ్రతకాలని ఆశిస్తాము. కానీ మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన పదార్ధాలను మనతో పాటే మన ఇళ్లలో ఉంచుకొని రోగాల పాలవుతాము. ప్రస్తుతము మానవాళిని వేధించే జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి అటువంటి క్యాన్సర్ ను కలుగజేసే కారకాలను మనము మనకు తెలియకుండా ఇళ్లలో ఉంచుకుంటాము(వాటి ప్రభావము తెలియకుండా)అవి ఏమిటో అవి మన ఆరోగ్యముపై చూపే ప్రభావము ఏమిటో తెలుసుకుందాము. క్యాన్సర్ కలుగజేసే […]

ఉష అనిరుద్ధుల ప్రేమ కథ

రచన: శారదాప్రసాద్ ఉష అనిరుద్ధుల ప్రేమ కథను నేటి యువతీయువకులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాణాల శృంగార కథలలో ఉష అనిరుద్ధుల ప్రేమ కథ సుప్రసిద్ధం. ఈ కథ బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మ ఖండం నూట పధ్నాలుగో అధ్యాయంలో ఉంది. కథలోకి వస్తే శ్రీకృష్ణుడి మనుమడు అనిరుద్ధుడు. కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడితడు. ప్రద్యుమ్నుడు సాక్షాత్తు మన్మథుడే. ఆయన కుమారుడు అందంలో తండ్రిని మించిన వాడు. ధైర్య సాహసాలు కూడా అతడి సొంతమే. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 27

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య సంసార పూరితులైన జనావళికి ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి శ్రీహరి ఒక్కడే దిక్కు మరి ఇంక వేరే దారి లేనే లేదు అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును తేప యితడె మఱి తెరగేది చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి యీసులేని సుఖ మెక్కడిది చేసినపాపము చేతుల నున్నది మోసపోనిగతి ముందర నేది ॥ శ్రీపతి॥ చ.2. కోపము గొందుల గుణముల నున్నది […]

తన్మయి

రచన: శారద యామిని తటాలున పెదవిని ముద్దాడిన వానచినుకు.. ముందునాడే సమర్పించుకున్న మైమరపు.. తలపుల కొలిమిలో రాజుకున్న తపనలు.. దృష్టికి రాకనే మానిపోయినవేవో గాయపు గుర్తులు.. ఆత్మనెపుడో నింపుకున్న ఆలింగనపు తమకాలు.. ప్రేమ అకారణమయినపుడు, మధువులూరు పెదవంచున ముదమయూఖమై ఫలియించినపుడు.. పడమటి సంధ్య కాంతులన్నీ అరచేత గోరింట పూయించుకున్నపుడు.. మరులుగొలిపే నీ అడుగుల మల్లెల బారున నా ఆలోచనల మరువాలల్లుకున్నపుడు.. నీ ఊసుల హరివిల్లుకు నా ఊపిరి రంగును పులుముకున్నపుడు.. ఆరుబయట మందారాన్నై పూచి.. నీ రాకకై […]

ఆనందం..

రచన: బి.రాజ్యలక్ష్మి   ప్రతి మనిషి లో  మరో వ్యక్తిత్వం తప్పనిసరి !అంతర్లీన  ఆలోచనలు  భావాలూ  మెరుగుపడిన  స్మృతులు  అసలుమనిషి జాడలు  మనకు తెలియకుండానే  తెలుపుతాం! ఒకరోజు  ఆలా  కళ్ళుమూసుకుని  ఆలోచనలలోనికి  నన్ను  నేను  తొంగి  చూసుకున్నాను !కలం  నన్ను  పలుకరించింది ! గళం  పలుకమన్నది !కానీ  మనసుమాత్రం  మరోలోకం లో మధుర మురళిని  ముద్దాడింది !నల్లనయ్య  మోహన  వంశి   అలలతేరుపై నాముందు  వాలింది ! నిజం !సాగరతీరం , సంధ్యాసమయం  పున్నమి రేయి  జాలువారే  వెన్నెల  […]