March 28, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 23

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మానవజన్మ లభించడం ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. ఏదో ఒక రోజు ఈ బొందిలో ప్రాణం కాస్తా ఎగిరిపోతుంది. ఈ అశాశ్వతమైన కాయం కోసమే మనిషి నానా తాపత్రయాలు పడుతున్నాడు. ఇంద్రియ సుఖాల కోసం అదేపనిగా వెంపర్లాడుతున్నాడు. తెలిసి తెలిసీ ఈ కూపంలో ఇరుక్కుంటూనే ఉన్నాం. మమ్ములను ఈ విషయవాంఛలకు లోను చేస్తున్నావని మళ్ళీ నిన్నే నిందిస్తున్నాం. నీవే నా దైవానివని, కరుణతో కైవల్యమిచ్చే వాడవని ఎన్నటికీ గుర్తించలేకపోతున్నాను. […]

ఓషో రజనీష్

రచన: శారదా ప్రసాద్ వాత్సాయనుడికి వారసుడుగా జనం చెప్పుకునే ఓషో జిడ్డు కృష్ణమూర్తిగారి అభిమాని. బుద్ధుడి బోధల వల్ల ప్రభావితుడయ్యాడు. రజనీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజనీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌ లో గల […]

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కథలు

రచన: ఝాన్సీరాణి కె. లక్ష్మిగారు డైనింగ్‌ టేబల్‌ దగ్గర కూర్చుని మరుసటి రోజు కూరకి చిక్కుడుకాయలు వలుస్తున్నారు. హాల్లో పిల్లలందరూ కూర్చున్నారు. మన ఆర్థిక మంత్రి ఎవరు అడుగుతున్నాడు కిరాణ్‌ ? “రోశయ్య” అంది లాస్య “కాదు” అన్నాడు కిరణ్‌ హోంమంత్రి ఎవరో చెప్పు? సబితా ఇంద్రారెడ్డి “చెన్నై గవర్నరెవరు?”అడిగారెవరో “రోశయ్య” అన్నాడు కిరణ్‌ “ఆయన మన ఆర్థిక శాఖ మంత్రి” అంది లాస్య. “కావాలంటే ఈ బుక్‌ చూడంఢి. మూడేళ్ళ నుంచి ఈ బుక్‌ చదివిన […]

గ్రహణం వదిలింది

రచన: గిరిజ కలవల సాయంత్రం ఐదు కావస్తోంది. రాధ ఆఫీసు పని ముగించి టేబుల్ సర్దేసింది. “ఏంటో.. మేడమ్ గారు అప్పుడే బయలుదేరిపోతున్నట్లున్నారే.. ఏమన్నా విశేషమా ఈ రోజు..” వెనక నుండి సూపరిడెంట్ భూషణం వ్యంగ్యంగా అన్నాడు. “అవును.. సార్… రేపు మా అమ్మాయి పుట్టినరోజు.. డ్రస్ కొనుక్కుని వెళ్ళాలి. పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది. అందుకనే వెడుతున్నాను.”అంది రాధ. “డిసైడైపోయారుగా.. అలాగే కానీండి. . పుట్టినరోజు.. పార్టీ లు అంటారేమో.. ఈ వంకతో రేపు సెలవంటారేమో […]

మాలిక పత్రిక జనవరి 2018 సంచికకు స్వాగతం

  JyothivalabojuChief Editor and Content Head అప్పుడే సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరం వచ్చి కూడా పది రోజులైంది. కాలం ఎంత వేగంగా గడచిపోతుంది కదా.  అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక డిసెంబర్ సంచిక వెలువడలేదు. క్షమించగలరు. ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా మీ ముందుకు వచ్చింది మీ మాలిక పత్రిక.. మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు, కార్టూన్లు కొలువుదీరాయి.. మీ రచనలు  పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com మరి […]

రెండో జీవితం 4

రచన: అంగులూరి అంజనీదేవి ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు. ఇంకేదో…! మరి పురుషునిలో తండ్రి అంశ వుండదు. ప్రేమ అంటే కామమే… ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు. కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే వుంటారు. వంటగదిలో వున్న శకుంతల – భర్త పిల్లల్ని తిట్లే తిట్లు వినలేక, దేవుడు ఈ చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడ్తోంది. తిట్లు ఆగిపోయాయి. కుక్కర్‌ విజిల్‌ రెండు సార్లు రాగానే ఆపేసింది. ”మమ్మీ! మమ్మీ!” అంటూ ఆపదలో […]

బ్రహ్మలిఖితం 14

రచన: మన్నెం శారద లిఖిత ఎంగేజ్ చేసిన టాక్సీ కొచ్చిన్‌లో బయల్దేరింది. అడుగడుగునా బాక్‌వాటర్స్‌తో, కొబ్బరి తోటలతో మరో లోకంలో అడుగుపెట్టినట్లుంది కొచ్చిన్. లిఖిత కళ్లార్పకుండా చూస్తుందా స్థలాల్ని. సహజంగా సైట్ సీయింగ్‌కి, శబరిమలై వెళ్ళే యాత్రికుల్ని తీసుకెళ్ళడానికలవాటు పడ్డ డ్రైవర్ లిఖితలోని ఆసక్తి గమనించి “ఇదేనా మొదటిసారి రావడం మేడం?” అనడిగేడు ఇంగ్లీషులో. అవునన్నట్లుగా తల పంకించింది లిఖిత. “ఎన్‌చాంటింగ్ యీజ్ ద కరెక్ట్ వర్డ్ టు డిస్క్రయిబ్ ద బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ” […]

కలియుగ వామనుడు 2

రచన: మంథా భానుమతి ఈళ్లేం సెయ్యలా.. బానే ఉంది. అమ్మయ్య అనుకుంటూ, మూల తలుపు కేసి సైగ చేశాడు కొత్తవాడు. టింకూని తీసుకుని ఆ తలుపు తోసుకుని లోపలికి వెళ్లాడు చిన్నా. టింకూ ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. వాడిని కూడా తీసుకుని లోపలికెళ్లి తలుపేసేశాడు. బాత్రూం, లెట్రిన్ కలిపే ఉన్నాయి. ఇద్దరూ ముక్కు మూసుకుని నడిచారు. ఎవరూ శుభ్రం చేస్తున్నట్లు లేదు. చిన్న పిల్లలు భయానికి, ఎలా వాడాలో తెలిసినా నీళ్లు పొయ్యట్లేదనుకున్నాడు చిన్నా. టింకూ, తనూ […]

మాయానగరం – 42

రచన: భువనచంద్ర “మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస. “ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు. ఎలా తినబుద్ధి అవుతుంది? ” దీనంగా అన్నాడు సేఠ్ చమన్ లాల్. ఒక్క నెల రోజుల్లోనే అతను సగానికి సగం తగ్గిపోయాడు. బాధతోనూ, మనోవ్యధతోనూ శరీరం సగం వడిలిపోయింది. […]