March 29, 2024

ఆక్సిడెంట్‌ నేర్పిన పాఠం

రచన: ఝాన్సీరాణి.కె టైం చూశాను.. 8:35 ఫర్వాలేదు.. ఇంకొక్క పది నిముషాల్లో రెండు బస్సున్నాయి. 5 నిముషాల తేడాతో కరెక్ట్ టైంకి ఆఫీసులో వుండవచ్చు అనుకుంది.  బాక్సుల్లో సర్దగా మిగిలినవి ఒక ప్లేట్‌లో తెచ్చుకున్నవి భవాని డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కుర్చీలాగి కూర్చుని తినసాగింది. హడావిడిగా ఆ కొన్ని నిముషాలయినా కాళ్ళకు రెస్ట్‌ అనుకుంది. ‘ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళందరికి ఈ వత్తిడి  తప్పదు. కొంతమందికి భర్తలు కూడా సాయం చేస్తారు.’ అలాసాగి పోతున్నాయి భవాని […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 21

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ సృష్టిలోని సమస్త జీవరాసులను, బ్రహ్మాండాలను సృష్టించేది పరంధాముడే కదా! ఆ శ్రీహరి సృష్టించిన పదార్ధాలనే.. అంటే… అది లడ్డయినా..వడలయినా..చక్కెర పొంగలయినా… స్వామికి “నైవేద్యం సమర్పయామి” అంటూ నివేదిస్తూ ఉంటాము. ఎంత విచిత్రమో కదా! సమస్తo సృష్టించే ఆ దివ్య లీలా మానుష విగ్రహధారికి ఆ పదార్ధాలనే మనం తయారు చేసిన వస్తువుల్లాగా గొప్పకు పోతూ స్వామికి పెడుతూ ఉంటాము. నీ సొమ్మ్ము నీకే ఇవ్వడం..పైగా అదేదో మా సృజన అయినట్టు సంబరపడ్డమూ…. […]

బుద్ధుడు-బౌద్ధ మతం

రచన:  శారదా  ప్రసాద్ ​బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. […]

ఉష …..

రచన:  జి. శ్రీకాంత   సూర్యోదయ పూర్వార్ధ సమయం ….. ఉష తొంగి చూసింది… ప్రియాగమనార్థియై ముంగిట నిలిచింది తూరుపు దిక్కున నింగిలో ఆమె చీర  కొంగు నీలాకాశమై  విస్తరించుకుంది దీర్ఘమైన కురులు దట్టమైన పొగమంచులా పారాయి ఆమె ధరించిన నగలు నభంలో నక్షత్రాలై  మిలమిలలాడాయి సన్నని వెలుగులు చిప్పిల్లగానే నగల తళుకులు  వెలవెల పోయాయి చిరు వెలుగులలో చీర కుచ్చిళ్ళు జేగురు రంగు వెలువరించాయి అధిగమిస్తున్న సూర్య కాంతులు చొచ్చుకు రాగా నారంగి, పసుపు, బంగారు […]

పునర్జన్మ

రచన: ఉమ జి   అనుదినమూ ఏవో చిన్న గొడవలతో జీవనఝరిలో నిస్తేజంగా, స్తబ్దంగా మిగిలిన నేను, తిరిగి నాలోనే చైతన్యాన్ని చిలికిస్తాను, మనసున అమృత మథనం సాగిస్తాను   ఏమీ తోచని జడత్వాన్ని పారదోలి జీవం నింపే ఊహల సాక్షాత్కరించే మనసు పొరలు మాటునున్న ఊటకు ఊపిరి పోసి ప్రాణం నింపుతాను సజీవంగా సాక్షాత్కారం చేస్తాను   నిష్కర్షగా మాట్లాడే మనుషులు చెప్పే నిజాన్ని గ్రహించి, జాజి మల్లెల పరిమళాలు మనసుకు అందేలా వారి మంచితనాన్ని […]

ఊహా సుందరి!

రచన: నాగులవంచ వసంత రావు   సృష్టికర్త ప్రతిభకు ప్రత్యక్ష రూపానివో అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పానివో   అవనిలోని అందమంత అమరిన జవరాలివో రసికుల హృదయాల దోయు కొంటె నెరజాణవో   ఉషోదయపు మంచు తెరలు కడిగిన ముత్యానివో శ్రీగంధపు పరిమళాల మన్మధ బాణానివో   ఒంపు సొంపు లొలకబోయు బాపు గీసిన బొమ్మవో చూపరు నలరింపజేయు అచ్చ తెలుగు రెమ్మవో   ప్రేమ మధువు జాలువారు అమృత భాండానివో ప్రేమాభిషేక చిరుజల్లుల అమర […]

మాలిక పత్రిక అక్టోబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక, రచయిత మిత్రులందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. కాస్త ఆలస్యంగా ఈ మాసపు సంచిక విడుదలైంది. మాలిక తరఫున ఎందరో మహానుభావులు శీర్షికన ప్రముఖులతో ఇంటర్వ్యూ విశాలిపేరి చేస్తున్నారు.  అందులో భాగంగా ఈ మాసం పరిచయం అక్కరలేని గరికపాటి నరసింహారావుగారి ముఖాముఖి వీడియోరూపంలో మీకందిస్తున్నాము. మిమ్మల్ని అలరించే, ఆనందపరిచే సీరియళ్లు, కథలు, సమీక్షలు, వ్యాసాలు ఎన్నో ఉన్నాయి.. మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com 01. ఎందరో మహానుభావులు […]

ఎందరో మహానుభావులు – గరికపాటి నరసింహారావు

ఇంటర్వ్యూ: విశాలి పేరి ” కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి ” అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చేవారు ఇన్నాళ్ళకు దొరికారు. ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువతలో ఒక వివేకానందుడు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం. ప్రస్తుతం సమాజంలో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది. ఆయన […]

మాయానగరం – 40

రచన: భువనచంద్ర జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని అలరిస్తావు… సడన్ గా మమల్ని నీలో కలిపేసుకుంటావు! చావు పుట్టుక.. యీ రెండు అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమేగా యీ జీవితం. ఆలోచిస్తూ నడుస్తున్నాడు రుషి. సవ్యాద్రి అండతో […]

బ్రహ్మలిఖితం 12

రచన: మన్నెం శారద వేంకటేశ్వర స్వామి గుడి మెట్లెక్కుతుంటే ఈశ్వరి కాళ్ళు చిన్నగా వణికేయి. ఒక అపరిచిత వ్యక్తిని కలుసుకోడానికి తనేంటింత ధైర్యంగా వస్తోంది. తను కాకినాడ పక్కన కత్తిపూడిలో పుట్టి పెరిగింది. ముందు నుండీ ఘోషా కుటుంబం తమది. తండ్రి పట్టుదల వలన కాకినాడ మేనమామ ఇంట్లో వుంది, బి.ఏ వరకు చదివింది. పేరుకి కాలేజీకి వెళ్ళేదే గాని ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తేది. మళ్లీ అక్కడ వంచిన తల ఇంట్లో ఎత్తేది. ఆడవాళ్లు […]