April 25, 2024

మాయానగరం – 33

రచన: భువనచంద్ర బిళహరి గుళ్ళో కూర్చుంది. భగవంతుడున్నాడా? ఇదీ ఆమె మనసును నలిపేస్తున్న ప్రశ్న. మళ్ళీ ఒక్కసారి జీవితాన్ని చూసుకుంటే ఏముందీ? ఆరోహణా, అవరోహణా గమకాలు తప్ప బిడ్డ జీవితం గురించి పట్టించుకోని తల్లితండ్రులూ, అన్నావదినలూ. ఇహ అత్తగారింట సంగతి సరేసరి. పెళ్ళైంది కానీ భర్త రాధామోహనుడు అప్పటికే పుచ్చిపోయి చచ్చిపోయాడు. పెళ్లైన కన్య తను. ఇంకా కన్నెతనం చెడలేదు. లేపుకొచ్చిన కామేశ్వరరావు పరమ అసమర్ధుడు, భయస్తుడు. ఇల్లు కల సర్వేశ్వరరావు ఓ కట్లపాము. ఆ ఇంట్లోనే […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 12

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య. భక్తుడు ఏకులం వాడు? ఏమిచేసే వాడు? అన్న బేధం భగవంతునికి లేదు. భక్తి గలిగి ఉంటే చాలు. జీవుడు ఎలాంటివాడు అని కాకుండా జీవుడు తన అంతరాత్మలో నిత్యం భగవంతుని స్మరిస్తే చాలు పాపాలు పటపంచలవుతాయి. భగవంతుడు భక్తునికి కైవశమౌతాడు అని బోధిస్తున్నాడు అన్నమయ్య. పల్లవి: పరుస మొక్కటే కాదా పయిడిగా జేసేది అరయ లోహమెట్టున్నా నందుకేమీ చ.1. వనజనాభుని భక్తి వదలకుండిన జాలు మనసు ఎందు దిరిగినా మరియేమి మొనసి ముద్రలు […]

మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం!

రచన: టి.వి.ఎస్ శాస్త్రి కొన్ని సంస్థల పేర్లను చూస్తుంటే నవ్వొస్తుంది! ఒక ప్రఖ్యాత ఆంగ్ల రచయిత(పేరు గుర్తుకు రావటం లేదు, క్షమించండి! ) లండన్ లో ‘Ugly Men Club ‘అనే సంస్థను ప్రారంభించాడట! ఎంతకాలం చూసినా ఏ ఒక్కడు కూడా అందులో సభ్యుడిగా చేరలేదట! ఎవరికి వారు తమని అద్దంలో చూసుకొని తమ అందాన్ని చూసి మురిసిపోతుంటారు! ‘నేను అందవిహీహనంగా ఉన్నానని ‘ ఎవడూ అనుకోడు! మనిషి అందంగా ఉండి, ఆలోచనలు ugly గా ఉంటే […]

GAUSIPS – ఎగిసే కెరటాలు-9

రచన: – శ్రీసత్య గౌతమి కౌశిక్ ఆఫీసుకి వెళ్ళిన వెంటనే అడ్మినిస్ట్రేటర్ డయానా తో తన బడ్జెటింగ్ గురించి మాట్లాడాడు. డయానా వెంటనే ఫైల్స్ ని తిరగేసి, కౌశిక్ గ్రాంట్ ఒకటి రెన్యువల్ అయితే ఒక సంవత్సరం పాటు ఒక మనిషి జీతమివ్వడానికి కాని బెనిఫిట్స్ లేకుండా అంటే ఒక పార్ టైం జాబ్ ని కల్పించేటంత మాత్రమే సరిపోతుంది అని చెప్పింది. “వెల్ డయానా … థట్ ఈజ్ నాట్ ఐ యాం లుకింగ్ ఫర్” […]

రియాలిటీ – షో -రియాలిటీ

రచన: జొన్నలగడ్డ కనకదుర్గ “హాయ్ సుమ! రా ఎలా వున్నావు? ” పనిపిల్ల తలుపు తియ్యగానే సోఫాలో పడుకునే హుషారుగా పలకరించింది మా వదిన. ఆవిడ గొంతులో హుషారుకి నేను కొంచెం ఆశ్చర్యంతోనే “ బావున్నా వదినా! నువ్వు ఎలా వున్నావు? కాలు ఎలా వుంది? కొంచెం పర్వాలేదా?” అని పరామర్శించా. ఈ మధ్య మా వదిన కాలు స్ప్రెయిన్ అయింది, డాక్టరూ వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడని అన్నయ్య పదిరోజుల క్రితం ఫోను చేసి […]

రిటైర్మెంట్ ( హాస్య కధ )

రచన : శర్మ జి ఎస్ అక్కడ దాదాపు 1000 గడపలుంటాయి . అంతమాత్రాన అది పట్టణమూ కాదు . అలాగని పల్లెటూరూ కాదు . పోనీ అటు పట్టణానికీ , యిటు పల్లెటూరుకూ నడుమ వరుసలో ఉందని అనటానికీ వీల్లేని ఓ సరిక్రొత్త అత్యాధునిక సిటీలా చెలామణీ అవుతున్నది హైదరాబాదుకి ఊరి చివర . అక్కడ వుంటున్న వాళ్ళు అందరికీ పుట్టుకతో వచ్చిన రెండు కాళ్ళే కాకుండా రకరకాల వాహన సంపత్తి సమకూర్చుకొన్నవాళ్ళే . హైదరాబాదు […]

అంతరంగం

రచన: శ్రీకాంత గుమ్ములూరి ఆరేళ్ళ అప్పూ అమ్మ కోసం అన్ని దెసలా వెతికాడు. అమ్మ కన్పించలేదని ఏడ్చి ఏడ్చి అలిసిపోయాడు. ఇంటా బయటా వాడంతా వెతికి వెతికి వేసారిపోయాడు . తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని ఇంటివైపుకి నడిచాడు. చిమ్మ చీకట్లు. చీకట్లో చింత చెట్టు చింతాగ్రస్తంగా చిరుకొమ్మల్ని అటూ ఇటూ కదలిస్తోంది. మనసంతా అంధకారం అయోమయం. నిజంగానే అమ్మ తననలా ఒదిలిపెట్టి వెళ్లి పోయిందా? తాను చేసిన పనికి కోపం వచ్చే అలా వెళ్లిపోయిందా? అమ్మ కనబడగానే […]

అరుణోదయం

రచన: కర్రా నాగలక్ష్మి మధ్యాహ్నం మూడయింది, మంచం మీద నడుం వాల్చిందన్నమాటే గాని కళ్లు మూతలు పడటం లేదు . అంతూపొంతూ లేని ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అలకలో . గత మూడు సంవత్సరాలుగా తన జీవితంలో జరిగిన మార్పులు తనని అంధకారంలోకి నెట్టేసేయి . ఎందుకిలా జరిగింది అని ప్రశ్నించుకుంటే విధిలిఖితం అని తప్ప మరో సమాధానం రాలేదు . మూడేళ్ల కిందట యెర్రని పారాణి కాళ్లకు పెట్టి ఫెళ్లున ఆకాశమంత పందిరి వేసి అయిదు […]

పెళ్లి

రచన: అప్పరాజు నాగజ్యోతి సాయిగార్డెన్స్ లో విశాల్, శిల్పల పెళ్లి జరుగుతోంది. ఒక వేపు పెళ్ళికూతురు తల్లితండ్రులైన సుమతి, రాజారావులు పెళ్ళికొడుకు తరఫు వారికి జరగవలసిన మర్యాదలకి ఏ లోటు లేకుండా చూసుకునే హడావిడిలో ఉంటే, మరో వేపు పెళ్ళికొడుకు అమ్మానాన్నలైన ఉష , భానుమూర్తీ తమ వైపు నుండి వచ్చిన ముఖ్యులందరినీ స్వయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. పెళ్ళికి వచ్చినవారిని నవ్వుతూ పలకరిస్తున్నప్పటికీ “కొడుకు పీటల మీద ఏం పేచీలు పెడతాడో, ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుందో, […]

అమ్మ రాసిన వీలునామా

రచన: పద్మా త్రివిక్రమ్ ప్రియాతి ప్రియమైన నా బంగారు తల్లికి, ప్రేమతో నీ పుట్టినరోజునాడు అమ్మ ఆశీర్వదించి వ్రాయు వీలునామా. నాకు అన్నింటికీ తొందరే అనుకుంటున్నావా, అవునే, నీలాగే నాకు తొందరెక్కువే… ఏమి చేస్తాము చెప్పు, అప్పుడే నీకు ఇరవయ్ రెండో పుట్టినరోజా, అసలు నాకు బొత్తిగా నమ్మబుద్ది కావట్లేదు. ఏ పసిపిల్లల్ని చూసినా, ఏ స్కూల్ కి వెళ్ళే పిల్లలని చూసినా నువ్వే గుర్తుకు వస్తావు. ఆ తప్పటడుగులు, ఆ చిలకపలుకులు, ఆ ప్రశ్నించే విధానం, […]