March 28, 2024

ఉపయుక్తమైన చిట్కాలు, జాగర్తలు

నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ How to Track your Family, Friends ఇక బయటికెళ్లిన మన వాళ్లకు ఏమవుతుందో ఇక వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. వీడియో లింక్ ఇది: కాలు తీసి బయట పెట్టిన మనిషి మళ్లీ తిరిగి వచ్చేవరకూ టెన్షనే మనందరికీ. రోజూ టైమ్‌కి ఇంటికొచ్చే మనిషి గంట దాటినా రాకపోతే… ఫోన్ తీయకపోతే.. ఏం జరిగిందో ఎక్కడున్నారో అని ఆదుర్ధాపడుతుంటాం. ఇంత మానసిక వత్తిడిని ప్రతీరోజూ అనుభవించే వారి […]

మాయానగరం – 31

రచన: భువనచంద్ర ఆనందరావు బోంబేకి వెళ్ళాడు. అందరిలా హోటల్ ఫుడ్డు కాకుండా “సామూహిక వంట ‘ తో విందుని ఇచ్చాడు. మాధవి, శోభ, మదాలస, సుందరీబాయే కాక సౌందర్య, వసుమతి కూడా విందులో పాల్గొన్నారు. ఏ కళనుందో గానీ సుందరీబాయి అందరిలోనూ మామూలుగానే వుంది. అది ఆనందరావుకి చాలా ఆనందాన్నిచ్చింది. “మీకు జాబ్ దొరికింది! మాకు చాలా చాలా ఆనందం ఆనందరావుగారూ, నేనూ ఏదో ఓ జాబ్ సంపాయించుకోవాలి ! ” ఆనందరావుని అభినందిస్తూ అంది మదాలస. […]

ప్రమేయం ఒక కథ .. మూడు ముగింపులు

రచన:- రామా చంద్రమౌళి అదృష్టం.. అంటే దృష్టము కానిది.. అంటే కనబడనిది . ఏమిటి కనబడనిది.? ఏదైనా.. నేటికి రేపు.. కనబడనిది.. వర్తమానానికి భవిష్యత్తు కనబడనిది.. మనిషికి మనసు.. కనబడనిది.. కళ్ళకు గాలి కనబడనిది.. అసలు మున్ముందు జరుగబోయే జీవితం ఏమిటో.. అస్సలే కనబడనిది. ఒక స్త్రీ, పురుషుడి జీవితంలో ‘ పెళ్ళి చూపులు ‘ అనే ప్రహసనం ఎంత పెద్ద జోకో .. అనుకుంది లీల. వెంటనే అమ్మ జ్ఞాపకమొచ్చిందామెకు. తనను పెళ్ళి చూపులకు అలంకరించి […]

“కళాఖండం – A Work Of Art”

రచన: వంశీ మాగంటి కాగితం పొట్లం ఒకటి చంకలో పెట్టుకుని ఆ కుర్రాడు మెల్లగా డాక్టరు గారి రూములోకి అడుగుపెట్టాడు. “నువ్వా అబ్బాయ్! రా రా! తేలికగా వుందా ? ఏమిటి విశేషాలు” “మా అమ్మ మీకు నమస్కారాలు చెప్పమంది. నేను మా అమ్మకి ఒక్కణ్ణే కొడుకుని. భయంకరమైన జబ్బు నుంచి కాపాడి నా ప్రాణం నిలబెట్టారు. మీ ఋణం ఎలా తీర్చుకోగలమో తెలియట్లేదు” “నాన్సెన్స్ . నేను చేసిందేముంది? నా స్థానంలో ఎవరున్నా చేసేదే నేనూ […]

పురుషులలో పుణ్యపురుషులు

రచన: MSV గంగరాజు ఢిల్లీ అనగానే నాకు స్ఫురించేవి కుతుబ్‌ మీనారూ, ఇండియా గేటూ, పార్లమెంట్‌ హౌసూ`ఇత్యాది కట్టడాలు కాదు. మనసున్న మంచి మిత్రుడు క్రాంతికుమార్‌! భగవంతుడు సృష్టించిన జీవకోటికి మకుటాయమైన వాడు మానవుడైతే, ఆ మకుటాలలో పొదగబడిన మణులు క్రాంతికుమార్‌ లాంటి వాళ్ళు. నేనూ, అతడూ బాపట్లలో అగ్రిక్చరల్‌ బి.యస్‌.సి. చదువుకున్నాం. కాలేజీలో నాలుగు సంవత్సరాలు సహపాఠులమైతే, హాస్టల్‌ గదిలో రెండేళ్ళు సహవాసులం. ఇక మా ఇద్దరి ఆర్ధిక స్థితిగతులు ఎటువంటివంటే ` కాడెద్దులూ ఎకరం […]

రా..రా… మా ఇంటి దాకా..

రచన: శ్రీధర మూర్తి వాన.. వాన…. జగాన దగా పడి కుమిలి కుమిలి ఏడుస్తున్న చెల్లెళ్లందరి కళ్లల్లోనుంచి పెల్లుబికి వస్తున్న కన్నీటి ధారల్లా రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆ కాలనీలో అన్నీ అయిదంతస్తుల అధునాతన సుసంపన్నుల నివాసాలే! కానీ ఇప్పుడా మేడలన్నీ నడి సముద్రంలో నిలబడిన ఓడల్లా ఉన్నాయి. చుట్టూ నీళ్లు… అక్కడెక్కడో మొదలైన అల్ప పీడనం… ఇక్కడ వీళ్ళని పట్టి పీడిస్తోంది. కుట్టి కుదిపేస్తోంది. రెండు రోజుల నుంచి […]

ట్రినిడాడ్ నర్సమ్మ కథ…( చరిత్ర చెప్పని కథ )

రచన: పంతుల గోపాలకృష్ణ ఇది ఇప్పటి ముచ్చట కాదు. నలభై ఏళ్లనాటిది.. అప్పుడతడు మన ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నమెంటు డాక్టరుగా పని చేస్తుండే వాడు. ఎనస్థీసియాలో M.D. డిగ్రీ సంపాదించేడు. అప్పట్లో చాలా మంది డాక్టర్లలాగే ఇక్కడ సరైన ప్రోత్సాహం కొరవడి విదేశాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నిస్తే Trinidad లో Port of Spain లో యూనివర్శిటీ హాస్పిటల్లో ఉద్యోగం వస్తే వెళ్లి చేరాడు. యూనివర్శిటీ హాస్పిటల్ ఊరి మధ్యలో ఉంది. ఒకవైపు కొండలు, […]

“పురుష” పద్యములు

రచన: – జెజ్జాల కృష్ణ మోహన రావు   సామాన్యముగా పద్యములకు పేరులు పూలపేరులుగా లేక స్త్రీల పేరులుగా ఉంటాయి. పురుషుల పేరులతో లేక పుంలింగముతో ఉండే పేరులుగల పద్యములను సేకరించి వాటికి ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో మొదటి రెండు పద్యములు, చివరి పద్యము ప్రత్యేకముగా పురుషులపైన వ్రాసినవి. మిగిలిన వాటికి నాకు తోచిన విధముగా ఉదాహరణములను ఇచ్చినాను. అందఱు ఈ నా ప్రయత్నమును ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నక్షత్రపు గుర్తుతో (*) చూపబడిన వృత్తములు నా కల్పనలు. […]

!!అద్భుతమైన ప్రతిభ కి అక్షర రూపం, అసమాన అనసూయ !!

సమీక్ష: పుష్యమి సాగర్ ఒక మనిషి జీవితం మహా అయితే ఎంత ఉంటుంది ఇప్పటి కాలంలో అయితే ఎక్కువలో ఎక్కువ 50 అనుకుంటాను ..కానీ 95 వసంతాలు దాటినా ఇప్పటికి జీవితం పట్ల అదే స్ఫూర్తిని సంతోషాన్ని కొనసాగిస్తూ, నలుగురికి మార్గదర్శకంగా ఉండే వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము …వారెవరో కాదు కళాప్రపూర్ణ బిరుదాంకితులు Dr. అవసరాల (వింజమూరి ) అనసూయా దేవిగారు. వారి ఆత్మకథని వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికావారు ఒక పుస్తకంగా తీసుకురావడం […]

సినిమా పాట పుట్టుక

రచన: కందికొండ ఎం.ఎ. తెలుగు (పిహెచ్‌.డి.) పరిశోధకుడు, ప్రముఖ సినీ గీత రచయిత సినిమా పాట ఒక విక్షణమైన సాహిత్య ప్రక్రియ. నేడు జనజీవితంలో ఒక అందమైన లతలా పెన వేసుకుంది. అది ఎంతగానంటే! ప్రయత్నంగానో, అప్రయత్నంగానో మన అనుమతి లేకుండానే మన చేతనే ఆలాపింప చేసేటంతగా విందుల్లో, వినోదాల్లో, వేడుకల్లో పాటు వినిపించడం మనం నిత్యం వింటున్నాం, చూస్తున్నాం. సాహిత్య ప్రక్రియగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకునే క్రమంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సినిమా పాటను నాటి […]