April 23, 2024

వేదన బరువై

రచన: లయన్ విమల గుర్రాల “కంగ్రాట్స్..మాలతి గారూ.. మేల్ చైల్డ్” – స్కానింగ్ రూమ్ లోంచి చేతులు తుడుచుకుంటూ వచ్చింది డాక్టర్ పద్మిని. ఒకక్షణం ఆనందపు తరంగం ఉవ్వెత్తున లేచింది మాలతికి. “థ్యాంక్స్ డాక్టరుగారూ .. మళ్ళీ నెక్స్ట్ సండే వస్తాను”.. లేచింది కుర్చీలోంచి. “ఒ.కె.. నేనిచ్చిన టాబ్లెట్స్ జాగ్రత్తగా వాడండి – లక్ష్మీ,, ఉదయం వచ్చిన శాంపిల్స్ లోంచి వీరికి యివ్వు” నర్సుకి పురమాయించింది పద్మిని. ఇంతలో బయట కారు ఆగిన శబ్దమూ, ఆ వెంటనే […]

GAUSIPS – ఎగిసేకెరటం-5

రచన:-శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి [జరిగిన కధ: సింథియా క్రొత్త క్రొత్త డ్యూటీలను తన కైవసం చేసుకుంటున్నది. మొన్నటిదాకా ఏవో చేసుకుంటూ ఛటర్జీకి ఒక పర్సనల్ సెక్రటరీలాగ కూర్చొనేది, తాను అమెరికాలో సెటిల్ ఆయ్యే టైం దగ్గరపడుతుంటే … క్రొత్త క్రొత్త పధకాలతో ఆ ల్యాబ్ స్వతంత్రాన్ని ఒక్కొక్కటి గా కైవసం చేసుకుంటున్నది. బిశ్వాకి ఆందోళనని కలిగిస్తున్నది] సింథియా, ఛటర్జీలమీద వీసమెత్తు అనుమానం కూడా లేని బిశ్వా సింథియా, ఛటర్జీల కేలక్యులేషన్స్ ఏ మాత్రం అర్ధం చేసుకోలేడు. కానీ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 8

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మనస్సు అనేది చాలా విచిత్రమైనది. అది చెడుకు లొంగినంత సులభంగా మంచికి లొంగదు. మనస్సే బంధనానికి కాని, ముక్తికి కాని కారణమవుతుంది. మనస్సును నిగ్రహించడం జీవునికి అతిముఖ్యమైన పని. అర్జునుడంతటి స్థితప్రజ్ఞుడే, స్థిరచిత్తుడే, శ్రీకృష్ణునితో కృష్ణా! మనస్సు చాలా చంచలమైనది. అది సమస్త ఇంద్రియాలను క్షోభింపజేస్తుంది. ఇంద్రియ సుఖాలలోనే దృఢంగా ప్రవర్తిస్తుంది. అట్టి మనస్సును నిగ్రహించడం ప్రతికూలమైన వాయువును అడ్డుకోవడమంతటి దుష్కరం అని వాపోవడం గమనార్హం. మనశ్చాంచల్యం చాలా చిత్రమైనది కూడా. అది […]

జీవితం ఇలా కూడా ఉంటుందా? 4

రచన: అంగులూరి అంజనీదేవి నరేంద్ర తల్లివైపు చూడకుండా గోడ వైపు చూస్తూ ”అత్తా, కోడలూ పులి మేకలా వుండాలంటే ఒకే ఇంట్లో వీలుకాదు. సెంటిమెంట్స్ లేనిచోట ఏ అనుబంధం నిలవదు. అనుబంధం లేనిచోట మనుషులు మనుషుల్లా ప్రవర్తించలేరు. ఎప్పుడు చూసినా మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లే వుంటారు. ఇక జీవించేదెప్పుడు? జీవించటం చేతకానప్పుడు ఎవరు గీసుకున్న గిరిలో వాళ్లుండటమే మంచిది. నా నిర్ణయానికి మీరు అడ్డురావద్దు. నేను కూడా మీకు అడ్డుగా వుండదలచుకోలేదు” అన్నాడు. అప్పుడు […]

మాయానగరం : 29

రచన: భువనచంద్ర కొన్ని సంఘటనలకి కారణం కనిపించదు. కానీ అవి జరుగుతాయి. కొందరు దాన్నే ‘ఈశ్వరేఛ్చ ‘ అంటే , మరి కొందరు మరో పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు. పరమశివం సడన్ గా తేరుకున్నాడు. జీవితాంతం ‘మాటరాని ‘ మనిషిగా బ్రతకాలని చెప్పిన డాక్టర్. శ్రీధర్ మాట పొల్లుపోయింది. మూగమణి జాలితో పెట్టిన ప్రసాద ‘మహిమ ‘ కావొచ్చు, ఫాదర్ డేవిడ్ దయాపూరితమైన చూపులు కావొచ్చు. లోకంలో అతనికింకా ‘నూకలే ‘ గాక ‘ మాటలు […]

శుభోదయం -8

రచన: డి.కామేశ్వరి శారద జీవితం నాశనం కాకుండా ఏం చెయ్యాలా ఆని రాత్రంతా ఆలోచించింది రాధ. కాని అప్పటికే శారద నిండా మునిగిందని గుర్తించలేకపోయింది. ఆ మర్నాడే పార్వతమ్మ గుండెలు బాదుకుంటూ “రాధమ్మా.. చూశావమ్మా మీ ఆయన ఎంత ఘోరం చేశాడో.. మా పిచ్చిమొద్దు శారదని..” ఆవిడ యింక చెప్పలేనట్టు కింద కూలబడింది. రాధ నిర్వీణురాలై చూసింది. పార్వతమ్మగారికి ఈ విషయం తెల్సిపోయిందన్నమాట. శారద చెప్పిందా! ఎలా తెలిసింది.. ఇప్పుడావిడకి ఏమని చెప్పడం.. రాధ మొహం పాలిపోయింది.”ఏం […]

విశ్వనాధ నవలలపై విహంగవీక్షణం – ధూమరేఖ

రచన-ఇందిరా గుమ్ములూరి, పి.హెచ్.డి. (తెలుగు లిట్.) పురాణవైరగ్రంధమాలలో ఈ నవల మూడవది. దీని రచనాకాలం 1959. దీనిని కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు ఆశువుగా చెపుతుండగా శ్రీ పాలావజ్జల రామశాస్త్రిగారు లిపిబద్ధం చేసేరు. నందివర్ధనుడు ప్రద్యోతవంశంలో చివరి రాజు. ఈతని పదవీచ్యుతుని గావించి, శిశునాగవంశజుడు, కాశీ రాజైన శిశునాగుడు మగధరాజ్యాన్ని ఆక్రమించిన వృత్తాంతమే ధూమరేఖ అనే ఈ నవలకు ఇతివృత్తం. ప్రద్యోతుడు, పాలకుడు, విశాఖయూపుడు, జనకుడు, నందివర్ధనుడు అనే పంచప్రద్యోతులు మగధదేశాన్ని నూటముప్ఫై సంవత్సరాలు పాలించారు. అనంతరం కలిశకం […]

శ్రీ కృష్ణ దేవరాయవైభవం -4

రచన: -రాచవేల్పుల విజయభాస్కరరాజు సాళువ నరసింహరాయలు మరణిస్తూ తన పసిబాలురైన కుమారులు రాజ్యభారాన్ని నిర్వహించడం ఇటు రాజ్యానికి అటు తన కుమారులకు క్షేమదాయకం కాదని భావించాడు. క్రీ.శ.1490 లో తన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇక తనకు మరణం తప్పదని ముందే పసిగట్టిన సాళువ నరసింహరాయలు తన అవసానదశలో తనకు నమ్మిన బంటుగా ఎదిగిన సర్వ సైన్యాధిపతి తుళువ నరసా నాయకున్ని రావించాడు. తన తదనంతరం విజయ నగర సామ్రాజ్య చక్రవర్తిగా తన కుమారుల్లో యోగ్యుడైన […]

!!నవరసాల చిత్ర సమాహారం జీవన శిల్పం !!

సమీక్ష: పుష్యమీ సాగర్ మనిషిలోని స్వార్ధం ఎంతగా పేరుకుపోయినా, మనిషి తన గురించే ఆలోచించుకున్నా అక్కడ …అక్కడ మంచితనం, మానవత్వం ఉంది. జీవితం లో ఆనందాలని, కష్టాలని, విషాదాలన్నిటిని చక్కని శైలితో ఆకట్టుకునే విధంగా కధానికలు రాసి సంపుటిగా మన ముందుకు తీసుకు వచ్చారు కన్నెగంటి అనసూయగారు. పడమటి సంధ్య రాగం: మన చుట్టూ జరుగుతున్న వాటిని కథగా మలచడంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మొత్తం 20 కధలు ఉన్నా వీటిలో వేటికవే ప్రత్యేకం. ఓ గొప్ప […]

తిరుపాంపురం

రచన: నాగలక్ష్మీ కర్రా ఇక్కడ వున్న కోవెల పేరుమీదే ఈ వూరుని ” తిరుపాంపురం ” అని పిలుస్తారు . తమిళంలో ‘ తిరు ‘ అంటే శ్రీ అని అర్దం . శ్రీ పాంపురం అనగానే నాగులకు సంబంధించిన కోవెల అని తెలుస్తూనే వుందిగా! తమిళనాడులోని కావేరీ నది తీరాన వున్న 108 స్వయంభు శివలింగాలలోనూ 59 వ స్థానంలో వున్నట్లు జ్ఞానసంబందార్ చే స్థుతించబడ్డ తీర్థం . చరిత్రకు అందిన ఆధారాల ప్రకారం గత […]