April 25, 2024

ఆమె-అతను

రచన-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు సతీ సహగమనం పేరుతొ చితి మంటల్లోకి దూకింది. అతని ఆజ్ఞానం ఆమెను బూడిదగా చేసింది. పతి ప్రాణం కోసం యముడిని వెంబడించింది. ఆమె పిచ్చి ప్రేమ అతనికి జీవితాన్నిచ్చింది. ముసలివానికిచ్చి పెళ్లిచేస్తే మౌనంగా భరించింది. అతని మూర్ఖత్వం ఆమె పాలిటి నరకమయింది. మగవాని అత్యాశకు కట్నం కోరల్లో బలి అయింది. అతని రాక్షసత్వం ఆమె పాలిటి శాపమయింది. చిత్రహింసలకు చెలి అయింది. ఘోరకలి అయింది. ఆతని అహంకారం వల్లే ఆమె వక్తిత్వం […]

అలవాటే!

రచన: భమిడిపాటి శాంత కుమారి ఏరుదాటాక తెప్పను తగలెట్టటం ఈ పెద్దలకు అలవాటే! ఆ వయసులో తామేమి చేశామో మరిచిపోవటం పరిపాటే! అది వారికి సహజ సిద్ధమైన పొరపాటే! తమ వయసులో తాము చూసినవి,చేసినవి మరిచిపోవటం గ్రహపాటే! అర్ధంకాని వయసులో అన్నీఅలానే చేసి పిల్లల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇలా అపార్ధాలకు తమమననులో తావిచ్చి ఆదరించవలసిన విషయంలో చీదరించి దన్నుగా ఉండవలసిన సమయంలో వెన్నుచూపి మేల్కొల్పాల్సిన తమ మనసును తామే నిదురపుచ్చి ఇలా ప్రవర్తించటం న్యాయమా? వయసు చేసే […]

మాలిక పత్రిక – జూన్ 2016 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మండే ఎండలనుండి చల్లని మేఘమాలను ఆహ్వానించే మాసం జూన్. పాఠకులందరినీ అలరిస్తున్న కథలు, శీర్షికలు, సీరియల్స్, ప్రత్యేక కథనాలు, ముఖాముఖిలతో ముస్తాబై వచ్చింది ఈ నెల మాలిక పత్రిక.. ఈ సంచికలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.  ప్రముఖ విద్వాంసుడు శ్రీ ఇనుపకుతిక సుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖి, అలనాటి రేడియో వ్యాఖ్యాత శ్రీమతి జోలెపాలెం మంగమ్మగారి జీవితవిశేషాలు  ధీరలో.. అంతేకాక మాలిక పత్రికనుండి హాస్యకథల పోటి కూడా ఉంది. మరి  పత్రిక […]

హాస్య కథల పోటి

హాసం… మందహాసం, దరహాసం.. వికటాట్టహాసం… ఓయ్.. ఎప్పుడూ అలా మూతి ముడుచుకుంటావెందుకు. కష్టాలు – కన్నీళ్లు, టెన్షన్సు – డిప్రెషన్సు అందరికీ ఉంటాయి. ఎక్కువా – తక్కువా అంతే.. అప్పుడప్పుడు కాస్త నవ్వాలబ్బా…… నవ్వడం చాలా వీజీ అనుకుంటారు కాని చాలా కష్టం. ఎటువంటి కల్మషం లేని పసిపిల్లల నవ్వులు ఎంత అందంగా, హాయిగా ఉంటాయి మీకు తెలుసుకదా.. అందుకే మరి.. మాలిక పత్రిక, శ్రీ గుర్రాల లక్ష్మీప్రసాద్ ట్రస్ట్ సంయుక్తంగా హాస్యకథల పోటి నిర్వహిస్తోంది. చదవగానే […]

ధీర – 4

రచన: లక్ష్మీ రాఘవ “జోలెపాలెం మంగమ్మ” ఈ పేరు ఎక్కడో విన్నట్టు లేదూ? ఎక్కడో ఏమిటండీ AIR [All India Radio] లో తెలుగు వార్తలు గుర్తుకు రాలేదూ?? “వార్తలు చదువుతున్నది జోలెపాలెం మంగమ్మ….” టంచనుగా పొద్దున్న ఏడు గంటలకు రేడియోలో వినబడే చక్కటి స్వరం, స్పష్టంగా పలికే పదాలు. ఎక్కడా తడబాటు లేకుండా సాగిపోయే తెలుగు వార్తలు… ఎంతమందినో అలరించిన గొంతుక…చాలా మందికే గుర్తుండిపోయింది. ఆవిడే మొట్టమొదటి తెలుగు మహిళా న్యూస్ రీడర్. కాలం మారింది… […]

గానగంధర్వ శ్రీ ఇనుపకుతిక సుబ్రహమణ్యంగారితో ముఖాముఖి …

నిర్వహణ: శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి. సంగీతానికి ఉర్రూతలూగని మనసు ఉండదు, అది దేశీయ సంగీతమనుకోండి, విదేశీ సంగీతమనుకోండి. ఆ సంగీతానికీ, మనసుకీ ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది. అనారోగ్యాన్ని సైతం దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే శక్తి సంగీతానికి ఉంది. ఈ సంగీతానికి రాగాలు కట్టి శ్రావ్యంగా, ఖచ్చితమైన శృతిలో వినిపించడానికి కృషి సల్పిన వాగ్గేయకారులెందరో ఉన్నారు మన భారత సంతతిలో. మనభారతదేశంలోనే కాదు హిందూ దేవుళ్ళపై పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి సమ్మోహనంగా భజనసంగీతాన్ని అందించే […]

మాయానగరం : 28

రచన: భువనచంద్ర గామోక వీధి (అంటే గాంధి మోహన్ దాస్ కరాంచంద్ వీధి) కోలాహలంగా వుంది. అతిత్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయనే పుకారు ఇంటింటికీ, గుడిసె గుడిసెకీ హుషారుగా షికారు చేస్తోంది. అది ‘మిడ్ టరమ్ ‘ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక ఎవరి హస్తం వుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. “అన్ని చోట్ల నించీ వార్తలు వస్తూనే వున్నాయి. ఈ వార్తని పుట్టించింది ఇక్కడ కాదు. ఢిల్లీలో పుట్టించి ఇక్కడ పెంచుతున్నారు. […]

విశ్వనాధ నవలల పై ఒక విహంగ వీక్షణం – 2

రచన:-ఇందిరా గుమ్ములూరి, పి.హెచ్.డి. నాస్తికధూమము పురాణవైర గ్రంధమాలలో ఇది రెండవ నవల. దీని రచనాకాలం 1958. ఈ నవలని కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ఆశువుగా చెపుతుండగా శ్రీ పాలావజ్జల రామశాస్త్రిగారు లిపిబద్దం చేసేరు. బృహద్రధవంశీయులు భారతయుద్ధానికి పూర్వం కొన్ని వందల ఏళ్ళుగా మగధని పాలిస్తున్నారు. వైవస్వత మనువునుండి ముప్పైఒకటవ రాజు సంపరుణుడు. అతని కుమారుడే కురు. ఈతని పేరనే కురువంశ స్థాపన జరిగింది. ఈతడు తన రాజధానిని ప్రయాగనుండి కురుక్షేత్రానికి మార్చాడు. ఈతని తర్వాత ఈతని […]

శ్రీ కృష్ణ దేవరాయవైభవం: 3

రచన: రాచవేల్పుల విజయ భాస్కరరాజు వంశావళి కర్ణాటక రాజ్యంలో తుళు జాతీయులు మాత్రమే నివశించే ప్రాంతం ఒకటి ఉండేది. ఆ రోజుల్లో ఉత్తర కెనరా జిల్లాతోపాటు సముద్రతీరం,దాని పరిసర ప్రాంతాలు తుళునాడుగా భాసిల్లాయి.శత్రువులకు సింహ స్వప్నమై, అరివీర భయంకరులుగాచక్రవర్తులను సైతం విస్మయానికి గురి చేసే యుద్ధ నైపుణ్యం తుళు జాతీయులకు పుట్టుకతోనే అబ్బింది. అలాంటి తుళు జాతికి మణిరత్నం అని చెప్పుకోదగినవాడు తిమ్మ భూపతి. మహా యోధానయోధుడు. తుళువంశ ప్రతిష్టకు మూల పురుషుడు. ఇతని సతీమణి దేవకీ […]

GAUSIPS – ఎగిసేకెరటం-4

రచన:-శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి [జరిగిన కధ: పూనం, పాత్రో, రంజిత్ వాళ్ళు వచ్చేశారు, మొదటిరోజే వాళ్ళని బిశ్వాతో కలవనీయకుండా తెలివిగా తప్పించింది సింథియా. ఛటర్జీ దృష్టిలో బిశ్వాని ఒక నిర్లక్ష్యమయిన వైఖిరి వున్నవాడుగా ఒక ఇటుక పేర్చింది] సింథియా అదృష్టమేమోగానీ, అన్నీ తాను కోరుకున్నట్లుగానే జరిగిపోతోంది. తన పధకాల ప్రకారమే మనుష్యులు కూడా టకటకా చేసేస్తుంటారు. సింథియాకున్నంత మ్యానేజ్మెంట్ స్కిల్స్ మిగితావారికి లేకపోవడమో లేక వారు తమకనవసరమయిన విషయయాలపై దృష్టి పెట్టకపోవడమో, ఎదుటివారికనవసరమయిన విషయాలని సింథియా తనకవసరాలుగా […]