March 29, 2024

దుర్ముఖీ నీవు సుముఖివే                                         

స్వధ వెలమకన్ని   ఏ ముఖం పెట్టుకోని వస్తున్నావు నీవు? ఓహో మన్మధయేమందంగా వుందని అడుగుతున్నావా? మనసందం లేని మనుషులకి మన్మదైనా, దుర్ముఖైనా ఒకటేనంటావా? దుర్మతులు, నరరూప రాక్షసులు మన్మధలో లేరా, నేనొస్తానంటే వద్దంటావేం వచ్చితీరుతానంటావా? దుర్ముఖీ! నీవెలాగో మా సముఖానికి రానేవచ్చావ్ ఎన్ని ఉగాదులు వచ్చినా మారని దగాకోరులు, కల్తీశాలులు, అవినీతిపరులు, స్త్రీని వేధించే నీచ కీచకులు ఇకనీవంటే హడలి మారాలి లేకుంటే చావాలి, అమ్మా! దుర్ముఖీ మాలో సుహుద్బావాన్ని నింపి మాకు సుఖశాంతులనిచ్చి, అందరికి ఆనందాన్ని పంచి తెరమరుగు కాకుండా “భాషలరాణి తెలుగు సుభాషిణి” అందలమెక్కించి నీవు సుముఖివే అనిపించు మమ్ము అలరించు!

 సాగనంపేస్తా 

యు.ఎల్. ఎన్. సింహా అదిగో నవ ఉగాది వచ్చేస్తుంది ఇక పండగే పండుగ మనకు దినపత్రిక పేజీలలో దినఫలాలుగా దూరదర్శన్లలో దేదీప్యమానంగా ముఖపుస్తకంలో మె(ము)రిసిపోతూ వెబ్ సైటులో వెలిగిపోతోంది…. కవితా పోటీలు…పండుగ సంబరాలు… పంచాంగ శ్రవణాలు, అష్టవధాన కాలక్షేపాలు మనకిక పండుగే పండుగ… ఆనాటి పల్లెలు లేకపోతేనేం.. మావిడితోరణాలు గుమ్మానికి కట్టకపోతేనేం… పసుపుగడపలు కనుమరుగైతేనేం … గుండెల నిండా ఆత్మీయతల్ని… మనసునిండా మమతానురాగాల్ని నింపుకుని… ఓ నలుగురు బంధువులు మన మధ్యకు రాకపోతేనేం… చిచ్చుబుడ్డికి కొత్త చొక్కా తొడిగినట్టు సంతోషాల్ని విరజిమ్ముతూ తిరిగే చిన్నారులు మన మధ్య ఆడకపోతేనేం… పట్టు పరికిణీల్లో చిట్టి తల్లుల్ని చూడకపోతేనేం.. ఆ సంతోషాల వెలుగుల్లో పెద్దల ముచ్చట్లు మెరవకపోతేనేం.. కోయిలమ్మల రాగాలాపనలు వినకుంటేనేం… చిగురించడం మానేసిన చెట్లు… కూలిపోయి పలకరించే గులకరాళ్ళ మొండి గోడలు.. ఇంకా పల్లె వెలుగు బస్సు కోసం ఎదురు చూసే ఆ పెద్దాయన చేతిలోని చుట్ట వాసన… ఇవి తప్ప ఏముంది అక్కడ పండగ… పండుగంటే మనది… పసందంటే మనది…. మనిషితో పనిలేదు…మాటతో పనిలేదు… ఇంటర్నెట్ ముందు ఇకిలించి కూర్చుంటా… ముఖ పుస్తకంలో ఉగాదికి ఊరేగింపు చేస్తుంటా… లైకుల నైవేద్యాలతో.. కామెంట్ల కర్పూరహారతి పట్టిస్తా.. ఉసూరుమంటూ ఉగాదిని మరోమారు ఉత్తచేతులతో  సాగనంపేస్తా… ఓ పిడికెడు కూడ ఆనాటి పల్లె పరిమళాన్ని పెట్టకుండా..!!!

గత సంవత్సర మాతృమూర్తి

 ప్రవీణ్ కుమార్ వేముల నా మనసు సుమబాలను సంపెంగరసితో స్నానం చేయించి ఉరిమిని అరువుతెచ్చి వస్త్రాన్ని కుట్టించి కరుణను నా కంటికి కాటుకజేసి వినయ, విధేయత వజ్రాలతో నా ఆభరణాలను చేయించి తామస సంహారశైలి తిలకంగా దిద్ది మమతలను కరిగించి ముక్కెరగా చేయించి జ్ఞానసంపదను నా జడకుచ్చులుగా వేయించి ఆత్మీయతా స్నేహంలో నా అలంకరణ గావించి ప్రపంచ పూదోటలో నను విహారానికి తీస్కెళ్ళింది… శోకగ్రస్తమైనవేళ చెలిమిని పంచి సంతసంతో చిందులువేస్తే కౌగిలి పంచి ఓటమికి వెరచినవేళ వెన్నుతట్టి ప్రతి […]

ఆమనిలో 

వాణి కొరటమద్ది                                                                                       తరువులన్ని కొత్తచిగురు తొడుగుతాయి ఆమనిలో ప్రతిమదిలొ పులకింతలు రేపుతాయి ఆమనిలో || సుఖ […]

ఆమని ఆగమనం

  మంథా భానురామారావు      ఆమని ఆగమనం తో ఆరంభం కదా కోయిలమ్మల కుహుకుహురావాలు! పోటీపడి వేసే స్వరకల్పనలు పంచమ స్వరంలో ప్రతిధ్వనిస్తూ. ఎర్రని మావి చివుర్ల మధ్య వేలాడే పిందెలు చల్ల గాలికి తలలూపుతూ వసంత లక్ష్మికి స్వాగతం పలుకుతున్నాయి. విరగపూసిన వేపచెట్లు మంచు బిందువుల్లా రాల్చే పూలు నేలంతా పరచుకుని భూమాతకి వెచ్చని కంబళి కప్పుతుంటే ఆగలేని వాయుదేవుడు పని కట్టుకుని అక్కడక్కడ లేపి రంగవల్లులు దిద్దుతున్నాడు. నింబవృక్షాలకి కట్టిన ఊయలలు పడుచు కన్నెల కిలకిలలతో సొగసుగా ఊగుతుంటే కోడెకారు చిన్నవాళ్లు వలపు వలలు విసురుతూ వసంత వనముల్లో విహరిస్తున్నారు. కొత్త అల్లుళ్లు బిడియంగా వరండాలో ఒదిగి ఉంటే చిలిపి మరదళ్లు అక్కని దాచి ఆట పట్టిస్తున్నారు, అమ్మ అదిలింపులను నాన్న కోర చూపులను లెక్క చేయక. నవకాయ పిండివంటలు నాలుక చవులూరిస్తుంటే ఉగాది పచ్చడి అంటూ చేతిలో వేసింది బామ్మ. షడ్రుచులేమో గాని, చేదే తగిలి కేక పెట్టి నొసలు చిట్లించారు పిల్లందరు కూడి ఏక బిగిని. జీవిత మందునా చేదుకూడ భాగమంటూ వేదాతం వల్లించారు తాతగారు వాడిగా. కొత్త వలువలు కట్టి పెరపెర మంటూ ఏటి గట్టుకు వెళ్లి దోబూచులాడుతుంటే కొత్త అల్లునికి దొరికింది కోమలాంగి. నును సిగ్గు మోముతో కలికి కౌగిలి నిమడగా కొత్త వత్సరపు ఆనంద లహరిలో కేరింతలే మిన్నంటె పల్లె లోన.

అరుదె౦చెను యుగాది

సుజల గ౦టి అరుదె౦చెను మన్మధ నామ స౦వత్సర౦ మరుగైన వనాలతో మాయమైన మయూఖాలతో మావి చివురు తిని గళమెత్తి పాడలన్న కోకిలమ్మకు కరువైనవి చెట్టు కొమ్మలు ఎటుచూసినా మారణ హోమాలు.ఆపలేని అత్యాచారాలు అఘాయిత్యాలు. అడుగ౦టుతున్న మానవతా విలువలు అబలల ఆర్తనాదాలు పులకరి౦చమన్నా పలకలేని పుడమితల్లి పరితపిల్లుతో౦ది మానవుడు సృష్టి౦చిన ప్రభ౦జనానికి తన విజ్ఞతతో ము౦దుకు సాగుతున్నానని మురిసిపోతున్న మానవుడు తాను తీసుకున్న గోతిలో తానే పడబోతున్నానని తెలియని అ౦ధకార౦లో అయోమయ౦ లో తేలియాడుతూ మానవజాతి మనుగడకు ప్రాణ౦ […]

ముష్టి భక్తులు!  

టీవీయస్.శాస్త్రి మీరెప్పుడైనా అడుక్కునే వాళ్ళ సభలను చూశారా! చూసేవుంటారు! చూడటమే కాకుండా పాల్గొని కూడా ఉంటారు. కానీ అవి బిచ్చగాళ్ళ సభలు అని  అనుకొని  ఉండరు అంతే ! ఇటువంటి ఒక సభను చూసే ‘అదృష్టం’ ఈ మధ్యనే నాకు కలిగింది. కొంత మంది కోరికపై ఆ సభానిర్వహణ భారం కూడా నా మీద పడింది.అన్నీ భగవంతుని నిర్ణయం మేరకే జరుగుతాయి అనటానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మరేదీ అక్కరలేదు.బిచ్చగాళ్ళ కోరికలూ,  ఆలోచనలూ ఎలా ఉంటాయో చెబుతాను.నేను […]

ఉగాది ప్రత్యేకం   

సిరి వడ్డే “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః కో వేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా”… అన్నారు పెద్దలు. భారతీయ సంగీతానికి మూలం సామవేదం. ఎందరో గొప్ప వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు.  వీరు నవరసాలను ఒలికించిన కీర్తనలను, మన ఉగాది ‘షడ్రసాలు’ (షడ్రసాలు: అనగా ఆరు రుచులు) అయిన… మధురం = తీపి, ఆమ్లం = పులుపు, లవణం = ఉప్పు, కటువు = కారం, తిక్తం = చేదు, […]

పుస్తక సమీక్ష: అమృతవాహిని                                                      –

మణి వడ్లమాని అమృతవాహిని అవును ఆ పేరే ఒక తీయటిధారని  పానం చేస్తున్నంత  అనుభూతినిస్తుంది. రచయిత్రి సుజల గంటి రాసిన ఈ నవలకి ఆంధ్రభూమి వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. ఇప్పటి దాక వీరు వ్రాసిన నవలలు ఆరు. ఏడవది ప్రచురణకి సిద్ధంగా ఉంది. ఈమె మొట్టమొదటి నవలకే  ప్రతిష్టాత్మకమైన అనిల్ అవార్డు వచ్చింది. రాసిన ఆరు నవలలో మూడు నవలలకి బహుమతులు పొందారు  దాదాపుగా నలభయి కధలు వ్రాసారు. వాటిలో కొన్ని […]

విశ్వనాధ నవలలు – ఒక విహంగవీక్షణం: భగవంతుని మీది పగ

డా. ఇందిర గుమ్ములూరి తెలుగు సాహిత్యంలో సాహితీ ప్రక్రియలెన్ని ఉన్నా నవలకున్న స్థానం అద్వితీయం కారణం దానికున్నంతమంది పాఠకులు మరే ఇతర ప్రక్రియలకూ లేరు. నవలజాతి జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను సజీవంగా ప్రతిఫలింపజేస్తూ, సమకాలీన జీవితానికి సజీవదర్పణంగా నిలుస్తుంది. అయితే చారిత్రక నవల అంటే ఏమిటి? చరిత్ర అనేది వారసత్వమయితే, నవల అనేది కాల్పనికత అవుతోంది. చరిత్ర యధాతధ కధనం కాగా, నవల సృజన అవుతోంది. ఈ రెంటి కలయికే చారిత్రక నవల, అయితే ఈ […]