March 29, 2024

శ్రీకృష్ణదేవరాయలు – 1

రచన:- రాచవేల్పుల విజయభాస్కర రాజు దక్షిన భారత దేశాన్ని మహమ్మదీయుల దండయాత్రల నుండి రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయ నగర సామ్రాజ్య  వైభవానికి ప్రతీక ఆనాటి రాజధాని విజయనగర పట్టణం. శత్రు రాజులు సైతం ఈ మహానగరాన్ని చూసి తరించాలని ఉవ్వీళ్ళూరారు. దేశ విదేశాలకు చెందిన ఎందరో పర్యాటకులు, వ్యాపారులు విజయనగరాన్ని సందర్శించారు. ఆనాడు కళ్ళారా చూసిన విజయనగర పట్టణాన్ని, సామ్రాజ్య వైభవాన్ని, జాతర్లు, వసంతోత్సవాలు, కవితా గోష్టులు, విజ్ఞాన […]

మాయానగరం – 26

రచన: -భువనచంద్ర   “బోసు.. దయా, జాలీ, సేవా, త్యాగం, ఓర్పు ఇవన్నీ నాయకుడు కాదల్చుకున్న వాడికి స్పీడ్ బ్రేకర్లు. వీటన్నిటికీ మించిన దుర్గుణం ప్రేమ”. ఊబిలో పడ్డవాడ్ని బయటకి లాగొచ్చు. సముద్రంలో ఈతరాక పడినవాడ్ని రక్షించవచ్చు.  ప్రేమలో పడినవాడ్ని దేముడైనా రక్షించలేడు. నీకు అప్పుడే చెప్పాను.. కావల్స్తే ఆ అమ్మాయిని నయానో, భయానో లొంగదీసుకో, ‘ప్రేమ’ లో మాత్రం పడవద్దని.  అసలే ఆడది… అందునా అనాథ.. దాని ఆలోచన ఎలా వుంటుందీ? లోకాన్ని ఉద్దరిద్ధామనే ఉద్దేశ్యంలో […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 5

విశ్లేషణ:  టేకుమళ్ళ వెంకటప్పయ్య  జీవితం ఓ కలలాంటిది. అలాంటి తాత్కాలికమైన జీవితంలో జరిగేవన్నీ నిజమేననీ, శాశ్వతాలనీ భ్రమింపజేస్తాయి. అందువల్లనే మానవులు తీరని కోరికలతో ప్రతిదీ నాదీ నాదీ… అనుకుని తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. అవి తప్పటడుగులని తెలిసిన క్షణం నుంచీ జీవితాన్ని సరిదిద్దుకుని మోక్షం వేపు అడుగులు వేస్తాం. లేదంటే ఆ తీరని కోరికలతో నాదీ…నేను.. నావాళ్ళూ..అనే బంధాలలో జిక్కి జనన మరణ చక్రంలో శాశ్వతంగా పరిభ్రమిస్తూనే ఉంటామంటాడు ఈ కీర్తనలో  అన్నమయ్య. ప.తెలిసితేమోక్షము – […]

మన వాగ్గేయకారులు – 7 ( శ్రీ జయదేవుడు )

రచన: సిరి వడ్డే కొంత మంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 13 వ శతాబ్దానికి చెందిన, వ్యాసుని అవతారంగా భావించే ‘ జయదేవుడు’ ఇటువంటి వారిలో ఒకరు. ఈయన జీవితం, పూర్ణ భావంతో, భక్తీ విశ్వాసాలతో, సాధన చేస్తే, భగవంతుడే, అనేక రూపాల్లో వచ్చి రక్షిస్తాడని, తెలియజేస్తుంది. బాల్యంలోనే , ఆశుకవిత్వం చెప్పిన ఏకసంధాగ్రహి, జగన్నాధుని భక్తుడు, జయదేవుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు కనిపించడంవల్ల, బహుళ ప్రజాదరణ పొంది, […]

Gausips… ఎగిసే కెరటం – 2

రచన:-డా. శ్రీసత్య గౌతమి   (జరిగిన కధ: సింధియా తన బాస్ చటర్జీ తో కలిసి కాన్ ఫెరెన్స్ కి అమెరికాకొచ్చి కాన్ ఫెరెన్స్ లో కౌశిక్ ని చూసింది. కౌశిక్ తో తనకున్న పాత స్నేహాన్ని ఉపయోగించుకొని కౌశిక్ ద్వారా మెల్లగా ఉద్యోగం సంపాందించి అమెరికాలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. అమెరికా రావాలంటే ఉద్యోగమయినా కావాలి, లేదా అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయినైనా పెళ్ళాడాలి. సింధియా జాక్ పాట్ కొట్టింది, రెండూ తన పరమైంది. కౌశిక్ […]

శుభోదయం – 6

రచన: డి.కామేశ్వరి   శుభోదయం-7                                                                        –డి.కామేశ్వరి రాధ తరువాత వారం రోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ! మాధవ్‍ది కాకపోతే ఆ రౌడీ వెధవల బిడ్డని తను కని పెంచగలదా! … ఏం చెయ్యాలి తను, మాధవ్‍కోసం…యిదివరకయితే మాధవ్ యిలా కోరితే అరక్షణం ఆలోచించకుండా అంగీకరించేది. కాని, మాధవ్ తన నిర్లక్ష్యం, నిరాదరణతో తనలో ఏదో సున్నిత పొరను బలంగా తాకాడు.  తన మనసు కరుడు కట్టింది. ప్రేమంటే యిదేనా? వివాహబంధానికర్ధం యింతేనా? […]

మాలిక పత్రిక మార్చ్ 2015కు స్వాగతం..

మాలిక పత్రిక మార్చ్ సంచిక  మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికగా  చక్కని మహిళా అంశాలతో, కవితలతో, కధలతో, వ్యాసాలతో మరియు నవ్వించే, కవ్వించే కార్టూన్లతో, క్రొత్త క్రొత్త యాత్రామాలిక విశేషాలతో ఆద్యాత్మిక వ్యాస రచనలతో, సీరియళ్ళతో, సంగీతాల రాగ విశ్లేషణలతో  మిమ్మల్ని అలరించదానికి వచ్చింది.. . మార్చ్ సంచికలోని విశేషాలు: . 1. ఒక గంటకధ 2. అన్నమయ్య ఆత్మానందలహరి-4 3. మనోగతం 4.మారుతున్న కాలంలో 5. కలంకారీశారీ డిజైనర్ భారతి గారితో కాసేపు… 6. ప్రేమలోనే […]

ప్రపంచమనుగడకు మహిళామూర్తులే ఆలంబన  

రచన: రాచవేల్పుల విజయభాస్కర్ రాజు   నేడు అంత్జర్జాతీయ మహిళాదినోత్సవం. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ సంపూర్ణహక్కులను నిరాటంకంగా అనుభవిస్తుందో, ఎక్కడ స్వేచ్చగా నడయాడుతుందో, అక్కడి ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా వర్థిల్లుతుంది. ఆ దేశ ఔన్నత్యం పతాకస్థాయిలో నిలబడుతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఎన్నోవిప్లవపోరాటాల అనంతరం అలాంటి రోజును అన్ని దేశాలు చవి చూడాలని, ఆ దేశ గౌరవాన్ని అన్నిచోట్లా ప్రతిబింబించాలన్న సత్సంకల్పంతో ప్రతి ఏడాది మార్చినెల 8వ తేదీన అంతర్జాతీయమహిళాదినోత్సవంగా జరుపుకుంటున్నాయి. ఆడది అబల కాదు […]