March 29, 2024

Gausips – Dead ppl don’t speak-10

రచన: డా. శ్రీసత్య గౌతమి ఏరన్ వెంటనే డోర్ తీసి బయటకు వచ్చి, “ఏం జరిగింది అనైటా? ఎందుకా కేకలు? లోపల ఏం జరిగింది” అని ఏరన్ అడిగాడు. అనైటా వణికిపోతూ.. “ఏరన్, ఒకసారి లోపలికి వెళ్దాం రా” అంది. పరిగెత్తుకుని వెళ్ళారు. ఆమె ఇంట్లోవున్న పనమ్మాయి నేల మీద పడి వుంది. క్రిస్టల్ తో చేసిన అందమైన పెద్ద టేబుల్ డెకరేషను టేబుల్ మీద నుండి నేలమీద పడి ముక్కలయిపోయి వుంది. అనైటా కాలింగ్ బెల్ […]

సహజీవనం

రచన: వై.ఎస్.ఆర్. లక్ష్మి “ఏమాలోచించారు “అని అడిగాడు రామారావు గుడిలో తనను కలసిన జానకిని. ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేదు. అసలు విషయం ఏమిటంటే రామారావుకి భార్య చనిపోయి సంవత్సరం గడిచింది. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్కడకు వెళ్ళి ఉండలేక ఇక్కడే ఉంటూ ఒకరోజు చెయ్యి కాల్చుకుంటూ వీలు కానిరోజు కర్రీ పాయింట్ కూరలతో కాలక్షేపం చేస్తున్నాడు. పనమ్మాయి వచ్చి పని చేసి వెళుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒక రోజు […]

ఆరాధన

రచన: వెంకట సుశీల మోహన్, సరితలు కలిసి ఎం.ఎస్.సి చేశారు ఆంధ్రా యూనివర్సిటీ లో. వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఇష్టపడ్డారు. చదువులయ్యి ఉద్యోగాలు వచ్చేక ఇళ్ళల్లో చెప్పి, ఒప్పించి పెళ్ళి చేసుకుందామనుకున్నారు. సరిత మామూలుగా మోహన్ ఇంటికి వస్తూ వుంటుంది, వాళ్ళ అమ్మ (వందనమ్మ) ను ఆంటీ, ఆంటీ అని పిలుస్తుండేది. ఇక్కడ మోహన్ కుటుంబ పరిస్థితి చెప్పాలి. వందనమ్మకి ముగ్గురు పిల్లలు. పెద్దవాడు ఇంజినీరు, తర్వాత అమ్మాయి మధు. మధుకి తమ్ముడు ఈ మోహన్. వందనమ్మకి పిల్లల […]

సరస్వత్యష్టోత్తరశతనామావళిలో ఛందస్సులు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు దసరా సమయములో సరస్వతీదేవి అష్టోత్తరశతనామావళిని చదువుతున్నప్పుడు అందులోని కొన్ని పేరులు ఛందశ్శాస్త్రములోని వృత్తముల పేరులను జ్ఞప్తికి తెచ్చాయి. జాగ్రత్తగా పరిశీలించిన పిదప నాకు లభించిన నామములతో ఉండే వృత్తములను క్రింద లక్షణ లక్ష్యములతో అందిస్తున్నాను. పాఠకులు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. యతి స్థానము ఒక అడ్డగీతతో (-) చూపబడినది. సరస్వతీ అష్టోత్తరశతనామావళి – http://joyfulslokas.blogspot.com/2010/08/saraswati-ashtotara-stotram.html పాటగా – https://www.youtube.com/watch?v=pAVsqGsvqgA సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా … సావిత్రీ – మ/లగ UUUIU […]

“రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం

రచన: ఏల్చూరి మురళీధరరావు 1973 హేమంతంలో అనుకొంటాను. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను. ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిగారి ఇల్లంటే సాహిత్యికులందరికీ సాహిత్య సంగీత హృదయంగమ సంగమతీర్థరాజం. గోష్ఠీవినోదంకరణలతో అభ్యాగతులకు అయాచితంగా అనిమేషత్వం సిద్ధిస్తుండేది. మేడ మెట్లెక్కి నేను కాలింగ్ బెల్ నొక్కేసరికి – భగవంతుడే మందిరద్వారాలు తీసినట్లు కృష్ణశాస్త్రిగారే తలుపుతీసి, ఆప్యాయనంగా పలకరించి, లోపలి గదికి తీసుకొనివెళ్ళారు. అప్పటికే అక్కడ పిలకా గణపతిశాస్త్రి గారున్నారు. నిండైన ప్రేమతో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆంధ్రదేశం భావకవిత్వపు ఇంద్రజాలంలో […]

మన వాగ్గేయకారులు – (భాగము – 6)

రచన: సిరి వడ్డే మహాకవి క్షేత్రయ్య (క్షేత్రజ్ఞుడు) : సముద్రతీరాంధ్ర ప్రాంతాల్లో వెలసిన వాగ్గేయ కారులు, పదకర్తలు, తెలుగులో మహనీయులెందరో ఉన్నారు. వారి సేవ అనంతమైంది. శిష్ట సాహిత్యమైన పద్య కవితకంటే, శిష్టేతర సాహిత్య మైన ఈ పదసాహిత్యం వల్లనే ప్రజల్లో- అంటే అక్షర జ్ఞానంలేని వారికెందరికో ముక్తికి సోపానమైన భక్తితో పాటు నీతి, వైరాగ్య, వేదాంత ధోరణులు వివరించబడ్డాయి. భక్తి భావన భారతీయ తత్త్వం. భక్తితో పాటు పదకవిత ప్రారంభమైంది. జనపదాలలోని పామర ప్రజానీకం తమకు […]

మధ్యమావతి రాగం

రచన: విశాలి పెరి ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని మరియు శ్రీరంజని. మధ్యమావతి రాగము : అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా – త్యాగరాజు కీర్తన రామా నను బ్రోవగరాదా – రామదాసు కీర్తన. నిను పోనిచ్చెదనా సీతారామ – రామదాసు కీర్తన. పాహి రామ […]

క్షణక్షణం నిరంతరం సమరం

రచన: మాలతి దేచిరాజు నిశ్శబ్దిస్తున్న బంధాలు….. జారిపోతున్న అనుబంధాలు… కదులుతున్న కాలంతో కరిగిపోయే స్నేహాలు ఈ జీవన పయనంలో నీకు నువ్వే తోడు కరగనీకు నీ ధైర్యం…వదులుకోకు అస్థిత్వం రుధిర ధార అన్వేషణలో పసికందుల ఆక్రందనలతో కరుడుకట్టిన పాషాణపు రహదారులలో అడుగడుగున ఎదరయ్యే కంటకాలు సమస్యల సందిగ్ధాలు, ఆరాటాల పోరాటాలు కలగలిపిన అంతులేని అగాధాలు భగ భగల సెగల పొగలు అలుపెరగని ఆటంకాలు గతులు మారినా చరితలు మారని తలరాతకి చరమ గీతం పాడేసేయి…. కనులు తెరవని […]

దింపుడుగల్లం

రచన:-రామా చంద్రమౌళి ఎదురుచూపులన్నీ ఆఖరి చూపులుగా మారుతున్న వేళ మనిషి సమూహంలోనుండి ఒంటరిగా పరివర్తిస్తూ ఒక దుఃఖసముద్రం మధ్య దింపుడుగల్లం..భస్మపీఠానికి తొలిమెట్టు స్మశానం..ఒక నిత్యానందలోకం..ఒక నిసర్గ స్వర్గం అందరి మనసులనిండా స్తబ్ధసాగరం ఆ క్షణం..నిజానికి ఆమె మృతురాలు కాదు విముక్త ఆత్మ పక్షి విడిచిన పంజరం మనిషి శరీరం ఒక మజిలీ..ఇప్పుడు విడిచిపెట్టిన ఇల్లు ఆ దింపుడుగల్లం వేదిక..అంటే చివరి ఆశ జీవశేషంకోసం వెదుకులాట అప్పటిదాకా మనిషిని మోస్తూ వచ్చినవాళ్ళు బాధ్యతను భుజాలు భుజాలుగా మార్చుకుని అనివార్యమై […]