April 20, 2024

సరస్వత్యష్టోత్తరశతనామావళిలో ఛందస్సులు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు దసరా సమయములో సరస్వతీదేవి అష్టోత్తరశతనామావళిని చదువుతున్నప్పుడు అందులోని కొన్ని పేరులు ఛందశ్శాస్త్రములోని వృత్తముల పేరులను జ్ఞప్తికి తెచ్చాయి. జాగ్రత్తగా పరిశీలించిన పిదప నాకు లభించిన నామములతో ఉండే వృత్తములను క్రింద లక్షణ లక్ష్యములతో అందిస్తున్నాను. పాఠకులు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. యతి స్థానము ఒక అడ్డగీతతో (-) చూపబడినది. సరస్వతీ అష్టోత్తరశతనామావళి – http://joyfulslokas.blogspot.com/2010/08/saraswati-ashtotara-stotram.html పాటగా – https://www.youtube.com/watch?v=pAVsqGsvqgA సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా … సావిత్రీ – మ/లగ UUUIU […]

“రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం

రచన: ఏల్చూరి మురళీధరరావు 1973 హేమంతంలో అనుకొంటాను. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను. ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిగారి ఇల్లంటే సాహిత్యికులందరికీ సాహిత్య సంగీత హృదయంగమ సంగమతీర్థరాజం. గోష్ఠీవినోదంకరణలతో అభ్యాగతులకు అయాచితంగా అనిమేషత్వం సిద్ధిస్తుండేది. మేడ మెట్లెక్కి నేను కాలింగ్ బెల్ నొక్కేసరికి – భగవంతుడే మందిరద్వారాలు తీసినట్లు కృష్ణశాస్త్రిగారే తలుపుతీసి, ఆప్యాయనంగా పలకరించి, లోపలి గదికి తీసుకొనివెళ్ళారు. అప్పటికే అక్కడ పిలకా గణపతిశాస్త్రి గారున్నారు. నిండైన ప్రేమతో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆంధ్రదేశం భావకవిత్వపు ఇంద్రజాలంలో […]

మన వాగ్గేయకారులు – (భాగము – 6)

రచన: సిరి వడ్డే మహాకవి క్షేత్రయ్య (క్షేత్రజ్ఞుడు) : సముద్రతీరాంధ్ర ప్రాంతాల్లో వెలసిన వాగ్గేయ కారులు, పదకర్తలు, తెలుగులో మహనీయులెందరో ఉన్నారు. వారి సేవ అనంతమైంది. శిష్ట సాహిత్యమైన పద్య కవితకంటే, శిష్టేతర సాహిత్య మైన ఈ పదసాహిత్యం వల్లనే ప్రజల్లో- అంటే అక్షర జ్ఞానంలేని వారికెందరికో ముక్తికి సోపానమైన భక్తితో పాటు నీతి, వైరాగ్య, వేదాంత ధోరణులు వివరించబడ్డాయి. భక్తి భావన భారతీయ తత్త్వం. భక్తితో పాటు పదకవిత ప్రారంభమైంది. జనపదాలలోని పామర ప్రజానీకం తమకు […]

మధ్యమావతి రాగం

రచన: విశాలి పెరి ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని మరియు శ్రీరంజని. మధ్యమావతి రాగము : అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా – త్యాగరాజు కీర్తన రామా నను బ్రోవగరాదా – రామదాసు కీర్తన. నిను పోనిచ్చెదనా సీతారామ – రామదాసు కీర్తన. పాహి రామ […]

క్షణక్షణం నిరంతరం సమరం

రచన: మాలతి దేచిరాజు నిశ్శబ్దిస్తున్న బంధాలు….. జారిపోతున్న అనుబంధాలు… కదులుతున్న కాలంతో కరిగిపోయే స్నేహాలు ఈ జీవన పయనంలో నీకు నువ్వే తోడు కరగనీకు నీ ధైర్యం…వదులుకోకు అస్థిత్వం రుధిర ధార అన్వేషణలో పసికందుల ఆక్రందనలతో కరుడుకట్టిన పాషాణపు రహదారులలో అడుగడుగున ఎదరయ్యే కంటకాలు సమస్యల సందిగ్ధాలు, ఆరాటాల పోరాటాలు కలగలిపిన అంతులేని అగాధాలు భగ భగల సెగల పొగలు అలుపెరగని ఆటంకాలు గతులు మారినా చరితలు మారని తలరాతకి చరమ గీతం పాడేసేయి…. కనులు తెరవని […]

దింపుడుగల్లం

రచన:-రామా చంద్రమౌళి ఎదురుచూపులన్నీ ఆఖరి చూపులుగా మారుతున్న వేళ మనిషి సమూహంలోనుండి ఒంటరిగా పరివర్తిస్తూ ఒక దుఃఖసముద్రం మధ్య దింపుడుగల్లం..భస్మపీఠానికి తొలిమెట్టు స్మశానం..ఒక నిత్యానందలోకం..ఒక నిసర్గ స్వర్గం అందరి మనసులనిండా స్తబ్ధసాగరం ఆ క్షణం..నిజానికి ఆమె మృతురాలు కాదు విముక్త ఆత్మ పక్షి విడిచిన పంజరం మనిషి శరీరం ఒక మజిలీ..ఇప్పుడు విడిచిపెట్టిన ఇల్లు ఆ దింపుడుగల్లం వేదిక..అంటే చివరి ఆశ జీవశేషంకోసం వెదుకులాట అప్పటిదాకా మనిషిని మోస్తూ వచ్చినవాళ్ళు బాధ్యతను భుజాలు భుజాలుగా మార్చుకుని అనివార్యమై […]

నువ్వూ-నేనూ

రచన: శ్రీసత్యగౌతమి సూరీడుతో దిశను మార్చుకుంటుంది పొద్దుతిరుగుడు చంద్రుడు రాలేదని చిన్నబుచ్చుకుంటుంది కలువ రేకు పగలే వెన్నెల హృదయం ఊయలై పులకరించు తామరలు రాత్రి వెన్నెల్లన్నీ పట్టి నింపుకొని సువాసించు సిరి మల్లెలు హరివిల్లు కుంచెలతో రంగులద్దుకొను కనకాంబరాలు తెల్లటి మేఘాల గాలి సోకి తళుక్కుమను నందివర్ధనాలు సంజె కెంజాయిల్లో నిక్కబొడుపులు రామబాణాలు నీలాకాశం అంచున వ్రేలాడే జరీదారాలు నీలికలువలు అయితే ఏం… గగనసీమన సూర్యచంద్ర గమనాలు కాస్త సన్నగిల్లితే చాలు ఉసూరుమని సొమ్మసిల్లు ఏ గమనాలకూ […]

ఒకోసారి యింతే…!!

రచన: -డా. విజయబాబు, కోగంటి ఒకోసారి యింతే! నీతో ప్రతి మాటలో ఒక మెలకువ ఒకో సారి వెలుగులోకీ ఒకో సారి దుఃఖానికీ. మాటకు అటు నీవూ ఇటు నేనూ అయినపుడు మౌనమే పదాలుగా వెలుగుకో దుఃఖానికో వంతెన కడుతుంది. ఒకోసారి యింతే యే అలా కదలని సరస్సులా మనస్సు నిశ్చలంగా, స్తబ్ధంగా! ప్రతిఫలించి వెన్నెలపరిచే ఆకసానికీ అర్ధం కాకుండా, యిలా…

నిద్ర

రచన: అనురాధ( సుజల గ౦టి) ఆ రోజు వనితా మ౦డలిలో వరలక్ష్మీవ్రత౦ అని బయలుదేరి౦ది ప్రియ.దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గారు ప్రతీ పట్టణ౦ లో ఆ౦ధ్ర వనితామ౦డలి స్థాపి౦చారు.అలాగే ఢిల్లీలో కూడా ఉ౦ది.ఉత్తర భారత దేశ౦లో ఉన్నా మన స౦స్కృతి,సా౦ప్రదాయాల్ని మర్చిపోకు౦డా అన్ని ప౦డుగలూ అ౦దరూ కలిసి చేస్తారు వనితా మ౦డలి సభ్యులు. సామూహిక౦గా సభ్యురా౦డ్ర౦దరూ కన్నులప౦డువగా వరలక్ష్మీపూజ,కృష్ణాష్టమి కలిపి పురోహితుడ్ని పిలిచి శాస్త్రోక్త౦గా జరుపుకు౦టారు.వనితల౦దరూ శ్రమకోర్చి ఎ౦తో దూరాలని౦చి ఈ ఫ౦క్షన్ జరపడానికి పొద్దున్నే పదిగ౦టలకల్లా […]