April 25, 2024

చేరేదెటకో తెలిసీ..

రచన: స్వాతీ శ్రీపాద శృతి గదిలోకి వచ్చాడు శ్రీకాంత్ శర్మ. కళ్ళు తెరచి గోడను చూస్తూ ఉంది శృతి . అతను రాగానే లేచి నిల్చుంది నర్స్. “నేను ఇక్కడ కాస్సేపు౦టాను, ఓ రెండు మూడు గంటలు. ఏదైనా పని చూసుకునేది ఉంటే వెళ్లిరా “ అన్నాడు. “థాంక్స్ “ చెప్పి వెళ్ళింది నర్స్. “శృతి “ నెమ్మదిగా ఉచ్చారి౦చాయి అతని పెదవులు. ఉహు! విన్నట్టే అనిపించలేదు. కొంచం స్వరం పెంచి పిలిచి చూసాడు. లాభం లేకపోయింది. […]

మాయానగరం – 16

రచన: భువనచంద్ర రాజు “ఆనంద్ గారు… యీ మనుషుల్ని చూస్తుంటే ఓ పక్క జాలి మరో పక్క బాధ కలుగుతోంది. కల్తీ కల్లుతో చచ్చిపోయారని తెలిసినా, అంత్యక్రియలు చేయించినందుకు ఆ కల్లు దుకాణం ఓనర్ని దేవుడంటున్నారు. ఓ పక్క ఉన్నవాడు అంతస్థుల మీద అంతస్థులు కడుతుంటే, మరో పక్క లేనివాడు తిండికీ గుడ్డకి మొహం వాచిపోతున్నాదు. రిజర్వేషన్లు అంటున్నారు, నిజమైన అర్హత కలవాడికి ఆ రిజర్వేషన్లు దక్కుతాయా? ‘సుపరిపాలన ‘ అంటున్నారు, లంచం లేకుండా ఒక పనైనా […]

Gausips: Dead people don’t speak-6

రచన: డా. శ్రీసత్య గౌతమి టైం అయ్యింది. ఏరన్ ఇక మెల్లగా కారు స్టార్ట్ చేశాడు. తాను ప్లాన్ చేసుకున్నట్లుగానే వెళ్ళి రేడియో స్టేషన్ పక్కన షాపులో కూర్చున్నాడు గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా సమాధి చుట్టూ జరిగే విషయాల్ని ట్రేస్ చెయ్యడానికి. సరే… టైం రాత్రి 11.30 అయ్యింది. హటాత్తుగా తన నెత్తి మీద ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా వినబడింది. ఉలిక్కి పడ్డాడు, చుట్టూ చూశాడు.. ఎవరూ లేరు. మళ్ళీ శ్మశానంలో సమాధిని పరిశీలించడంలో మునిగిపోయాడు. సమాధి […]

వెటకారియా రొంబ కామెడియా 11

రచన: మధు అద్దంకి అషాడం: “వదినా ఏమి చేస్తున్నావ్ ” అంటూ లోపలికొచ్చిది శాంతమ్మ ఆ ఏమి లేదు ” ఏబ్రాసి మొగుడు ఏడుపుగొట్టు పెళ్ళాం” సీరియల్ వస్తుంటే చూస్తున్నా అన్నది కాంతమ్మ “రిపీట్ ప్రోగ్రాం చూస్తున్నావా? ఇది నేను నిన్న రాత్రే చూసేశాలే” అన్నది శాంతమ్మ. మళ్ళా తనే ” ఇది విన్నావా కమలమ్మ కోడలు పుట్టింటికి వెళ్ళిందిట” అన్నది “ఆషాఢ మాసం కదూ వెళ్ళుంటుందిలే” అన్నది కాంతమ్మ.. “పెళ్ళయ్యి రెండేళ్ళవుతుంటే ఇంకా అషాఢం, మూఢం […]

పప్పణ్ణం ఎప్పుడు?

రచన: వేటూరి సుందరరామమూర్తి “తిండికి మొహం వాచినట్లు- కరువొచ్చి చస్తున్నట్లు- పాడుగోలా వీళ్ళూనూ- ఇంతింత కళ్ళు వీళ్ళూనూ…” విసుక్కుంటూ, నసుక్కుంటూ విసురుగా లోపలకొచ్చింది తాయారమ్మ. శనగలు కట్టిన రుమాలు సోఫాలో పారేసి- తానూ కూలబడింది. భాగవతం చదువుకుంటున్న విశ్వనాధంగారు తలయెత్తి చూసి- పూతనకు అపరావతారంలా ఉగ్రురాలై ఉన్న తాయారమ్మతో ” ఏవిటే- మళ్ళీ ఏం ఒచ్చిందీ? ” అన్నాడు గుండె బలహీనత మాటల్లో మలచి, ఓపికంతా చూపుల్లో పొదివీ. రయ్యనందుకుంది తాయరమ్మ- రుంజుకుంటూ. ‘ఆహ నాకు తెలియకడుగుతాకాని […]

పిత్రోత్సాహం

రచన: వసంతలక్ష్మి అయ్యగారి మూడుదినాలు ఒకే దినాన జరుపుకోవడం ఎక్కడైనా విన్నారా.యివాళ వింటున్నాం. పైగా నాలుగోదికూడా లెక్కలోకి తీసుకుంటే.. యివాళ పొడవైన రోజట, , , పగటివేళ ఎక్కువనిలెండి.! జూన్ 21 ప్రపంచ సంగీత దినమనీ, జూన్ మూడో ఆదివారం ప్రపంచ పితరుల దినమనీ తెలుసు.ఇ.క.మూడోది ముచ్చటకానేకాని YOGA డే అట. యోగా ను బాగా దూరంపెడతానని నాకు ఈ మూడో దినం గురించి తెలియలేదులే.అయిన తొలి యోగా డే ట లెండి.! ఆఁ అయినా తెలిసి […]

“అమ్మ, నాన్న- ఓ గారాల కూతురు.”

రచన:మంథా భానుమతి “ఎందుకంత భయం?” శాస్త్రన్నయ్యని అడిగాను… అప్పుడు నాకు ఐదేళ్ళుంటాయేమో! ఐదేళ్ళ పిల్ల ఏం రాయగలదు అనుకోకండి.. ఇది రాస్తున్నప్పటికి నాకు బోలెడు ఏళ్ళొచ్చాయి. రింగు రింగులుగా వెనక్కెళ్ళి.. చిన్నప్పటి రోజుల్నుంచీ మొదలు పెట్టి నా కథ చెప్తున్నా! నేనే ఆ గారాల కూతుర్ని. అమ్మకి నలభై, నాన్నగారికి నలభై రెండేళ్ళు దాటాక పుట్టాను. ఇంట్లో అమ్మా, నాన్న, నేను, శాస్త్రన్నయ్య ఉంటాం. వాడి పైన ముగ్గురన్నలూ వేరే ఊర్లలో ఉంటారు. అందరి కంటే పెద్దైన […]

Me and My Dad

రచన: Harini Madhira A super forward thinking person he believed in giving his partner, his kid’s complete freedom of thought. An era when people wanted a boy he prayed for a girl child. Engineering and MBBS were the only two professions seen as worth studying you gave us the freedom to follow our dreams. Basic […]

ఎంత మంచి వారో మా నాన్నగారు

రచన: నాగలక్ష్మి కర్రా ఆడపిల్ల కావాలి , ఆడపిల్ల కావాలి అని తపించిపోయే మా నాన్నగారికి నలుగురు మొగపిల్లల తరువాత పుట్టిన దాన్నని ఎంతో ముద్దు . కాబట్టి సహజంగా ఎంతో గారాబం చేసేవారు నాన్నగారు . అలాగే అన్నయ్యలు కూడా . నాకు జ్ఞానం వచ్చిన దగ్గరనుంచి నాన్నగారితో పాటే భోజనం, నాన్నగారి పక్కనే కూర్చోవడం . పక్క గదిలోకి వెళ్లినా పాపేది ? పాపేది ? అని వెతికేవారు . నాన్నగారు తొమ్మిదింటికి భోజనం […]

అంతా నాన్నపోలికే!

రచన–ఆదూరి.హైమావతి . “ఇది అచ్చం వాళ్ళ నాన్నపోలికే!” “ఔను అన్నీ వాళ్ళ నాన్నపోలికలే!” “ఆ పట్టుదల, ఆ మొండితనం, ఆ ధైర్యం అన్నీ వాళ్ళనాన్నవే పుణికి పుచ్చుకుంది” “దీనికి తెగింపూ ఎక్కువే” “అచ్చం మగవాడికున్నంత తెగువ!” “ఈమె ముందు మగవారూ తీసికట్టేనండీ! వాళ్ళనాన్న దేనికీ వెనుకాడేవాడు కాడు.” “యుధ్ధం నుంచీ వచ్చాక ఆ యోగాసెంటర్ పెట్టి ఎంత బాగా శ్రమించి, పేరుకు పేరూ, సేవకు సేవా, సంపాదనా అదీనీ ధర్మబధ్ధంగా ఎలా గడించాడో! తన శక్తిమీదా, తెలివిమీదా […]