April 24, 2024

పితృదినోత్సవం

రచన: కట్టమూరి కిషోర్ కుమార్ ఇంటర్నెట్ అనే ఒక సాధనాన్ని కనుగొనబడడం దరిమిలా సోషల్ నెట్వర్క్ మీడియాల ప్రభంజనం వల్ల గత అయిదు ఏళ్లలో ఎన్నో గొప్ప విషయాలు జన బాహుళ్యానికి తెలిశాయి, అవే కాక ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుంటూ ఒక రోజును జరుపుకోవడం లేదా గుర్తు చేసుకోవడం లాంటి చక్కని సంస్కృతి కూడా ప్రభలంగా విస్తరించింది, అలాగే జూన్ 21 న అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకోవడం కూడా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం […]

అప్పగా పిలవబడే నాన్న

రచన: లక్ష్మీ రాఘవ తండ్రిని అప్పగా పిలవబడే రాయలసీమ వాడు, నాకు తెలిసీ ఎప్పుడూ ప్యాంటు వెయ్యని వాడు, తెల్లటి ఖద్దరు పంచె కుర్తా ధరించిన వాడు, నల్లని వాడైనా అందగాడు, అవినీతి మాట కూడా తెలియని రాజకీయ నాయకుడు, ప్రజలలో పాపులర్ అయినవాడు, రాజకీయంలో అపర చాణుక్యుడుగా పేరు గాంచిన వాడు, ఎత్తుకు పై ఎత్తుగా పావులు కదిపినవాడు, ఎందరికో ఆదర్శమైన వాడు, అందరికీ నావాడు! తొమ్మిదిమంది పిల్లలకు తండ్రి అయినవాడు, కానీ, ఇంట్లో మాత్రం […]

పద్యమాలిక – జూన్ 15 2015

భళ్లమూడి శ్రీరామ శంకరప్రసాద్ కం . 1 గోగో సారూ , డూ డూ యోగా డైలి , కరిగించు ఓవర్ వెయిటూ ! సాగిన నడుమును చూస్తే బేగమ్ నచ్చును భళి భళి భేషూ అంటూ ! తే.గీ . 2 పిడికె డంతటి నడుమున్న పిల్ల ప్రక్క బండ వాడని యొకడిని ఎండ గట్టి నడుము వంచ మనుట మీకు న్యాయ మౌన ? తప్పు మాటలు వ్రాయుట తప్పు కాద ? ఆ.వె. […]

పద్యమాలిక జూన్ 1 2015

నాగజ్యోతి సుసర్ల 1 .అరుణుడు ,అందమున వెలుగు తరుణిని వదలక తిరుగుతు- తాపము జెందెన్! యిరువిధముల వేడిపెరుగ నరరే చెమటల యువకుని – నరయరె జనులూ!! 2.కం: చెఱువుకు బోయిన చిన్నది బరువెక్కిన కడవతోడ -బాధగ నడచెన్ తరుణికి భారము దించగ కరుణను కార్మొయిలుదాగె-కాసిని నీళ్ళన్!! 3. కం: భారీ పరిశ్రమలచట జారవిడుచు కలుషజలము-జనములు బట్టన్ సూరీడు చూడనొప్పక నేరుగ స్ట్రాతో ఘటమున- నీటిని బీల్చెన్!! గోలిశాస్త్రి గ్రక్కున మేఘుడు ద్రాగెను మిక్కుటముగ తాళలేక మీదటి వేడిన్ […]

మన వాగ్గేయకారులు – (భాగము -1)

రచన: సిరి వడ్డే “సంగీతం” పాడటమే ఒక కళ అంటే, పాటలను వ్రాసి, వాటికి స్వరాలను కూర్చటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నేడు పాటలు వ్రాసే కవులు, ఆ పాటలకు బాణీలు అంటే స్వరాలని కూర్చే సంగీత విద్వాంసులు వేరు, వేరుగా ఉన్నారు. కానీ సంగీతం ప్రాణం పోసుకున్ననాటి నుండి ఈ రెండు ప్రక్రియలను చేయగలిగిన వారే “సంగీతకారులు”గా ప్రసిద్ధికెక్కారు. ఇలా సంగీతం, కవిత్వం రెండింటిపై పట్టుగలిగి, ఆశువుగా గానం చేసే కళాకారులని “వాగ్గేయకారులు” అంటారు. జయదేవుడు, […]

నిషాదుల మధ్య ఒక బ్రాహ్మణుడు. (మొదటి భాగం)

రచన: తాడిగడప శ్యామలరావు. అది ఒక అడవి. అడవి అనగానే మనకు చప్పున గుర్తుకు వచ్చే సంగతులు కొన్ని ఉన్నాయి. అడవి నిండా రకరకాల వృక్షాలు పొదలు లతలు విస్తారంగా ఉంటాయన్నది గుర్తుకు వస్తుంది. అడవిలో బోలెడు మృగపక్షిసంతతి ఉంటుందన్నది గుర్తుకు వస్తుంది. వాటిలో పులులవంటి క్రూరమృగాలూ లేళ్ళ సాధుమృగాలూ ఉంటాయని గుర్తుకు వస్తుంది. పురాణాల వాసన కాస్త తగిలి ఉన్న మనస్సులకి అడవుల్లో మునులనే వాళ్ళు ఉంటారని గుర్తుకు వస్తుంది. నాగరికజీవనులకు కొంచెం ఆలస్యంగానూ, పర్వతారణ్యప్రాంతాలతో […]

రామాయణం- ఒక్క వాల్మీకి విరచితమేనా?

రచన: కర్లపాలెం హనుమంతరావు ‘యావత్ స్థాస్యంతి గిరయః- సరిత శ్చ మహీతలే/తావద్ రామాయణ కథా- లోకేషు ప్రచరిష్యతి (బాల కాండ 2.36)’. మహీతలంపై ఎంత వరకు గిరులు, సరులు ఉంటాయో అంత వరకు లోకాల్లో రామాయణగాథ ప్రచారం జరుగుతుంద’ని బ్రహ్మ వాల్మీకి రామాయణాన్ని ఆశీర్వదిస్తూ అన్న మాట. రామాయణమంత గాఢంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కావ్యం మరొకటి లేదు. ఎన్నో భాషల్లో, కళాప్రక్రియల్లో తీర్చిదిద్దిన ఆదికావ్యం రామాయణం. పండితులను.. పామరులను, ఆస్తికులను.. నాస్తికులను ఒకే తీరులో ఆకర్షించే […]

రమణ స్థితి

రచన: వారణాసి రామబ్రహ్మం మనసు విరమింపబడిన సమయమున జీవుడు “మరణించి” భగవంతుడై రమించు; శాంతము మౌనము ఆనందము విలసిల్లు, తొలగి ఉండును అహంకార మమకారములు ఆత్మదశ అది‌; పారలౌకిక అనుభవమది తత్త్వసారము నిర్మల మానసమై వెలుగొందు విశాల సుఖవిస్తార వేళ; పరమము; ప్రకృతికి పరము; ప్రజ్ఞాన ఘనము జ్ఞానమయము బ్రహ్మమందు మది తాను లీనమైన స్థితి సత్ భావ స్థితి చిత్ రూప గతి; అస్తి భాతి ప్రియము; సతత సుఖానుభూతి రసరతి మనిషి పరమాత్మయై వెలుగు […]

శరణాగతి

రచన: డా. బల్లురి. ఉమాదేవి. శ్రీమద్రామాయణము భారతీయులకు పారాయణా గ్రంథము. దీనిని దీర్ఘశరణాగతి అనికూడా కొందరంటారు. “శరణాగతి” అంటే నీవే మాకు దిక్కు. వేరే గతి లేదు రక్షించినా శిక్షించినా నీవే అంటూ సర్వాత్మనా తనను తాను భగవంతునికి సమర్పించుకోవడమే శరణాగతి. భగవదనుగ్రహం లేకపోతే మోక్షం లభించదు. ఎంత బలమున్నా స్వశక్తితో సాధ్యం కానిదిది. ఏ జీవికైనా మోక్షణ గాని రక్షణ గాని కల్పించేది సర్వాంతర్యామియైన శ్రీమహావిష్ణువొక్కడే. మోక్ష సాధన కొరకు సాధారణ జీవులకు వుపయుక్తమైనది శరణాగతియే. […]