April 25, 2024

అక్షర సాక్ష్యం

రచన: రంగనాథ్ మానవత: నీవు పెద్ద పెద్ద చదువులు చదివావు… నీ జ్ఞానానికి నిన్నభినందిస్తాను…. నీవు గొప్ప గొప్ప పదవులు సాధించావు…. నీ సాధనని గౌరవిస్తాను… నీవు కోటానుకోట్లు సంపాదించావు…. నీ సమర్ధతను మెచ్చుకుంటాను… నీలోని మానవతను పెంచుకుంటే…. నీకు నేను సాష్టాంగపడతాను!! అతి: విడుదలైన రోజునే సినిమా చూడాలని హీరో అభిమానుల తొక్కిసలాట!! కదం తొక్కే లాఠీలు– చితికిపోయే చిన్నారులు! ఆ పుణ్యదినమే దర్శించుకోవాలని దైవభక్తుల తొక్కిసలాట! చెలరేగే లాఠీలు– చిత్తయ్యే చిన్నాపెద్దా! అభిమానుల విషయంలో […]

ఆ దేహం నాదే

రచన: గవిడి శ్రీనివాస్ మల్లెపూలు పెట్టుకుని వెన్నెల చీర చుట్టుకుని నా హృదయ ద్వారం ముందు నిలబడ్డ సిగ్గుతో నేసిన ఓ ముగ్గు బుట్టా ఎన్ని రంగుల ముగ్గులా వుందో ! కాటుక చెక్కిన కళ్ళ అందాలతో జారే జలపాతంలాంటి ఊయలలూగే నడుంతో ముట్టుకుంటే తేనే స్వరాలు వొలికే వేళ్ళతో కురులతో అలా పిలుస్తున్నట్టుగా సమ్మోహనంగా కవ్విస్తున్నట్టుగా లోలోన మనసు పరదాల వెనుక ఆశలు కొద్ది కొద్దిగా చిగిరిస్తున్నట్టుగా ఆమె దేహం గాలి తరంగాల్లో సందేశాల సవ్వడి […]

ఫాదర్స్ డే స్పెషల్ సంచిక జూన్ 2015 కి స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head తరచుగా కొత్త కొత్త ప్రయోగాలతో మిమ్మల్ని అలరిస్తోన్న మాలిక  పత్రిక ఈరోజు పితృదినోత్సవం – ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక సంచికను విడుదల చేస్తోంది. అనుకోకుండా తలపించిన ఈ ఆలోచన ప్రత్యేక సంచికకు పునాది వేసింది. అనుకున్నదే తడవు  రచయితలనుండి అనూహ్యమైన స్పందన వచ్చింది … వ్యాసాలు, కవితలు కూడా వెల్లువెత్తాయి. మాలిక టీమ్ నుండి అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.. నాన్నగురించిన అభిప్రాయాలు మీకోసం.. మీ రచనలను పంపవలసిన […]

నాన్నా…!! నీకు జ్వరమొస్తే..

రచన: హైమారెడ్డి “నాన్నా…!” ఓ బక్కపలుచని పదేళ్ళ పిల్ల మనసు పలవరిస్తున్న ఆ పిలుపు ఆమెకు తప్ప ఎవ్వరికీ వినిపించడం లేదు. అమ్మ సాయంత్రం మేనత్తతో అన్న మాటలే ఆ పిల్లదాని మనసును తొలుస్తున్నాయి. “మీ తమ్ముడు టైంకి నిద్రపోవడం లేదు ఒదినా..! ఎప్పుడు చూసినా పని.. పని.. పని..! ఇలా అయితే ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా పట్టించుకోరు” అమ్మనోటి నుండి వచ్చిన అవే మాటలు మళ్లీ మళ్ళీ చెవిలో నుండి లోలోపలికి దిగుతూ గుండెకు కన్నీళ్లు […]

నాన్నగారు!!! నా డైరీ లో ఒక పేజీ….

రచన: క్రిష్ణ వేణి, ఢిల్లీ. “నాన్నగారు”- ఈ రోజే అని కాదు, ఆయన నాకు గుర్తు రానిదెప్పుడు! ఆడపిల్లలకి సహజంగానే తల్లికన్నా తండి వద్దే చేరిక ఎక్కువ. నేనూ మినహాయింపేమీ కాదు. నాన్నగారు ఫిసిక్స్ రంగంలో ఉండేవారు. ఆయన ప్రభావం ఇప్పటికీ నామీద చాలా ఉంది. ఆయననుండి అంది పుచ్చుకున్న నా రంగుతో సహా, ఆయననుంచి పుణికి పుచ్చుకున్న లక్షణాలూ, అలవాట్లూ చాలానే ఉన్నాయి. న్యూమరికల్స్ అంటే ప్రాణంగా ఉండేదప్పుడు నాకు. 11వ తరగతిలో డిస్టింక్షన్ తెచ్చుకున్నది […]

మా నాన్న

రచన: పి.యస్.యమ్. లక్ష్మి మా నాన్న పేరు శ్రీ పులిగడ్డ జనార్దనరావు గారు. ఆయనకి మేము ఏడుగురం సంతానం. అందరం ఆడపిల్లలమే. అయ్యో పాపం అనకండి. ఎందుకంటే మా నాన్న, అమ్మ, అమ్మమ్మ .. వీళ్ళు ముగ్గురూ మా అక్క చెల్లెళ్ళ జీవితాల్లో అతి ముఖ్యలు .. వీళ్ళెవరూ అందరూ ఆడపిల్లలే అని ఏనాడూ అనుకోలేదు. ఏ ఒక్కరినీ తక్కువగా చూడలేదు. జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చారు మా నాన్న. వారాలు చేసి చదువుకున్నారు. ఒక […]

” తండ్రంటే మీరే నాన్నగారూ”

రచన: వెంకట్ అద్దంకి “పుత్రొత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినపుడు కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రొత్సహంబు నాడు పొందుర సుమతీ!” అని సుమతీ శతకంలో చెప్పేరు గానీ ( మళ్ళీ ఇక్కడ స్త్రీవాదులు స్త్రీ వివక్ష అంటారేమో, పద్యానికి పదాలు కుదరాలని మాత్రమే పుత్రుడు అన్నారు ఏ తండ్రికైనా పిల్లలు ఆడ అయినా, మొగ అయినా సమానమే) పిల్లలు పుట్టినపుడు ఏ తండ్రి సంతోషం అనుభవించడు?? దానికి తోడు ఒకింత గర్వంకూడా చూపకుండా చెప్తాడా తండ్రినయ్యానని? […]

నాన్న ఒక అద్భుత ప్రపంచం

రచన: కొప్పరపు సుబ్బలక్ష్మి అవును నాన్న నాకొక అధ్భుత ప్రపంచం. ఒక నిశ్శబ్ధ సంగీతం. నాన్న నాదమయితే ఆ స్వరం అమ్మ. అమ్మ నాన్న శృతిలయలు. మనల్ని ఈ ప్రపంచంలోకి తెచ్చి ప్రపంచం చూపించి ఎలా బ్రతకాలో మనకు నేర్పించిన మార్గదర్శకులు వాళ్ళు. నాకు మా నాన్నంటే ఓ పిసరు మక్కువ ఎక్కువ. అందరిలాగానే బడి చదువులు. మాకు పానుగంటివారి సాక్షి, చిలకమర్తివారి గణపతి , విశ్వనాధవారి కిన్నెరసాని గురజాడవారి గిరీశం వీళ్లందరినీ నాన్నే పరిచయంచేసారు. పుస్తకాలు […]

నాన్న – సూపర్ హీరో

రచన: జొన్నలగడ్డ కనకదుర్గ నాన్న నా సూపర్ హీరో. మా ఇంట్లో, మా చుట్టాలలో మా నాన్న ఒక ఆదర్శం. తను చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగినా, మాకు కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచారు. “తనకు తాను సుఖపడితే తప్పు కాకున్న తన వారిని సుఖపడితే ధన్యత” అని నాన్నలాంటి వారిని చూసే వ్రాసి వుంటారు. నేను కష్టపడ్డాను, నా వాళ్ళు కష్టపడకూడదు అన్న నాన్న తాపత్రయము వల్లే మామ్మ, తాతయ్య, పెద్దనాన్న, బాబాయిలు, వాళ్ళ […]

నాన్న ఆశయమే నా జీవిత లక్ష్యం

రచన: శోభా గురజాడ నాన్న నా కళ్ళకి, కరాలకి, కాళ్ళకి కూడా మార్గదర్శకుడు. సేవా రంగాన్నే చూపించారు. సేవ చెయ్యడమే నేర్పించారు. సేవామార్గంలోనే నడిపించారు .. భగవద్గీతలో లేనివి ప్రపంచంలో ఎక్కడా వుండవు అంటూ చిన్నప్పటినుండి గీత చదివించారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలంటూ ఆసనాలు నేర్పారు. స్వయంకృషితోనే పైకి రావాలి తప్ప పైరవీలు కూడదన్నారు . అలిగి అన్నం మానేస్తే తను కూడా తినకుండా కూర్చునేవారు .; పరిక్షలప్పుడు రాత్రి తను మాతోపాటే కూర్చునేవారు మధ్యమధ్యలో […]