March 29, 2024

గౌసిప్స్!!! Dead people don’t speak-4

రచన: డా. శ్రీసత్య గౌతమి ఏరన్ చూస్తుండగానే ఆ అబ్బాయి బొమ్మ ఫేన్ డయల్ పైనుంచి మాయమయిపోయింది. ఆశ్చర్యంతో కళ్ళు నులుముకొని చూశాడు, అక్కడ ఏమీ కనబడలేదు. మొదటినుండి ఆలోచించడం మొదలుపెట్టాడు తనకెప్పుడూ ఇలా జరగలేదు. అనైటా ఈ కేసు వివరాలు వివరించిన దగ్గిరనుండి ఇలాంటివి జరుగుతున్నాయి, తానింకా అసలు కేసులోనే దిగలేదు, ఆ సమాధి దగ్గిరకే వెళ్ళలేదు, ఏమిటి? ఈ హోటల్ కి ఆ బోయ్ చావుకి ఏదైనా సంబంధాలున్నాయా? నా రూమ్ కి ఇప్పుడు […]

వెటకారియా రొంబ కామెడియా 9 .. కరెంట్ కోతలు

రచన: మధు అద్దంకి ఉస్సురంటూ ఇంటికొచ్చి కూలబడ్డాడు పా.రా ( పాపారావు) సాయంత్రం 5 గంటలప్పుడు.. “ఏమేవ్ ఎక్కడ చచ్చావ్ ? కాసిని మంచినీళ్ళు నా మొహాన పడేయ్” అనరిచాడు పా.రా.. “మీకు నీళ్ళివ్వడానికి నేను చావడమెందుకూ?  నిక్షేపంలా బతికే ఉన్నా ..ఇంద కాచ్” అని అతని మీదకి నీళ్ళ చెంబు విసిరింది సు.ల(సుబ్బ లక్ష్మి) నీళ్ళన్నీ పా.రా మీద పడ్డాయి. చెంబు పాదం మీద పడి “కుయ్యోయ్” అని ఒక్క గెంతు గెంతాడు..అమ్మో దీనికి కోపమొచ్చేలా […]

ఇసీకో ప్యార్ కహతే హైఁ – పారసీక ఛందస్సు – 8

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు ఈ మధ్య “హై అప్నా దిల్ తు అవారా న జానే కిస్ పె ఆయేగా” అనే పాటను వినడము జరిగినది. ఈ పాటలోని పల్లవి నన్ను ఆకర్షించినది. దాని అమరికలో పదేపదే ఒక హ్రస్వము (లఘువు), మూడు దీర్ఘములు (గురువులు) ఉండేటట్లు తోచినది. శ్రీ హేమంత్ కుమార్ పామర్తిగారు, పల్లవి మాత్రమే కాక పాటంతా ఇదే ఛందస్సులో ఉండే ఒక ఉదాహరణమును ఎత్తి చూపారు. ఆ పాట – […]

పద్యమాలిక .. ఏప్రిల్ 1

NagaJyothi Ramana   అమ్మో జేబున చెయినిడ సొమ్ములచట దొరకనియడు- చోద్యము నేడున్ నెమ్మదిగా చూతును గద కొమ్మా ఫూల్ వయితివనుచు- కొంటెగ వ్రాసెన్   ఈ నెల జీతము నీదని మానస చోరుడు బలుకగ- మానిని తోడన్ వీనుల విందుగ దలచుచు కానక ఫూలయె ధనమును-కాంతుని జేబున్   ఫూలు గ జేశావ్ మగడా పూలకు నీ జేబు నిటుల- ఫుల్లుగ వెదకన్ వీలుగ చొక్కా కనపడి ఖాళీ యగుజేబునిడుచు -కాసులు దాచీ !!   […]

ఒక తుఫాను..ఒక నగరం..ఒక మనిషి

రచన- రామా చంద్రమౌళి డాక్టర్ హెచ్.సూర్యుడు. ఎంటెక్ పి. హెచ్. డి.. మెకానికల్ ఇంజినీరింగ్.. ఐ ఐ టి ఖరగ్ పూర్ నుండి. పదేళ్ళక్రితం. తర్వాత..వేట..ఉద్యోగం కోసం వేట..వృత్తి తృప్తి కోసం వేట..తనలో నిక్షిప్తమై జ్వలించే అధ్యయనాల తాలూకు పరిశోధనలూ..నూతన ఆవిష్కరణలూ..ఆలోచనలూ..హైపాథిసిస్ తాలూకు దాహానికి సంబంధించిన తృప్తికోసం వేట. వేట..వెదుకులాట..అన్వేషణ..ఫలించాయా.? వ్చ్. మనిషి లోపల కణకణలాడే నిప్పుకణికలా నిత్యం జ్వలించే శోధనాకాంక్ష..ఒక సముద్రమా.? ఒక ఆకాశమా.? ఒక అనంతానంత శూన్యమా.? హుద్ హుద్ తుఫాన్ రాబోతోందని హెచ్చరిక.. […]

అదే దారి…

రచన: చిత్ర “పోనైతే అందింది కానీ ఒత్తాడో రాడో” అని గాభరా పడుతున్నరాములమ్మ, కొడుకుని చూడగానే నిమ్మళించింది. “వూల్లోన రెండు తగువులు. తెంపుకుని రావొద్దేటి?” టీ తాగుతూ చెప్పుకుపోతున్నాడు, నలభై మైళ్ళవతల పల్లెటూర్నించి వచ్చినవాడు. “మనోల్లంతా పేటొగ్గీసి అయిస్కూలు నుండి ఆస్టలు మద్దినున్న జాగాలో ఇల్లు ఏసుకుంతన్నారు కదా! దాని గురించి” “తీసీమనా ఏటీ?” “కాదే!.మనం కట్టి ఇరవై ఏల్లు దెగ్గిరైంది. అప్పుడెవరూ ఏటీ అన్నేదు. ఇప్పుడు, మనోడే, ఒకుడు ఇల్లు కడదాం అని గునపం దిగేసీసరికి […]

రికార్డుల రికార్డు`ఆత్మకూరు రామకృష్ణ కళాప్రస్థానం

రచన: మాకినీడి సూర్య భాస్కర్‌ సృజనకు స్ఫూర్తి… అంతుబట్టని అపురూప చిత్రం ఈ ప్రకృతి! ప్రకృతిలోని అందాలు చూసే కొద్దీ మురిపించి మైమరపిస్తాయి!! కొండలు, కోనలు… గట్టులు, గుట్టలు… చెంగున దుమికే లేళ్ళు, సెలయేళ్ళు… పచ్చని వర్ణంతో పరిసరాలను చైతన్య పరచే చెట్లు, చేమలు… కలకూజితాలతో గాలికి రంగులద్దే పిట్టలు… ఉభయ సంధ్యల్లో రాగరంజితమయ్యే సువిశాల ఆకాశం… ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడే తెలినురగల కెరటం… వీటిని చూసి గంతులు వేయని హృదయముంటుందా? ఏ భావుకత లేని […]

నాన్న

రచన: ఉమా పోచంపల్లి “ఈ విశాల ప్రశా౦త ఏకా౦త సమయ౦లో… నిదురి౦చు జహాపనా..” రేడియోలో వస్తున్నఎం ఎస్ రామారావు గారి పాటకు స్వర౦ కలుపుతూ, ప౦చ, టవల్ భుజమ్మీద వేసుకుని స్నానానికి బయల్దేరి, కూని రాగాలు తీస్తూదినచర్య మొదలుపెట్టారు వేణుమాధవ రావ్. రోజూలాగే ఎనిమిది౦టికల్లా ట౦చనుగా స్నాన౦ కానిచ్చి, ఎనిమిది౦పావుకి, “హరిః ఓం|| తతో యుద్ధ పరిశ్రా౦త౦..” అని ఆదిత్య హృదయ౦, కనకధారా స్తవ౦ క౦ఠతా చదువుతూ, దేవుడికి దీప౦ వెలిగి౦చి, ద౦డ౦ పెట్టుకుని ఆఫీస్ కి […]

అద్వైత – ద్వైత – తత్వములు

రచన: వారణాసి రామబ్రహ్మం అద్వైతము అంటే రెండు కానిది. ఒక్కటే అయినది. ఏ రెండు కానిది? ఏ ఒక్కటే అయినది? అహమ్ – ఇదమ్ అని రెండుగా అనిపించనిది, కనిపించనిదీ అద్వైతము. అహమ్ నే అదః అని కూడా అంటారు. శ్లో ll పూర్ణమ్ అదః పూర్ణమ్ ఇదమ్ పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమ్ ఏవ అవశిష్యతే తాll అదః పూర్ణమైనది. ఇదమ్ కూడా పూర్ణమైనది. పూర్ణము నుంచి పూర్ణము పుడుతుంది. పూర్ణము నుంచి […]

అక్షర సాక్ష్యం 3

రచన: రంగనాథ్ భావతరంగాలు: స్నేహం… అహాన్ని బలి కోరుతుంది- అహం…. స్నేహాన్ని ఛిద్రం చేస్తుంది- స్నేహితుల మద్య స్నేహమైనా ప్రేమికుల మద్య ప్రేమైనా దంపతుల మద్య అనురాగమైనా కోరే త్యాగం ఒక్కటే…. అహం! ******** భౌతికవాదులకు ఏనాటికైనా ప్రపంచంలో ప్రశస్తమైనవి- రెండు… బంగారం-శృంగారం ! భౌతికంగా ఒకటి అనుభూతిపరంగా ఒకటి! నీతి నియమాలున్న నాయకులది – రామరాజ్యం ఆప్యాయత ఆదరణలున్న దంపతులది – ప్రేమరాజ్యం! ప్రేమంటే… కౌగిలింత కాదు కలవరింత! ******** తప్పయినా ఒప్పయినా తను చేసిందేదైనా […]