April 20, 2024

శోధన 2

రచన: మాలతి దేచిరాజు పాతబస్తీ… యాభై నాలుగేళ్ల జర్దార్ ఓ చిన్న ఇంట్లో ఇనుప మంచం మీద కూచున్నాడు.అతనికి ఎదురుగా ఓ చిన్న టేబుల్ మీద పోర్టబుల్ టీవీ వుంది,అందులో వస్తున్న వార్తలను   చూస్తున్నాడు. నలుగురు యువకులను జనం చంపేస్తోన్న దృశ్యం కూడా ప్రసారం అవుతోంది…యు ట్యూబ్ లో చిత్రీకరించిన వీడియో మధ్య మధ్యలో వేస్తున్నారు. ఏ నేరం చేసినా సాక్ష్యాలు వుండకూడదనుకునే జర్దార్ ఇప్పటి వరకూ పలు కిడ్నాప్ కేసుల్లో నిందితుడు.సరైనా సాక్ష్యాలు లేక కొన్ని,బెయిల్ […]

చేరేదెటకో తెలిసీ – 2

రచన: స్వాతీ శ్రీపాద   పదిరోజుల పాటు రాత్రీ పగలు అన్ని పనులూ వదిలేసుకుని తిండి నిద్రా ఊసెత్తకుండా న్యూరో సర్జన్ గా తన ప్రతిభను పూర్తిగా వినియోగించి నాలుగు ఆపరేషన్లు చేశాక శృతి స్పృహలోకి వచ్చింది. శివరావ్ గురించి ఈ పది రోజులుగా ఆలోచించే తీరికే లేకపోయింది. ఆ రోజున శృతి హాస్పిటల్ లో చేరిన పదోరోజున ఉదయం  అయిదింటికే మెళుకువ వచ్చింది శర్మకు… ఎందుకో వెంటనే వెళ్ళి శృతిని చూడాలన్న కోరిక అతన్ని నిలవనియ్యలేదు. […]

చిగురాకు రెపరెపలు:- 3

రచన: మన్నెం శారద   ఎదురుగా పెదనాన్న! చేతిలో ఒకదాని మీద ఒకటిగా పెట్టిన మాడుగుల హల్వా డబ్బాలు! వాటినిండా స్వచ్చమైన నేతితో చేసిన హల్వాల కన్నా ఆ డబ్బాల మీద వుండే అందమైన చిత్రాలు నా కిష్టం! నేను వాటికేసి ఆత్రం గా చూస్తుంటే… “లే!  లే! నీ కోసమే ఇవన్నీ! లే!” అన్నారు పెదనాన్న నవ్వుతూ. పెదనాన్న అందమైన మనిషి! హిందీ హీరోలా వుండేవారు. తెల్లటి బట్టలు టక్ చేసుకుని ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తుంటే… […]

అంతిమం 2

  సదాశివం ఆ రాయిని చేతిలోకి తీసుకుని ఎంతో అపురూపంగా కాస్సేపు ప్రేమగా దాని  దిక్కు చూచి ఎందుకో చటుక్కున ముద్దుపెట్టుకున్నాడు. కన్నీళ్ళు ముంచుకొచ్చి దుఃఖం పొంగింది అతని గుండెల్లోనుండి. అతను రాయిని ముద్దు  పెట్టుకుంటున్నపుడు రైల్లో ఎవరూ లేరు కాబట్టి గమనించలేదెవరూ. చూస్తే అతన్ని తప్పకుండా ఒక పిచ్చోడనే అనుకుందురు. సదాశివంకు చిన్నప్పటినుండి కూడా మట్టినీ, శిలనూ తాకినపుడు ఒక రకమైన పులకింత కలిగేది. ఈ సృష్టిలో సకల పదార్థాల ఆవిర్భవానికి మూలమైన పంచభూతాల్లో మనిషి  […]

ఆరాధ్య 8

రచన: అంగులూరి అంజనీదేవి           వెంటనే ఆరాధ్యకు రాకేష్‌ గుర్తొచ్చాడు ”వద్దు. నాకు అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యటం ఇష్టం లేదు” అంది ఆరాధ్య.           ”కాళ్లు తడవకుండా సముద్రాన్నైనా దాటగలం కాని అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యకుండా జీవితాన్ని దాటగలమా!” చాలా కూల్‌గా అడిగింది సరయు.           ”అది మనం ఫాలో అయ్యేదాన్నిబట్టి వుంటుంది”           ”మనం దేన్ని ఫాలో కాము. అవే మనల్ని ఫాలో అవుతాయి. దేన్ని దాటాలన్నా డబ్బు కావాలి. ఒక్కసారి మన అకౌంట్లో డబ్బు […]

మాయానగరం – 14

రచన: భువనచంద్ర తలుపు తీసే వుంది. ధైర్యంగా లోపలికి అడుగెట్టాడు ఆనందరావు. చాప మీద అర్ధనగ్నంగానే కూర్చుని వుంది సుందరీబాయి. గభాల్న వెనక్కి తిరగబోయేలోగా చూడనే చూసింది సుందరి. తటాల్న లేచి “మీకోసమే పొద్దున్నించీ నేను తపస్సు చేస్తున్నది. .. వచ్చావా నా దేవుడా..”మెరుపులా పెనవేసుకుపోయింది సుందరీబాయి. “సారీ అయినా.. ఇదేంటి మీరు… ఇలాగా… నో.. వదలండి.. లీవ్ మీ…”ఖంగారు ఖంగారుగా  అంటూ విడిపించుకో బోయాడు ఆనందరావు..   ఆమె నోట్లోంచి ఖరీదైన విస్కీ వాసన. “ఏం? నేను […]

గౌసిప్స్!!! Dead people don’t speak-4

రచన: డా. శ్రీసత్య గౌతమి ఏరన్ చూస్తుండగానే ఆ అబ్బాయి బొమ్మ ఫేన్ డయల్ పైనుంచి మాయమయిపోయింది. ఆశ్చర్యంతో కళ్ళు నులుముకొని చూశాడు, అక్కడ ఏమీ కనబడలేదు. మొదటినుండి ఆలోచించడం మొదలుపెట్టాడు తనకెప్పుడూ ఇలా జరగలేదు. అనైటా ఈ కేసు వివరాలు వివరించిన దగ్గిరనుండి ఇలాంటివి జరుగుతున్నాయి, తానింకా అసలు కేసులోనే దిగలేదు, ఆ సమాధి దగ్గిరకే వెళ్ళలేదు, ఏమిటి? ఈ హోటల్ కి ఆ బోయ్ చావుకి ఏదైనా సంబంధాలున్నాయా? నా రూమ్ కి ఇప్పుడు […]

వెటకారియా రొంబ కామెడియా 9 .. కరెంట్ కోతలు

రచన: మధు అద్దంకి ఉస్సురంటూ ఇంటికొచ్చి కూలబడ్డాడు పా.రా ( పాపారావు) సాయంత్రం 5 గంటలప్పుడు.. “ఏమేవ్ ఎక్కడ చచ్చావ్ ? కాసిని మంచినీళ్ళు నా మొహాన పడేయ్” అనరిచాడు పా.రా.. “మీకు నీళ్ళివ్వడానికి నేను చావడమెందుకూ?  నిక్షేపంలా బతికే ఉన్నా ..ఇంద కాచ్” అని అతని మీదకి నీళ్ళ చెంబు విసిరింది సు.ల(సుబ్బ లక్ష్మి) నీళ్ళన్నీ పా.రా మీద పడ్డాయి. చెంబు పాదం మీద పడి “కుయ్యోయ్” అని ఒక్క గెంతు గెంతాడు..అమ్మో దీనికి కోపమొచ్చేలా […]

ఇసీకో ప్యార్ కహతే హైఁ – పారసీక ఛందస్సు – 8

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు ఈ మధ్య “హై అప్నా దిల్ తు అవారా న జానే కిస్ పె ఆయేగా” అనే పాటను వినడము జరిగినది. ఈ పాటలోని పల్లవి నన్ను ఆకర్షించినది. దాని అమరికలో పదేపదే ఒక హ్రస్వము (లఘువు), మూడు దీర్ఘములు (గురువులు) ఉండేటట్లు తోచినది. శ్రీ హేమంత్ కుమార్ పామర్తిగారు, పల్లవి మాత్రమే కాక పాటంతా ఇదే ఛందస్సులో ఉండే ఒక ఉదాహరణమును ఎత్తి చూపారు. ఆ పాట – […]

పద్యమాలిక .. ఏప్రిల్ 1

NagaJyothi Ramana   అమ్మో జేబున చెయినిడ సొమ్ములచట దొరకనియడు- చోద్యము నేడున్ నెమ్మదిగా చూతును గద కొమ్మా ఫూల్ వయితివనుచు- కొంటెగ వ్రాసెన్   ఈ నెల జీతము నీదని మానస చోరుడు బలుకగ- మానిని తోడన్ వీనుల విందుగ దలచుచు కానక ఫూలయె ధనమును-కాంతుని జేబున్   ఫూలు గ జేశావ్ మగడా పూలకు నీ జేబు నిటుల- ఫుల్లుగ వెదకన్ వీలుగ చొక్కా కనపడి ఖాళీ యగుజేబునిడుచు -కాసులు దాచీ !!   […]