April 20, 2024

ఒక తుఫాను..ఒక నగరం..ఒక మనిషి

రచన- రామా చంద్రమౌళి డాక్టర్ హెచ్.సూర్యుడు. ఎంటెక్ పి. హెచ్. డి.. మెకానికల్ ఇంజినీరింగ్.. ఐ ఐ టి ఖరగ్ పూర్ నుండి. పదేళ్ళక్రితం. తర్వాత..వేట..ఉద్యోగం కోసం వేట..వృత్తి తృప్తి కోసం వేట..తనలో నిక్షిప్తమై జ్వలించే అధ్యయనాల తాలూకు పరిశోధనలూ..నూతన ఆవిష్కరణలూ..ఆలోచనలూ..హైపాథిసిస్ తాలూకు దాహానికి సంబంధించిన తృప్తికోసం వేట. వేట..వెదుకులాట..అన్వేషణ..ఫలించాయా.? వ్చ్. మనిషి లోపల కణకణలాడే నిప్పుకణికలా నిత్యం జ్వలించే శోధనాకాంక్ష..ఒక సముద్రమా.? ఒక ఆకాశమా.? ఒక అనంతానంత శూన్యమా.? హుద్ హుద్ తుఫాన్ రాబోతోందని హెచ్చరిక.. […]

అదే దారి…

రచన: చిత్ర “పోనైతే అందింది కానీ ఒత్తాడో రాడో” అని గాభరా పడుతున్నరాములమ్మ, కొడుకుని చూడగానే నిమ్మళించింది. “వూల్లోన రెండు తగువులు. తెంపుకుని రావొద్దేటి?” టీ తాగుతూ చెప్పుకుపోతున్నాడు, నలభై మైళ్ళవతల పల్లెటూర్నించి వచ్చినవాడు. “మనోల్లంతా పేటొగ్గీసి అయిస్కూలు నుండి ఆస్టలు మద్దినున్న జాగాలో ఇల్లు ఏసుకుంతన్నారు కదా! దాని గురించి” “తీసీమనా ఏటీ?” “కాదే!.మనం కట్టి ఇరవై ఏల్లు దెగ్గిరైంది. అప్పుడెవరూ ఏటీ అన్నేదు. ఇప్పుడు, మనోడే, ఒకుడు ఇల్లు కడదాం అని గునపం దిగేసీసరికి […]

రికార్డుల రికార్డు`ఆత్మకూరు రామకృష్ణ కళాప్రస్థానం

రచన: మాకినీడి సూర్య భాస్కర్‌ సృజనకు స్ఫూర్తి… అంతుబట్టని అపురూప చిత్రం ఈ ప్రకృతి! ప్రకృతిలోని అందాలు చూసే కొద్దీ మురిపించి మైమరపిస్తాయి!! కొండలు, కోనలు… గట్టులు, గుట్టలు… చెంగున దుమికే లేళ్ళు, సెలయేళ్ళు… పచ్చని వర్ణంతో పరిసరాలను చైతన్య పరచే చెట్లు, చేమలు… కలకూజితాలతో గాలికి రంగులద్దే పిట్టలు… ఉభయ సంధ్యల్లో రాగరంజితమయ్యే సువిశాల ఆకాశం… ఆ ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటపడే తెలినురగల కెరటం… వీటిని చూసి గంతులు వేయని హృదయముంటుందా? ఏ భావుకత లేని […]

నాన్న

రచన: ఉమా పోచంపల్లి “ఈ విశాల ప్రశా౦త ఏకా౦త సమయ౦లో… నిదురి౦చు జహాపనా..” రేడియోలో వస్తున్నఎం ఎస్ రామారావు గారి పాటకు స్వర౦ కలుపుతూ, ప౦చ, టవల్ భుజమ్మీద వేసుకుని స్నానానికి బయల్దేరి, కూని రాగాలు తీస్తూదినచర్య మొదలుపెట్టారు వేణుమాధవ రావ్. రోజూలాగే ఎనిమిది౦టికల్లా ట౦చనుగా స్నాన౦ కానిచ్చి, ఎనిమిది౦పావుకి, “హరిః ఓం|| తతో యుద్ధ పరిశ్రా౦త౦..” అని ఆదిత్య హృదయ౦, కనకధారా స్తవ౦ క౦ఠతా చదువుతూ, దేవుడికి దీప౦ వెలిగి౦చి, ద౦డ౦ పెట్టుకుని ఆఫీస్ కి […]

అద్వైత – ద్వైత – తత్వములు

రచన: వారణాసి రామబ్రహ్మం అద్వైతము అంటే రెండు కానిది. ఒక్కటే అయినది. ఏ రెండు కానిది? ఏ ఒక్కటే అయినది? అహమ్ – ఇదమ్ అని రెండుగా అనిపించనిది, కనిపించనిదీ అద్వైతము. అహమ్ నే అదః అని కూడా అంటారు. శ్లో ll పూర్ణమ్ అదః పూర్ణమ్ ఇదమ్ పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమ్ ఏవ అవశిష్యతే తాll అదః పూర్ణమైనది. ఇదమ్ కూడా పూర్ణమైనది. పూర్ణము నుంచి పూర్ణము పుడుతుంది. పూర్ణము నుంచి […]

అక్షర సాక్ష్యం 3

రచన: రంగనాథ్ భావతరంగాలు: స్నేహం… అహాన్ని బలి కోరుతుంది- అహం…. స్నేహాన్ని ఛిద్రం చేస్తుంది- స్నేహితుల మద్య స్నేహమైనా ప్రేమికుల మద్య ప్రేమైనా దంపతుల మద్య అనురాగమైనా కోరే త్యాగం ఒక్కటే…. అహం! ******** భౌతికవాదులకు ఏనాటికైనా ప్రపంచంలో ప్రశస్తమైనవి- రెండు… బంగారం-శృంగారం ! భౌతికంగా ఒకటి అనుభూతిపరంగా ఒకటి! నీతి నియమాలున్న నాయకులది – రామరాజ్యం ఆప్యాయత ఆదరణలున్న దంపతులది – ప్రేమరాజ్యం! ప్రేమంటే… కౌగిలింత కాదు కలవరింత! ******** తప్పయినా ఒప్పయినా తను చేసిందేదైనా […]

నీలాకాశపు అంచులలో….

రచన:పుట్టపర్తి నాగపద్మిని నీలాకాశపు అంచులలో విహరించేవారము మేమూ కల కానే కాదిది నిజమూ బందీలము కామూ మేమూ …నీలాకాశపు.. బంగరు పంజరములలోనా కన్నీటి కథలిక లేవూ చుక్కల లోకమ్ముల దాకా మా రెక్కల అంచులు సాగూ ….నీలాకాశపు.. సంకెలల ప్రపంచం తోటీ సంఘర్షణ మాకిక లక్ష్యం సంక్షోభపు స్త్రీ బ్రతుకులకే సంరక్షణ మా కర్తవ్యం ….నీలాకాశపు.. బరువెకిన హృదయంలోన బడబానలమే చెలరేగీ కరుకెక్కిన జాతిని సైతం యెదిరించే శక్తిగ నిలచీ ….నీలాకాశపు.. మా గొంతులు అన్నీ ఒకటై […]

ఓ మహిళా మేలుకో …

రచన: సరిత భూపతి భూమ్మీదకు రాకముందే యంత్రంతో వెతికి మరీ చంపుతాం పొరపాటున భూమ్మీద పడితే గొంతులో వండ్లగింజ వేసి చంపుతాం అలా కూడా బతికి బయటపడితే ఆసిడ్ పోసి చంపుతాం కోరిందివ్వకపోతే కామంతో చంపుతాం పైశాచిక ఆనందంతో సూదులు గుచ్చి చంపుతాం మాకు మేమే వెల కట్టుకొని వరకట్నం అడిగి చంపుతాం ఇవ్వకపోతే సిగేరేట్ లతో కాల్చి చంపుతాం ఆ వాడినే మగాడినే …. కరడుగట్టిన పురుషహంకారంతో విర్రవీగుతున్న మగాడినే పుట్టగానే నీ రొమ్ము పాలు […]

చెట్టు

 రచన:  నాగులవంచ వసంతరావు,                          చెట్టు ప్రాణికి ఆయువు పట్టు మానవ ప్రగతికదే తొలి మెట్టు   చెడునంతా సతతం తనలోకి నెట్టు ప్రాణవాయువును బయటకు వెడలగొట్టు   పళ్ళకోసమై రాళ్ళ దెబ్బలకోర్చు మానవాళి ఆకలిని అనందంగా తీర్చు   గ్రీష్మ తాపాన్ని తనలోకి కూర్చు చల్లని నీడను మనకు సమకూర్చు   మనం నిద్రించుటకై అవుతుంది కాట్ పిల్లలు ఆడడానికి అదే ఒక బ్యాట్   కర్షకుని పొలములో కాడి కాష్టాల గడ్డలో పాడె […]

పురుషాహంకారం

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. పందిరివైనంత మాత్రాన అలా పకపకా నవ్వాలా? నీ  పురుషాహంకారాన్నినాపై ఇలా రువ్వాలా? నా పువ్వులే నిన్నుఅలంకరిస్తున్నాయని, నా సొగసులే నీకు అందానిస్తున్నాయని, మరిచిపోతున్నావు. లతను నేను, పందిరి నీవు అయినంత మాత్రాన, నీ ఆధారంగా నేను నిలబడినంత మాత్రాన నాపై అధికారం ఉన్నట్లు పొరబడుతున్నావు. నేను లేని నీవు తోడులేని మోడులా, మమతలేని మనసులా ఉంటావని తెలుసుకోలేక తడబడుతున్నావు. నా ఆకులు నీ ఆశలు, నా పువ్వులు నీ నవ్వులు, నా […]