April 18, 2024

అమ్మమ్మ – 55

రచన: గిరిజ పీసపాటి భోజనం పిలుపులకు పాపమ్మ గారు చిన్న కోడలితో పాటు బావగారి కోడలిని, అక్కగారి కోడళ్ళను, వారి భర్తలను వెళ్ళమన్నారు. వారితో పాటూ పొలోమంటూ మిగిలిన పిల్లలంతా బయలుదేరడంతో… వీళ్ళతో వీళ్ళ టీమ్ లీడర్, పెళ్ళికూతురి వయసువాడు, వరుసకు మామయ్య అయ్యే చంద్రమౌళి కూడా ఉన్నాడు‌. “చంద్రా! మళ్ళీ వాళ్ళను తోటకి తీసుకెళ్ళకు. ఇందాకే తాతకు కోపం వచ్చింది. చెల్లిని పల్లకిలో తోటకి పంపిద్దామనుకున్నారు. అది లేకపోతే లక్ష్మినో, వాణినో (కామేశ్వరి తరువాతి ఆడపిల్లలు) […]

స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు -7

రచన: డా. లక్ష్మీ సలీం అనువాదం: స్వాతీ శ్రీపాద 16. ఏమీ తెలియని దేశంలో ప్రవేశం 1978 నవంబర్ లో ఏమీ తెలియని మట్టి మీద, హీత్రో విమానాశ్రయంలో, చేతుల్లో నా కూతురితో కాలు మోపాం. జాతి వివక్ష గురించి ఎన్నో చదివాం, ఎన్నో విన్నాం. ఆసియా డాక్టర్ల స్థితి గతుల గురించీ, భెల్ఫాస్ట్ లో బాంబ్ విసరడాల గురించీ, ఇలా ఎన్నో, ఎన్నెన్నో.. నాలో ఎన్నో ప్రశ్నలు, తొందరపడి ఇక్కడికి వచ్చామా అనికూడా అనుకున్నాను. నేను […]

ఆచార్య సర్వత్ర పూజ్యతే

రచన: నండూరి సుందరీ నాగమణి “వంటయింది… భోజనానికి రండి…” పిలిచింది విశాలాక్షి. “వస్తున్నాను విశాలా… వడ్డించు… ఇదిగో… ఈ శార్దూలాన్ని సవరించి వచ్చేస్తాను…” అల్లిన పద్యాన్ని పుస్తకంలో వ్రాసుకుని, మరోసారి చదువుకుని, తృప్తిగా తలపంకించాడు విశ్వనాథం. కంచంలో అన్నం, ఆవకాయ, బెండకాయ వేపుడు, ముద్ద పప్పు, వడియాలు, పక్కనే వేడి వేడి చారు గిన్నె అన్నీ చక్కగా బల్లపై అమర్చింది విశాల. మోకాళ్ళ నొప్పుల వలన కింద కూర్చుని తినలేరు ఇద్దరూ… “అబ్బాయిలు ఫోన్లు చేయటమే మానేసారు […]

మొల్ల పద్యంతో సినిమా పాట

రచన: మంగు కృష్ణకుమారి మన కవులు కవయిత్రులు అందరూ, వాళ్లు మనో దృష్టితో తిలకించిన దానిని పద్యంగా రచించేరు. రామాయాణాన్ని తెనింగించిన , కవయిత్రి మొల్ల వనవాసానికి వెళ్లే రాముడిని, గుహుడు గంగ దాటించడానికి ముందు సన్నివేశాన్ని ఎలా చెప్పేరో చూడండి. “సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ నొక కాంత యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణువీ యడవడిన్ ఓడ సోక, ఇది ఏమగునోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామ పద కంజ […]

సినీ బేతాళ కథలు – తోలు మనసులు

రచన:- డా. కె.వివేకానందమూర్తి విక్రమార్కుడు మళ్లీ బేతాళుడి శవాన్ని తన భుజం మీద వేసుకుని, విసుగు చెంద కుండా తెలుగు సినిమాలు పదే పదే చూస్తున్న ప్రేక్షకుడిలా, నడక సాగించాడు. ‘విక్ర! మార్గమధ్యంలో నీకు విసుగు, శ్రమ అనిపించకుండా యింటర్వెల్ యివ్వ కుండా మరో కథ చెబుతాను విను.’ – అని బేతాళుడు ప్రారంభించాడు – “అమలాపురంలో బొబ్బర్లంక బుజ్జిబాబుకి వొక లాడ్డింగ్ హోటలుంది. దానికి ఏ స్టార్స్ లేకపోయినా ఫైవ్ స్టార్ హోటల్ అని పేరెట్టుకున్నాడు. […]

బాలమాలిక – కుంకుడు చెట్టు – తెల్ల దయ్యం

రచన: నాగమణి “ఆ… ఇదే ఇల్లు… ఆ పందిరి వేసిన ఇంటిదగ్గర ఆపండి…” క్యాబ్ డ్రైవర్ కి చెప్పాను. మావారు ఈశ్వర్, అబ్బాయి క్రాంతి దిగి, వెనుక ట్రంక్ లోంచి సామాను తీసుకున్నారు. ఫేర్ చెల్లించి నేనూ క్యాబ్ దిగాను. ముఖం ఇంత చేసుకుని, గబగబా ఎదురువచ్చి మా చేతుల్లో బ్యాగులు అందుకున్నది మా పెద్దాడపడుచు వాణి. ఆమె వెనుకనే ఆమె ముగ్గురు కొడుకులూ నిలబడి, ఆప్యాయంగా లోనికి ఆహ్వానించారు. కొత్తగా రంగులు వేయబడి, ఇల్లంతా ప్రతీ […]

అంతర్మథనం

రచన: సుమలత దేష్పాండె పిల్లల మాటలకు మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలై లావా ఉప్పొంగుతుంటె కళ్ళల్లో గిర్రున తిరిగిన నీళ్ళు కనిపించకుండా అతికష్టంపైన తన గదిలో మంచంపై భారంగా ఒరిగిపోయింది రజనీ. కళ్లల్లోంచి కన్నీళ్ళు ధారలుగా జాలువారుతుంటే ఆశ్చర్యంగా …ఇంక నా కళ్ళల్లో నీరుందా? ఎప్పుడో ఎండి బీటలువారింది కదా నా హృదయం, అని పేలవంగా నవ్వుకుంది. తను ఎందుకు పుట్టిందో, ఎందుకిన్ని కష్టాలో అంతుచిక్కని ప్రశ్న. మామూలు మధ్యతరగతి కుటుంబంలో తను రెండో సంతానం. ఇంకా ఇద్దరు […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2024 సంచికకు స్వాగతం

  స్వాగతం… సుస్వాగతం… ప్రియ పాఠకమిత్రులు, రచయితలందరికీ మాలిక పత్రిక తరపున ధన్యవాదాలు… కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఒక నెల గడిచిపోయింది కదా.. చలి పులి పారిపోయినట్టే అనిపిస్తోంది. మామిడిచెట్లన్నీపూతబట్టి నిండుగా ఉన్నాయి. మల్లెలు కనపడుతున్నాయి.. పిల్లలు పరీక్షల హడావిడిలో ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు పిల్లలకంటే ఎక్కువ టెన్షన్ గా ఉన్నారు.. ఎప్పటిలాగే మీకోసం, మీరు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, సంగీతం, మొదలైన అంశాలతో మాలిక కొత్త సంచిక వచ్చేసింది. […]

వెంటాడే కథ – 25

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

డయాస్పోరా జీవన కథనం – త్రిశంకు స్వర్గం

రచన: కోసూరి ఉమాభారతి క్లిష్టమైన పరిస్థితుల నడుమ నలిగి, సుస్థిరత్వాన్నే కోల్పోయిన ఓ ప్రవాస భారతీయ మహిళ కథనం… ****************** ఎవరో గట్టిగా తట్టి లేపుతున్నారు. కళ్ళు నులుముకొని లేచాను. ఎదురుగా ఓ అమెరికన్. పెద్దాయనే. అర్ధం కాలేదు. చుట్టూ చూశాను. మా ఇంటి దగ్గర పార్క్ లో ఓ చెట్టు క్రింద, బెంచ్ మీద ఉన్నాను. ‘జాక్ ఇన్ ద బాక్స్’యూనిఫారంలో ఉన్నాను. ఏమైనట్టు, పనికి బయలుదేరడం గుర్తుందే, మరి ఇక్కడున్నానేమిటి? అయోమయంగా ఉంది. టైం […]