April 26, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35   విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో అన్నమయ్య వాదన బహు చిత్రవిచిత్రంగా ఉంటుంది. మనిషి యొక్క పాపపుణ్యాలకు కారణమైనది మనసు. ఆ మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా!  అలాంటప్పుడు పాప పుణ్యాలను చేయించే బుద్ధిని  తప్పు మానవులది ఎలా అవుతుంది?  అందువల్ల ఆయన్నే అడగాలి. మనం చనిపోయాక మన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తునిచే            చదివించి యమధర్మరాజు శిక్షించే పద్ధతిని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. చిత్తగించండి. కీర్తన: పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 34

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య శ్రీనివాసునికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. స్వామీ నీలీలలు మాకు ఎన్నటికీ అర్ధం కావు. ఒకడు నిన్ను నిరంతరం కీర్తిస్తూనే ఉంటాడు. కానీ మరొకనికి సులభంగా కైవల్య పధం దక్కుతుంది. కొందరు భక్తులను అష్టకష్టాల పాలు చేస్తావు. మరొకరికి చిటికెలో సద్గతులు కలిగిస్తావు. ఏమిటి నీ మాయ మా లాంటి సామాన్యులు ఎలా అర్ధం చేసుకోవాలి అంటూ అడుగుతున్నాడు. కీర్తన: పల్లవి: పాటెల్లా నొక్కచో నుండు; భాగ్య మొక్కచోనుండు యీటు వెట్టి పెద్దతనా […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 32

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “బాలస్తావత్‌ క్రీడాసక్తః – తరుణస్తావత్‌ తరుణీ సక్తః – వృద్ధస్తావత్‌ చింతాసక్తః – పరమే బ్రహ్మణి కో పినసక్తః” ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది. ‘మోహముద్గరం’ గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లోని ఏడో శ్లోకం యిది. మానవుడు.. బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 31

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య భగవంతుని సాన్నిధ్యంలో నిరంతరం నిలిచేందుకు, తరించేందుకు ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. వాటిలో ముఖ్యమైన వాటిని నవవిధ భక్తులుగా పేర్కొన్నది భాగవత పురాణం. భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి… తానను తానే కీర్తించుకుంటున్నానంతగా భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. భారతదేశంలో భక్తి సామాన్యులకు మరింత చేరువయ్యేందుకు తోడ్పడిన ‘భక్తి ఉద్యమం’లో కీర్తనం ఒక ముఖ్య భాగమై నిలిచింది. భరతఖండంలో మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని మన తెలుగునాట అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య వరకూ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 29

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య “అర్ధము పురుషార్ధములలో నుత్తమము. అర్ధవంతుడు న్యాయము దప్పక మరియే ఉపాయము చేతనైనను ద్రవ్యము సంపాదించవచ్చును” అంటాడు పరవస్తు చిన్నయసూరి తన నీతిచంద్రికలో. అలాగే అన్నమయ్య ఆ ధనాన్ని గురించి మరొక విషయం చెప్తున్నాడు. ఆపదలలో ఉపయోగపడకుండా వున్న ధనం ఎవరికోసం? అని ప్రశ్నిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య. ఆ వివరాలేమిటో ఈ కీర్తనలో చూద్దాం. కీర్తన: పల్లవి: అక్కర కొదగని యట్టి అర్ధము లెక్కలెన్ని యైనా నేమి లేకున్న నేమిరే చ.1. దండితో […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 27

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య సంసార పూరితులైన జనావళికి ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి శ్రీహరి ఒక్కడే దిక్కు మరి ఇంక వేరే దారి లేనే లేదు అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును తేప యితడె మఱి తెరగేది చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి యీసులేని సుఖ మెక్కడిది చేసినపాపము చేతుల నున్నది మోసపోనిగతి ముందర నేది ॥ శ్రీపతి॥ చ.2. కోపము గొందుల గుణముల నున్నది […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 26

    విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   భగవంతుని కరుణను గ్రహించలేక పోయాను. ఏవేవో అవసరం లేని వాటికి వెంపర్లాడాను. బాధలు కలిగినప్పుడల్లా, కోపం వచ్చినప్పుడల్లా నోటిదూల తీరేంతవరకూ ఎదురుగా ఎవరుంటే వాళ్ళను దూషించడమే పనిగా పెట్టుకున్నాను. ఇంతకాలం నా బ్రతుకు అడవి గాచిన వెన్నెల అయింది కదా అని ఆవేదన చెందుతూ కీర్తించిన గొప్ప ఆధ్యాత్మిక కీర్తన.   కీర్తన: పల్లవి: ఇంతగాలమాయను యేడనున్నారో వీరు వింతలై యడవిఁ గా సే వెన్నెలాయ బ్రదుకు     […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 25

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఊరకనే ఉన్న శాస్త్ర గ్రంధాలన్నీ చదవడం ఎందుకు అందులో ఉన్నదంతా బుర్రలోకి ఎక్కించుకుని బాధపడడం ఎందుకు అని వ్యంగ్యంగా బోధిస్తున్నాడు అన్నమయ్య ఈ గీతంలో. ఇక్కడ మనం ఒక సంఘటనను గుర్తుచేసుకోవ్చ్చు. ఆదిశంకరులు ఓ రోజు దారిలో నడచి వెళ్తూ ఉండగా ఒక పండితుడు “డుకృంకరణే” అంటూ సంస్కృత వ్యాకరణం వల్లె వేస్తూ కనిపించాడు. మహాత్ములకున్న సహజమైన కనికరం వల్ల శంకర భగవత్పాదులు అతడ్ని సమీపించి ఇలా అన్నారు.”భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే! […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 21

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ సృష్టిలోని సమస్త జీవరాసులను, బ్రహ్మాండాలను సృష్టించేది పరంధాముడే కదా! ఆ శ్రీహరి సృష్టించిన పదార్ధాలనే.. అంటే… అది లడ్డయినా..వడలయినా..చక్కెర పొంగలయినా… స్వామికి “నైవేద్యం సమర్పయామి” అంటూ నివేదిస్తూ ఉంటాము. ఎంత విచిత్రమో కదా! సమస్తo సృష్టించే ఆ దివ్య లీలా మానుష విగ్రహధారికి ఆ పదార్ధాలనే మనం తయారు చేసిన వస్తువుల్లాగా గొప్పకు పోతూ స్వామికి పెడుతూ ఉంటాము. నీ సొమ్మ్ము నీకే ఇవ్వడం..పైగా అదేదో మా సృజన అయినట్టు సంబరపడ్డమూ…. […]