March 29, 2024

అమ్మమ్మ – 40

రచన: గిరిజ పీసపాటి వసంత చెప్పిన విషయం విన్నాక నాగ కూడా నిర్ఘాంతపోయి “అదేంటి వసంతా! మీ నాన్న ఇంటికి కూడా రాకుండా అలా ఎలా వెళ్ళిపోయారు? అసలు మనం చేసిన తప్పేంటి? ఆ రోజు మీ తాతకి కూడా మరీ మరీ చెప్పాను కదా! ఒక్కసారి మీ నాన్నను ఇంటికి పంపమని. ఆయన ఈ విషయం మీ నాన్నకి చెప్పలేదం టావా!? ఒక వేళ మీ తాత చెప్పినా నాన్నే వినలేదా!? ఇప్పుడు మనం ఏం […]

అమ్మమ్మ – 39

రచన: గిరిజ పీసపాటి అయినా, వచ్చిన కార్యం ముఖ్యమైనది కనుక ప్రసన్నంగానే ఆయనతో “అవన్నీ నిజం కాదు మామయ్యగారు. ఒక్కసారి ఇంటికి రండి. ఇన్నాళ్లు మేమెందుకు అక్కడికి రాలేదో, అసలు ఆయనకి, నాకు మధ్య జరిగిన గొడవేమిటో వినండి. ఆ తర్వాత మీరే శిక్ష విధించినా నేను, పిల్లలు భరిస్తాము. ఈ ఒక్కసారి నా మాట మన్నించండి” అని వేడుకుంది. “నన్ను అభిమానించేవారు, నేను తమ ఇంటికి వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఈ ఊరిలో ఉన్నారు. […]

అమ్మమ్మ – 38

రచన: గిరిజ పీసపాటి   కృష్ణమూర్తి గారు చెప్పిన మాటలు విని ఆలోచనలో పడింది నాగ. కాసేపటికి గిల్ మేన్ కంపెనీ రిప్రజెంటేటివ్ రావడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఆయనతో ఆరోజు ఆయన కవర్ చెయ్యబోయే ఏరియాలు, డాక్టర్స్ లిస్ట్ వివరాలు మాట్లాడసాగింది. ఇంతలో కృష్ణమూర్తిగారు కూడా బేంక్ నుండి వచ్చి వీరితో జాయిన్ అయారు. కాసేపు మాట్లాడాక సురేష్ గారు డాక్టర్స్ విజిట్ కోసం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళగానే కృష్ణమూర్తిగారు జేబులోంచి కొంత డబ్బు తీసి నాగ […]

అమ్మమ్మ – 36

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ గారు రెండు కాఫీ గ్లాసులు తెచ్చి వసంత చేతికిచ్చి “తమ్ముడికి, చెల్లికి ఇచ్చి రామ్మా!” అనడంతో మారు మాట్లాడకుండా గ్లాసులందుకుని, తమ ఇంట్లోకెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చి వచ్చింది వసంత. మరో రెండు గ్లాసుల కాఫీ తెచ్చి తల్లీకూతుళ్ళకి ఇచ్చారావిడ. మౌనంగా కాఫీ తాగేసి తాము వచ్చిన విషయం చెప్పింది నాగ. ఆవిడ ఎప్పటిలాగే ప్రశాంతంగా అంతా విని “తప్పకుండా మీ అన్నయ్య గారు ఆయనకు ఫోన్ చేసి చెప్తారు. మీరు […]

అమ్మమ్మ – 35

రచన: గిరిజ పీసపాటి కొన్ని విషయాలు మనం ఎంత దాచాలనుకున్నా దాగేవి కావు కనుక అన్ని విషయాలూ ఒక్క తమ ఆర్థిక ఇబ్బందులు తప్ప ప్రసాద్ గారితో వివరంగా చెప్పింది నాగ. జరిగినదంతా విన్నాక ఆయన చాలా బాధపడి “అయ్యో! మీరు పిల్లలు ఇంత బాధలో ఉన్నారని తెలియదు మేడమ్! ఎవరికైనా హెల్త్ బాగోలేదేమో అవసరమైతే తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. సర్ వచ్చేస్తారు. మిమ్మల్ని పిల్లల్ని వదిలి వారు మాత్రం […]

అమ్మమ్మ – 33

రచన: గిరిజ పీసపాటి పరిస్థితులు ఇలా ఉండగానే పెద్ద పండుగ అని పిల్చుకునే ముచ్చటైన మూడురోజుల పండుగ వచ్చింది. భోగీ పండుగ రోజు ఉదయాన్నే ‘ఢిల్లీ’ అని అందరూ పిలుచుకునే ‘లక్ష్మణరావు’ అనే అబ్బాయి వేరేవాళ్ళ ద్వారా పెదబాబు ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే విషయం తెలిసి వీళ్ళింటికి వచ్చాడు. నాగ వాళ్ళు వైజాగ్ లో కాపురం పెట్టిన కొత్తల్లో చెంగల్రావు పేటలో వీళ్ళు అద్దెకుండే ఇంట్లోనే మరో వాటాలో అద్దెకుండేవారు ఢిల్లీ వాళ్ళు. ఢిల్లీ అమ్మానాన్నలను నాగ ‘పిన్ని, […]

అమ్మమ్మ – 32

రచన: గిరిజ పీసపాటి “నేను కూడా ఈ పూట వెళ్ళను పాపా! నా మనసేం బాగోలేదు” అన్న తల్లితో “నువ్వు మనసు బాగోలేదని మానెయ్యడానికి నీది మామూలు ఉద్యోగం కాదమ్మా! నిన్ను నమ్మి కుష్ట (కృష్ణ) మామ అప్పజెప్పిన బాధ్యత. నువ్వు వెళ్ళకపోతే ఎలా?” అంటూ తల్లిని బలవంతంగా షాప్ కి పంపింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన నాగ “నాన్నకి కేరియర్ పంపావా!?” అనడిగింది వసంతను. “తమ్ముడు తిని, ఇప్పుడే తీసుకెళ్ళాడు. నువ్వు కూడా తినేసి […]

అమ్మమ్మ – 31

రచన: గిరిజ పీసపాటి     బైపాస్ సర్జరీ కోసం ఒక పార్టనర్ డబ్బు వెనక్కి తీసుకున్నా, మిగిలిన పార్టనర్స్ పెట్టుబడి తో  షాప్ బాగానే నడుస్తోంది. ఒక రోజు వీళ్ళచేత షాప్ కి పెట్టుబడి పెట్టించిన బంధువు మళ్ళీ వీరి ఇంటికొచ్చి నాగతో “చెల్లీ! నేను బయట పనులు, రిప్రజెంటెటివ్స్ ని మోటివేట్ చెయ్యడం, వాళ్ళ MD లు వస్తే వాళ్ళతో కలిసి డాక్టర్స్ ని విజిట్ చెయ్యడం వంటి బిజినెస్ ప్రమోషన్ కి సంబంధించిన […]

అమ్మమ్మ – 30

రచన: గిరిజ పీసపాటి బిఎడి లో మంచి రాంక్ రావడంతో “టీచర్ ట్రైనింగ్ కోసం విజయనగరం వెళ్ళి జాయిన్ అవనా?!” అని నాగ అడగగానే “ఇక్కడ నన్ను, పిల్లల్ని వదిలేసి నువ్వు విజయనగరం వెళిపోతే ఎలా?” అంటూ ఎదురు ప్రశ్న వేసాడు పెదబాబు. “సీజన్ పాస్ తీసుకుని, రోజూ ఉదయం వెళ్ళి, సాయంత్రానికల్లా వచ్చేస్తానండీ. ఎలాగూ వసంత, గిరిజ ఉదయం ఏడు గంటలకే కాలేజ్ కి వెళిపోతున్నారు. మీరు నాని కూడా తొమ్మిది గంటలకల్లా వెళిపోతారు.” “మీరందరూ […]

అమ్మమ్మ – 29

రచన: గిరిజ పీసపాటి సాధారణంగా ఒకసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయితే డిస్చార్జ్ చేసేవరకు పేషెంట్ ని బయటకు పంపరు. కానీ, వసంత డాక్టర్ ని అడిగి, ఆయన ఒప్పుకోకపోతే అలిగి మరీ ఒకరోజు ఇంటికి వచ్చి, తలంటి పోసుకుని, తరువాత శ్రీదేవి – అనిల్ కపూర్ జంటగా నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమా మేట్నీ షో చూసి, ఆ సాయంత్రం బీచ్ కి వెళ్ళి, తరువాత తిరిగి హాస్పిటల్ కి వెళ్ళింది. గిరిజకు జ్వరం ఒకరోజు […]