March 29, 2024

అర్చన 2020 – తల్లి కోడి

రచన: వాత్సల్య “అమ్మో టైము ఐదయిపోయింది అప్పుడే, ఇంకా బాస్ చెయ్యమన్న రిపోర్టు పూర్తి కాలేదు, పిల్లలు తిన్నారో లేదో” అనుకుంటూ అన్యమనస్కంగానే పని చేసుకుంటొంది శైలజ. ఇంతలో ఇంటి నుండి పెద్దమ్మాయి వర్ష ఫోను “అమ్మా, నువ్వు అర్జెంటుగా రా” అంటూ.ఏమయ్యిందే అని ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా ఏడుస్తుందే తప్ప మాట్లాడదు. శైలజ గుండె జారిపోయింది, కానీ ధైర్యం కూడగట్టుకుని “ఇంట్లో తాతయ్యా, నానమ్మా లేరా?” అని అడిగింది. ఇంతలో శైలజ అత్తగారు భాగ్య […]

అర్చన 2020 – త్రాణ

రచన: చెన్నూరి సుదర్శన్ పావని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుందని ఏ రోజూ.. కలలో గూడా ఆనుకోలేదు. కాని అన్ని రోజులూ ఒక్కతీరుగా ఉండవన్నది నగ్నసత్యం. ‘కాలం కలిసి రాకుంటే కర్రే పామై కరుస్తుంది’ అన్నట్టు ప్రమాదం వెనుకాల మరో ప్రమాదం తరుముకుంటూ వస్తుంటే.. ఈ రోజు తన గారాల పట్టి కోసం పోలీసు గడప తొక్కక తప్ప లేదు. స్టేషన్ సమీపిస్తున్న కొద్దీ ఆమె ఎదలో అలజడి అధికం కాసాగింది. గుండె చిక్క పట్టుకుని.. […]

అర్చన 2020 – దోషి ఎవరు?

రచన: పూర్ణ కామేశ్వరి కిటకిటలాడుతున్న కోర్ట్ హాలులో ఆర్డర్ ఆర్డరన్న జడ్జిగారి ఉత్తర్వుకు కొంత సేపటికి కానీ నిశ్శబ్దము చోటు చేసుకోలేదు. అంతా అగమ్యగోచరంగా వున్న అహల్యకి, ఇన్నేళ్ళ జీవిత పయనంలో ఇలాంటి మలుపు వస్తుందని కలలోనైనా అనిపించలేదు. తన జీవితంలో పడ్డ మచ్చ తనే మరచిన ఇన్నేళ్లకిలా తనని వెంటాడు తుందని అనుకోలేదు. సజావుగా సాగిపోతున్న జీవితంలో ఉప్పెనలా వచ్చిన ఈ తాకిడికి తట్టుకోలేకపోయినా అందులోనూ ఒక మధురానుభూతి దాగుడడం తనకే తెలియని ఆనందాన్ని కలిగించింది. […]

అర్చన 2020 – ధీరుడు

రచన: కట్టా రాంప్రసాద్ బాబు పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయాడు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఒళ్ళంతా చమట పట్టేసింది. ఒంట్లో నుంచి ఆయాసం తన్నుకొస్తుంది. ఒకటే టెన్షన్‌ ఏమవుతుందోనని. కాళ్ళకు చెప్పుల్లేకపోవడం, దారికూడా రాళ్ళూ, రప్పలతో నిండి వుండటంతో పాదాలు పుండ్లుపడిపోయాయి. అసలా సమయంలో ఏదీ ఆలోచించే స్థితి లేదు. ముందు అక్కడ నుంచి కదలాలి అనే అలోచన తప్ప మనసులోకి ఇంకోటి రాలేదు. ఇంక ముందుకు కదల్లేని పరిస్థితి. ఓ చెట్టుకింద ఆగిపోయి అక్కడే కూలబడిపోయాడు. నోరంతా […]

అర్చన 2020 – నాతి చరామి

రచన: పరిమళ పప్పు ఆరోజు డాక్టర్ చెప్పిన మాటకి విని నా తల తిరిగినట్టు అయ్యింది. నేను తల్లిని కాలేను అని తెలిసి అవాక్కయ్యాను. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచే మా వారికి నాతో విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. మొదట్లో వినలేదు కానీ ఎన్నాళ్ళని వినకుండా ఉంటారు, చెవిలో జోరీగ లాగా ఊదుతూ ఉంటే ఏ మనిషి అయినా మారకుండా ఉంటారు చెప్పండి? అదే భయం నాకు కూడా […]

అర్చన 2020 – పాచిక

రచన: నందిరాజు పద్మలత ల్యాండ్ లైన్ ఫోను రిసీవర్ అప్పటికి పావుగంట నుంచీ రాజేశ్వరి చెవిని అంటిపెట్టుకునే ఉంది. ఈ మధ్య ఈ ఫోనుని వాడడం బాగా తగ్గిపోయింది. ఎప్పుడో తప్ప కాల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే హిమబిందు కి ఆశ్చర్యంగా ఉంది. తల్లి వంకే చూస్తోంది. ఆవిడ ముఖంలో మారే రంగులు, భావాలు అర్థం కాక, సైగలతో అడిగింది బిందు, ఎవరు అవతలి వైపు అని. కానీ ఏకపక్షంగా సాగుతున్న ఆ సంభాషణలో, రాజేశ్వరి […]

అర్చన 2020 – పిల్లకాకి

రచన: ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి “ఇంకా ఎంతకాలం పంపిస్తాము? మీకు నలభై , నాకు ముప్పై అయిదు వచ్చాయి. ముందు ముందు మన పిల్లలని పెంచాల్సిన బాధ్యత అయితే మనమీదే ఉంటుందిగా. మన పిల్లల బాధ్యత మనది. ఆయన పిల్లల బాధ్యత ఆయనది . “అంది ఖచ్చితముగా రాధిక. “మీరు నాకు తెలియకుండా పంపితె , తరువాత తెలిస్తె ఊరుకోను”అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పేసింది . “కానీ ఆయన రిటైర్ అయిపోయారు కదా. తమ్ముడూ, చెళ్ల్లెళ్ళు ఆలశ్య0గా పుట్టారు. […]

అర్చన 2020 – పెద్దరికం

రచన: ప్రకాశ రావు “నువ్వు ఏ రాంక్ తీసుకొని రాగలవు ” అడిగాడు భార్గవ్ “అన్నింటిలో తొంభై మార్కుల పైన తప్పకుండా వస్తుంది “అన్నాడు అశ్విన్ ” పేపర్లు ఎవడైనా తలతిక్క మాస్టారు దిద్దారంటే …..” అడిగాడు భార్గవ్ “ఎటువంటి మాష్టర్ నా పేపర్ దిద్దినా తొంభైకి తక్కువ కాకుండా మార్కులు వేస్తారు ” పూర్తి నమ్మకంతో అన్నాడు అశ్విన్ . “నీకు పూర్తి నమ్మకం ఉంది.కానీ నా పరీక్షా ఫలితం గోడమీది పిల్లిలా ఎటువైపు అయినా […]

అర్చన 2020 – బళ్లు షెడ్ కి వెడుతున్నాయి

రచన: చెంగల్వల కామేశ్వరి అమ్మా! పండక్కి ఈ సారి పిండి వంటలు ఏమీ చేయలేదా! కొడుకడిగిన ప్రశ్నకు “లేదురా! ఏ రోజుకారోజు చేసేవి ఎలాగూ ఉన్నాయిగా! అందుకే ఈ సారి చేయలేదు ” సంజాయిషీగా చెప్పింది కమలమ్మ. అదేమిటి? నిలవపిండివంటలు రకరకాలు చేస్తావు కదా! నేను మా ఆఫీస్ లో వాళ్లకిద్దామనుకునున్నాను నువ్వు చేసే జంతికలు అరిసెలు లడ్డూలు కజ్జికాయలు చెక్కావడలు అస్సలు పిండివంటలు ఏమీ చేయలే్దా! పండగ ఇంక రెండు రోజులేగా ఉంది! ఆశ్చర్యంగా అడిగాడు.మధు […]

అర్చన 2020 – భర్తని మార్చాలి!

రచన: జొన్నలగడ్డ రామలక్ష్మి మహిళలపై అత్యాచారం పెళ్లితో మొదలౌతుందని మా పనిమనిషి జ్యోతి పదేపదే అనేది. అది నిజమని స్పష్టమైనా, ఆర్థికంగా జ్యోతి స్థాయిలో ఉన్న ఆడవారికే అది పరిమితమనుకున్నాను. నాకూ ఆ మాట వర్తిస్తుందని, నా పెళ్లయ్యేక తెలిసింది. సంప్రదాయపు సంకెళ్ల కారణంగా, జ్యోతితో పోల్చితే నా సమస్య మరింత దుర్భరం. ఆమెకు లభించే పాటి సానుభూతి కూడా నాకు దొరకదు. ‘భర్తకి అవలక్షణాలుంటే అది అసహజమేం కాదు. అలాంటి భర్తని నిరసించే భార్య కులట. […]