April 19, 2024

కాంతం వర్సెస్ కనకం……

రచన: మణికుమారి గోవిందరాజుల   ఆ రోజు వాళ్ళ పెళ్ళిరోజు.   పొద్దున్నే  పట్టిన ముసురులా కాంతానికి  కనకానికి మొదలైన పోట్లాట ఇంతవరకు తెగడం లేదు. ఇద్దరూ కూడా నువ్వంటే నువ్వని అనుకోవడంతోనే సరిపోతున్నది  . యెవరేమి చేసారో   సోదాహరణ ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నారు.  ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని  పట్టుమీదున్నారు.  పైన అద్దెకున్న వాళ్ళొచ్చి సంధి కుదర్చబోయారు కానీ వాళ్ళను కరిచినంత పని చేసి వెళ్ళగొట్టారు. ముప్పయేళ్ళ సంసార జీవితంలో  చాలాసార్లు యేదో ఒక విషయానికి […]

సుఖాంతం!

రచన: పద్మజ యలమంచిలి   ఎప్పటిలానే.. టిఫిన్ లు తినిపించి,  లంచ్ బాక్సులు కట్టేసి, పిల్లలని తయారుచేసి స్కూల్ కి పంపి,  భర్తకు కావాల్సినవన్నీ అమర్చి ఆదరా బాదరా రెండు ముద్దలు కుక్కుకుని . తొమ్మిదినెలల గర్భిణిలా నిండుగా ఉన్న బస్సులోకి ఎలాగోలా జొరబడి చెమటలు కక్కుకుంటూ ఆఫీస్ కి చేరింది నీరజ… హమ్మయ్య సెక్షన్ హెడ్ ఇంకా రాలేదు అనుకుంటూ తన టేబుల్ మీద పెండింగ్ వర్క్ పూర్తిచేసే పనిలో పడింది. ఇంట్లో దివాకర్ చిర్రుబుర్రులాడి […]

ఇల్లాలు

రచన – డా. లక్ష్మి రాఘవ “ఉద్యోగం మానేస్తున్నావా? పిచ్చా ఏమైనా ?” తీవ్రంగా స్పందించింది రేఖ కొలీగ్ సంధ్య. రేఖ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ “పిచ్చేమిటే? అవసరం…” “అవసరమా?ఒకసారి ప్రపంచాన్ని చూడు. ఇలాటి ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో జనం.” “నిజమే నేను కూడా చదువు అవగానే మంచి ఉద్యోగం కోసం ఎన్ని ఇంటర్వ్యూ లు అటెండ్ అయ్యాను..” “కదా…అందుకే ఆలోచింపమంటున్నాను. ఒక MNC లో మంచి పొజిషన్ లో ఉంటూ…పెళ్లి అయి కొన్నేళ్ళకే […]

అమలిన శృంగారం

రచన: అనిల్ ప్రసాద్ లింగం “అరే…… విజయోత్సవ చిత్రాల రచయితా – అందాల తారా కలిసి మా ఇంటికి విచ్చేశారే. ఎంత శుభదినం ఇది. రండ్రండీ…” ఇంట్లోకి ఆహ్వానించాడు డాక్టర్. దివాకర్, వేకువ జామునే వచ్చిన అతిథుల్ని. “ఆపరా వెధవా. ఎక్కడా పెళ్లి కూతురు ?” సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించాడు తన భార్యతో కలిసొచ్చిన ప్రముఖ సినీ రచయిత అనిరుధ. దివాకర్ తన భార్యను పిలిచి, “చెల్లిని పిలు, వీళ్ళు ఆశీర్వదించి వెళతారు” అన్నాడు. “ఏరా ? […]

ఆసరా!

రచన: పద్మజ యలమంచిలి అందమైన తీగకు పందిరుంటే చాలునూ.పైకి పైకి పాకుతుంది చినవాడా..ఎఫ్.ఎమ్.రైన్బో లో పాటవింటూ బయటకు చూశా! లంచ్ అవర్. పిల్లాలంతా గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న ఆహారాన్ని ఒకరికొకరు పంచుకుంటూ జోకులేసుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. స్టాఫ్ రూం లో టీచర్లందరూ కూడా అదే పనిమీద ఉన్నారు. ఎక్కడా నీరజ కనపడలేదు. ఇద్దరికీ కారేజీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది రత్తాలు. మాటైతే ఇచ్చాను కానీ. ఇద్దరు బిడ్దలనూ పోగొట్టుకుని దిగాలు పడుతూ ఒంటరిగా […]

వేకువలో చీకటిలో…

రచన: కె. మీరాబాయి “నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని ” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి. . “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి పడుకున్నారు. […]

నలుగురి కోసం

రచన:- డా.  కె.  మీరాబాయి సాయంకాలం ఆరు గంటలు కావొస్తోంది.  శివరాత్రికి చలి శివ శివా అంటూ పరిగెత్తి పోయిందో లేదో గానీ ఎండ మాత్రం కర్నూలు ప్రజల దగ్గరికి బిర బిర పరిగెత్తుకు వచ్చింది . ఫిబ్రవరి నెలాఖరుకే ముప్పై ఏడు డిగ్రీలకు పెరిగి ఎండ తన ప్రతాపం చూపుతోంది. మామూలుగా ఆ వేళప్పుడు వూళ్ళో ఉన్న టెక్నో స్కూళ్ళు, డిజిటల్ స్కూళ్ళు , ఎంసెట్ నే ధ్యేయంగా మూడో క్లాసు నుండి పిల్లలను రుద్ది […]

ముత్యాలరావు.. స్ధలాల మోజు

రచన: గిరిజారాణి కలవల   రోజూ పేపర్ల లో వచ్చే క్లాసిఫైడ్స్ చూడడం అలవాటు ముత్యాలరావుకి. రియల్ ఎస్టేట్ లూ.. స్ధలాలూ.. గజాలూ.. రేట్లూ.. కనుక్కోవడం ఇదే పని. ఆ బ్రోకర్లకి ఫోన్లు చేయడం.. వాళ్ళు కారులో వచ్చి, సైట్ల దగ్గరకి వెళ్లి.. ఆ స్ధలాల గురించి చెపుతూ వుంటే.. అన్నీ శ్రద్ధ గా వినేవాడు. పక్కనే ఉన్న స్దలాల ఓనర్స్ దగ్గర కి వెళ్ళి రేట్లు కనుక్కోవడం.. భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అని […]

కాంతం సంఘసేవ

రచన: మణికుమారి గోవిందరాజుల     కాంతానికి దిగులెక్కువయింది. ముఖ్యంగా “స్వచ్ఛ్ భారత్ వుద్యమం “ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన దగ్గరనుండి తాను దేశానికి యేమీ చేయలేక పోతున్నాను అన్న బాధ యెక్కువయ్యి అన్నం కూడా సయించడం లేదు. వూహ తెలిసినప్పటి నుండి కూడా కాంతానికి సొసైటీకి యేదో ఒకటి చేసి మాతృదేశానికి తన వంతు సేవ అందించాలనేది చాలా గాఢమైన కోరిక. అదేమి చిత్రమో యేది చేద్దామన్నా యేదో ఒక అడ్డంకి వచ్చేది. యెవరికన్నా చెప్తే నవ్వుతారేమో […]

ఆసరా.. 1.

రచన: పద్మజ యలమంచిలి   అమ్మగారూ…అమ్మగారూ…మన పక్కింటి ఆవిడ  ఇద్దరి పిల్లలతో బావిలో దూకేసిందట…  ఈతగాళ్లను బెట్టి తీయించేరట… పెద్ద పానం దక్కింది కానీ పసి పాణాలు ఎల్లిపోనాయి.. ఇక ఆయమ్మ బతికినా సచ్చినా ఒకటే… రత్తాలు ఊపిరి తీసుకోకుండా చెప్పుకుపోతానే ఉంది.. నా గుండె ఆగినంత పనైంది..తేరుకుని ఇప్పుడే వస్తానని పక్కింట్లోకి పరిగెత్తాను.. ఎప్పుడూ నవ్వుతూ ఇంటి పని, వంటపని చేస్తూనే బీఎడ్ కి ప్రిపేర్ అవుతూ  పిల్లలతో నిమిషం తీరికలేకుండా ఉండే నీరజ ఎందుకిలా […]