March 29, 2024

సమర్ధత

రచన:   నిష్కల శ్రీనాథ్   గడియారంలో  పెద్ద ముల్లు పన్నెoడు దగ్గరికి  చిన్న ముల్లు ఆరు దగ్గరికి రాగానే సీటులోంచి లేచాను . ఈరోజు మధ్యాహ్నం బాక్స్ కూడా తీసుకురాలేదని ఏమో ఆకలి కాస్త ముందుగానే వేసింది. ఇక ఆలస్యం చేయకూడదు అని ఆఫీస్ బయటకు నడిచాను, దగ్గరలోనే హోటల్ ఉంది త్వరగా వెళితే మంచిది అనుకుంటూ నాలుగు అడుగులు వేశానో లేదో విజయ్ కనిపించాడు. వాడి ఆఫీస్ కూడా మా ఆఫీస్ కి దగ్గరే […]

భగవంతుల రహస్య సమావేశం

రచన: రాజన్ పి.టి.ఎస్.కె సర్వాంతర్యామి, దేవదేవుడైన శ్రీమహావిష్ణువు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆయన వదనంలో నిత్యం నాట్యం చేసే చిరునవ్వు ఎందుకో ఈ రోజు అలిగినట్టుంది. ఆయన గంభీర వదనాన్ని చూసి భయపడ్డ పాలసముద్రపు కెరటాలు కూడా మెల్లిగా ఆడుకుంటున్నాయి. ఆదిశేషుడు తను కొట్టే చిన్నిపాటి బుసలను కూడా మాని నిర్లిప్తంగా చూస్తున్నాడు. విష్ణు పాదాలు ఒత్తుతున్న జగన్మాతకు మాత్రం ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. ఎన్నడూ లేనిది స్వామి ఇలా వ్యాకులం గా కనిపించడంతో అమ్మవారు ఉండబట్టలేక… […]

మానవత్వం

రచన: గిరిజారాణి కలవల ”శిరీషా! ఏం చేస్తున్నావు?” అన్న అత్తగారి మాటకి సమాధానంగా శిరీష. “గోపమ్మకి కాఫీ కలుపుతున్నా అత్తయ్యా” అంది. ఆవిడ గబుక్కున గిన్నెలోకి చూసి ”ఇంత చిక్కగానే… ఇంకా నయమే… ఇలా అలవాటు చేస్తే ఇంకేవన్నా వుందా..”అంటూ శిరీష చేతిలో పాలగిన్నె తీసుకుని ఏదో వంపీ వంపనట్లు పాలు వంపి, ఆ కాఫీలో ఇన్ని నీళ్లు కలిపేసి పంచదార కాస్త ఎక్కువ వేసింది. పైగా “వాళ్ళు మనలాగా స్ట్రాంగ్ గా తాగరు… పల్చగా తియ్యగా […]

దారి తప్పిన స్నేహం

రచన: గిరిజ పీసపాటి ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి శైలజ, సరిత ప్రాణ స్నేహితులు. శైలజ చాలా బిడియంగా, నెమ్మదిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. సరిత తప్ప వేరే స్నేహితులు కూడా లేరు. కానీ సరిత గలగలా మాట్లాడుతూ తను ఎక్కడ ఉంటే అక్కడే చొరవగా కొత్త స్నేహితులను తయారుచేసుకునేది. స్కూల్ లో మొదలైన వారి స్నేహం కాలేజ్ లో కూడా కొనసాగడంతో ఏ చిన్న విషయాన్నైనా ఇద్దరూ షేర్ చేసుకునేవారు. కాకపోతే ఇద్దరి […]

చిన్న చిన్నవే కానీ….

రచన: మణి గోవిందరాజుల “యెన్నిసార్లు చెప్పాలి ఆ సెంట్ కొట్టుకోవద్దని? నాకస్సలు నచ్చదని నీకు తెలుసుకదా?” విసుక్కున్నాడు శేఖరం. వుత్సాహంగా బయల్దేరబోతున్న సంధ్య మొహం చిన్నబోయింది. నిజమే శేఖర్ చెప్తుంటాడు తనకు సెంట్ వాసన నచ్చదని, కాని మొదటినుండీ . తనకేమొ చక్కగా తయరయ్యి కొద్దిగా పెర్ఫ్యుం స్ప్రే చేసుకోవడం ఇష్టం. ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అందుకని చాలా లయిట్ గా స్ప్రే చేసుకుంది. అయినా పట్టేసాడు. మౌనంగా లోపలికి వెళ్ళబోయింది చీర మార్చుకోవడానికి. “ఇప్పుడు […]

మన( నో) ధర్మం

రచన: డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం తెల్లని రాయంచ లాటి బెంజ్ ఎస్ యూ వి గంటకు యాభై మైళ్ళ వేగంతో ఆరు వందల ఎనభై ఫ్రీ వే మీద కాలిఫోర్నియా లోని శాన్ రామన్ నుండి మిల్పిటాస్ వైపుకు దూసుకు పోతోంది. లోపల కూర్చున్న వారికి మాత్రం పూలరథం మీద ప్రయాణిస్తున్నట్టు ఉంది. కారులో స్టీరియో నుండి ‘ దిద్ద రానీ మహిమల దేవకి సుతుడు” అంటూ బాలకృష్ణ ప్రసాద్ పాడిన అన్నమయ్య పాట వస్తోంది. […]

సంస్కరణ

రచన: శ్రీ మహాలక్ష్మి మృదుల – ఆనంద్ ఇద్దరూ ఉద్యోగస్తులు. వారికి ఒక పాప. ఇద్దరూ ఉద్యోగస్తులు అవటం వల్ల పాపా సంరక్షణ మృదుల వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఏ చీకు చింత లేని కాపురం. అన్ని సమకూర్చినట్టు ఉన్న జీవితం. మృదులకి ఆఫీస్ లో తెలివైంది అని, కలుపుగోలు మనిషి అని, మంచి సమర్థురాలని ఇలా మంచి పేరుంది.ఆ పేరుని అలాగే నిలబెట్టుకోవాలని చాలా తాపత్రేయ పడుతుంది. ఆ రోజు తన ప్రతిభను చూపించగలిగే ఒక […]

అన్యోన్య దాంపత్యం

రచన: నిష్కల శ్రీనాథ్   ‘అలనాటి రామచంద్రునికి అన్నింటా సాటి ..” అంటూ టీవీలో వస్తున్న పాటకు కూనిరాగం తీస్తూ బాల్కనీలో కుండీలలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుంది శ్రావణి. ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తూ పక్కింటి నుండి పెద్దగా అరుపులు వినపడ్డాయి , రోజు అవి విని విని అలవాటు పడిన శ్రావణి మాత్రం తన పని తాను చేసుకోసాగింది. ” మొదలైయిoది మళ్ళి ” అంది పని మనిషి సత్తెమ్మ ఇల్లు తుడిచిన […]

ఆడాళ్లూ…. మీకు జోహార్లూ

రచన: పద్మజ యలమంచిలి   50వ దశకంలో..ఆధునికత అప్పుడప్పుడే వంటబట్టించుకున్న  కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకుని వారికి కావాల్సిన జీవితాన్ని బాగానే ఎంచుకుని జీవించగలిగినా..పల్లెటూరి పోకడలు, అజ్ఞానంతో కొట్టు మిట్టాడే కుటుంబాల్లోని ఆడపిల్లలు మాత్రం ఎంత ధనికులైనా తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా పెళ్ళిచేసుకుని పిల్లలు ,సంసారం ఇదే ప్రపంచంగా బ్రతికేసే వారు.. అదిగో అలాంటి కుటుంబం నుంచి వచ్చిందే …మా ఇంటి పక్కన వుండే నా ఈడు ఈ సీతమ్మ తల్లి కూడానూ.. భర్తలేని పల్లెటూరి స్త్రీ […]

శాకుంతలం

రచన : శ్రీపాద   శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ’అబ్బే ఏమీ లేదు ’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏ కాస్త పనికి వస్తారనిపించినా అస్సలు వదలదు గాక వదలదు చీటికీ మాటీకీ చెట్టెక్కే భేతాళుడిని భుజాన వేసుకునే విక్రమార్కుడిలా. అ”రామ సీత గొప్ప మనిషి ఎంత చక్కని కవిత్వం […]