March 29, 2024

కాసులపేరు

రచన: సావిత్రి దుడ్డు నాన్నమ్మగారు చూపిస్తున్న నగ చాలా బావుంది. చిన్న బంగారు చాక్లెట్ బిళ్ళలు వరుసలా ఉంది. వదిన కోసం చేయించాలి అని బంగారం కొట్టు పెద్దయ్యని రమ్మన్నారు. మా అమ్మ పక్కన కూర్చుని, తన చీర నలిపేస్తూ తనని ఊపేస్తూ “అమ్మ, నాకు ఎప్పుడు కొంటావు?” అని అడిగాను. పెద్దయ్యిన తర్వాత కొనుక్కుందాము అంది అమ్మ. యెంత పెద్ద అవ్వాలి? నేను పెద్దదాన్నయ్యాను అన్నావు కదా. గొడవ చెయ్యకూడదని! అని అన్నాను. ఏమి సమాధానం […]

బద్ధకపు అలవాటు.

  రచన: పంతుల ధనలక్ష్మి.   రమేష్ కుకుకుకుకుష్    కురుకురుకురు కుష్ శబ్దం వినగానే లేచి కూర్చుని ఫోనులో టైమ్ చూసాడు.  నాలుగుంపావు అయింది.  ఇప్పటినుండి ఎందుకు కాసేపు పడుకుందాము అనుకున్నాడు. ఈలోపు టింగ్ మని శబ్దం.  వాట్సాప్ లో శుభోదయాలు ప్రారంభం అనుకున్నాడు.  తనకి మంచి మిత్రుడు ఈ మధ్యే రిటైరయ్యేడు. సరే చూద్దామని చూసాడు.  “మనిషికి అన్ని అనర్థాలకి కారణం బద్ధకం. దానిని వదిలించుకుంటే జీవనం చాలా బాగుంటుంది.” అని.  అలా ఒక్కొక్కటీ చదివి […]

జీవితం-జీతం-మనుగడ

రచన: రాజ్యలక్ష్మి బి   “ఈ వుద్యోగం చెయ్యాలంటే విసుగ్గా వుంది, ఎలాగైనా వదిలించుకునే మార్గం చెప్పండి” అంటూ తోటివుద్యోగి శివని అడిగాడు రామం! “రామం గారూ నా వల్ల కాదు, మీ నాన్న మన ఆఫీసర్ ఫ్రెండ్స్! మీ నాన్న మిమ్మల్ని యిక్కడ వుద్యోగంలో కుదిర్చింది యిక్కడ మంచి పేరు తెచ్చుకోవడానికి! ఆమ్మో! నా వుద్యోగం వూడగొట్టుకోను బాబూ “అంటూ శివ తన ఫైళ్లల్లో తల దూర్చాడు. అసలు విషయం యేమిటంటే పుల్లయ్యగారికి ఒక్కడే కొడుకు […]

ఇదీ పరిష్కారం !

రచన: ముక్కమల్ల ధరిత్రీ దేవి ” సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్? ” లాంగ్ బెల్ అయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ ఉన్న దుర్గకు క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల వాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అట్నుంచి కదల్లేదు. ” ఏమిటి సౌమ్యా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్? ఆర్ యు ఓకే? ” తనే లోనికెళ్లి సౌమ్య భుజం […]

నారాయణుని సేవలో…

రచన: మధుపత్ర శైలజ ఎప్పటినుండో లలితమ్మగారు బదరీనాధుణ్ణి చూడాలని కలలు కంటున్నారు. భర్త జీవించిన కాలంలో ఒక్కసారన్నా వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ పరిస్థితులు అనుకూల పడలేదు. “రామలక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులుండగా నీకేం బాధ తల్లీ! నీవు తప్పకుండా ఆ వైకుంఠవాసుని చూసి తీరతావు” అని బంధువులంతా అంటూండేవారు. అదిగో ఆమె కోరిక తీరబోయే రోజు రానే వచ్చింది. కొడుకులిద్దరు బాంక్ ఉద్యోగస్తులు కావటంతో ముందుగా ఆ యాత్రకు కావలసిన ప్రయాణ సౌకర్యాలన్నిటిని సమకూర్చుకున్నారు. ఏడుపదులు దాటిన […]

అష్టవిధ నాయికల కథలు – వాసకసజ్జిక.

రచన: ధనలక్ష్మి పంతుల రఘురామ్ ఊరెళ్ళి వారం దాటింది. ఇంకా రాలేదు. ఇందాక ఫోను చేసాడు. “రాత్రి ఎనిమిది అవుతుంది” అని. అంటే వంట చేసి వుంచాలి. ఎప్పుడు భోంచేసారో!?” ఆనుకుని ” అమ్మో ! సాయంత్రం నాలుగయ్యింది” ఆనుకొని గబగబా మొదలెట్టింది వంట. రఘురామ్ కి కుక్కరులో వండితే ఇష్టం వుండదు. అందుకే కోలగా దుక్కగా ఉన్న ఇత్తడి గిన్నె ( బూసిగిన్ని) అనేవాళ్ళు. అందులో బియ్యం కడిగి అత్తెసరుకి పెట్టింది. సిమ్ లో పెడితే […]

అన్నపూర్ణ తల్లి..

రచన: జ్యోతి వలబోజు వాడిపోయిన మొహంతో వచ్చి బ్యాగ్ సోఫాలో పడేసి దిగాలుగా కూర్చుంది వనజ.. తలుపు చప్పుడు విని హాల్లోకి వచ్చిన వనజ అత్తగారు లక్ష్మిని చూసి విస్తుపోయింది. “వనజా! ఏమైందమ్మా! రోజూ రాత్రి ఎనిమిది అయ్యేది, ఇవాళ ఇంత తొందరగా వచ్చేసావేమిటి? తలనొప్పిగా ఉందా? టీ ఇవ్వనా?” అంటూ పక్కనే కూర్చుంది. ఆ మాత్రం ఆప్యాయతను తట్టుకోలేక, అప్పటిదాకా మౌనంగా ఉన్న వనజ అత్తమ్మ చేయి పట్టుకుని భోరుమని ఏడ్చేసింది. “అయ్యో! ఏమైందమ్మా.. ఎవరేమన్నారు. […]

సూర్యోదయం

రచన : యం. ధరిత్రీ దేవి పార్కులో హుషారుగా నడుస్తున్న వాడల్లా ఠక్కున ఆగిపోయారు రాఘవ రావు గారు, కాస్త దూరంలో ఓ సిమెంటు బెంచీ మీద కూర్చున్న దయానంద్ గారిని చూసి. మెల్లిగా అటువైపు అడుగులు వేశారాయన. దాదాపు కొన్ని నెలలయి ఉంటుంది ఆయన్ని చూసి. మనిషి బాగా నీరసించిపోయారు. ముఖంలో ఏదో చెప్పలేని దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. రాఘవరావు గారు, దయానంద్ గారు ఇద్దరూ కాలేజీ ప్రిన్సిపాల్స్ గా చేసి రెణ్ణెళ్ల తేడాతో పదవీ […]

కలహాంతరిత.

రచన: పంతుల ధనలక్ష్మి గోపీ ఆఫీసునుండి ఇంటికి వచ్చేడు. ఆ రోజు బస్సు ల వాళ్ళు ఆటోవాళ్ళు ఏదో ఏక్సిడెంట్ విషయంలో కొట్టుకుని పంతం తో ఇరువురూ స్ట్రైక్ చేసి తిరగటం మానేశారు. పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరేడు. ఉసూరుమని కూర్చుని “రాధా! కొంచెం కాఫీ ఇస్తావా?’ అని అడిగేడు. “ఎందుకివ్వనూ? అదేదో ఎప్పుడూ ఇవ్వనట్టు! ఆ!” అంది. “ఇవాళ సినిమా ప్రోగ్రాం అన్నారు?” దీర్ఘం తీసింది రాధ. ఓ చూపు చూసి ఊరుకున్నాడు. […]

పాపం నీరజ!

రచన: రాజ్యలక్ష్మి బి నీరజకు యీ మధ్య భర్త రాజారాం పైన అనుమానం వస్తున్నది. “ఆఫీసు 5 కల్లా అయిపోతుంది కదా? మీరు రాత్రి 11 అయినా ఇంటికి చేరరు? “ఒకరోజు నీరజ భర్తను నిలదీసింది.” మా ఆఫీసర్ కి నేనంటే నమ్మకం, నమ్మకమైన ఫైళ్లు నాచేత చేయిస్తాడు, అనో “స్నేహితులు పట్టుబట్టి సినిమాకు లాక్కుపోయారు “అనో రోజూ ఏదో ఒక అల్లుతాడు రాజారాం ! ఒక్కొక్కరాత్రి మెలకువ వచ్చి చూస్తే నీరజకు పక్కమీద కనపడడు ! […]