March 29, 2024

తల్లి మనసు

రచన: G.S.S. కళ్యాణి. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో, తమ వరండాలోని పడక్కుర్చీలో కూర్చుని ఆ రోజు దినపత్రికను తిరగేస్తూ, తన పక్కనే బల్లపైనున్న కాఫీ కప్పును తీసుకుని ఒక గుటక వేసిన రమాపతి, చిరాగ్గా మొహంపెట్టి, “ఒసేయ్ శ్రీకళా! ఓసారి ఇలా రావే!!”, అంటూ తన భార్య శ్రీకళను కోపంగా పిలిచాడు. భర్త అరుపుకు భయపడి, చేతిలో ఉన్న పనిని వదిలేసి పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చి, “ఏంటండీ? ఏమైందీ??’ అని రమాపతిని కంగారుగా అడిగింది శ్రీకళ. “ఇంత […]

తీరిన కోరిక..

రచన: షమీర్ జానకీదేవి కీర్తనకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకో తెలియదు. తన క్లాస్మేట్ రమ్య, తను ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇరుగు పొరుగున వుండేవారు. తనకు తమ పెద్ద మామయ్యంటే చాలా భయం. ఆయనను చూడగానే అందరు కనపడకుండా ప్రక్కకు వెళ్ళేవాళ్ళు. ఒక రోజు ఆ మామయ్య బయటికి వెళ్ళిన తర్వాత కీర్తన, రమ్య ఇద్దరు కలిసి సైకిల్ తెప్పించుకుని ప్రాక్టీస్ చేయాలని అనుకున్నారు. వారికి […]

మారిన జీవితం

రచన: ప్రభావతి పూసపాటి “ఒక్కసారి వీలు చూసుకొని రా రామం నీతో చాలా విషయాలు మాట్లాడాలి, ఫోన్ లో చెప్పలేను, నువ్వు సృజన రెండు రోజులు ఉండేలా రండి, “ఫోన్ లో అక్క గొంతు భారంగా వినపడుతోంది, “ఏమైంది అక్క? ఏదైనా కంగారు పడే విషయమా” ఆత్రంగా అడిగాను, ” కాదు లేరా, కొంచెం నీతో మాట్లాడితేగాని మనసుకి ప్రశాంతత కలగదు అందుకే” , గొంతులో జీర వినపడింది, “అలాగే అలాగే అక్క, రాత్రికి బయలుదేరుతాను, నువ్వు […]

సగటు జీవి సంతోషం

రచన: రాజ్యలక్ష్మి బి రంగయ్య రిక్షా ప్రక్కన నించుని అలసటగా ఒళ్లు విరుచుకున్నాడు. అరచేతులు మొద్దుబారాయి. అలవాటు లేని రిక్షా బ్రతుకుతెరువు, తనలో తనే నవ్వుకున్నాడు. పట్టణం అంటేనే బ్రతుకుపోరాటం ఒకరు దయ తలిస్తేనే యింకొకరి మనుగడ. రంగయ్య యిప్పుడు విరక్తిగా జీవం లేని నవ్వు నవ్వుకున్నాడు. కారణం యేమిటంటే…. రంగయ్య తన చిన్నపల్లెలో పచ్చని పొలాలు, వ్యవసాయం అక్కడ జీవనాధారం. కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర. చల్లని ప్రశాంత జీవనం. భార్యా, యిద్దరు బిడ్డలూ, తల్లి. […]

కనువిప్పు

రచన: ప్రభావతి పూసపాటి “అన్నయ్య సాయంత్రం వదినని తీసుకొని గుడి కి రా. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ” ఫోన్లో రజని గొంతు కొంచెం కంగారుగానే వినిపించింది. “ఎమ్మా! ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పోనీ ఇంటికి రాకూడదు ” కొంచెం ప్రశాంతంగా వుంటూ అడిగాను. “లేదు అన్నయ్య ఇంట్లో మాట్లాడటానికి కుదరదు.సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వదిన ని తీసుకొని డైరెక్టుగా అక్కడికి వచ్చేయి. నేను కూడా రవీందర్ తో కలిసి వస్తాను “అంటూ హడావుడిగా […]

నిజాయితీ ఆచరణ

రచన: రాజ్యలక్ష్మి బి ధర్మయ్య బస్సు కోసం యెదురుచూస్తూ నిలబడి గంట పైన అయ్యింది. దీపాలు కూడా వీధుల్లో వెలుగుతున్నాయి. చాలా దూరం వెళ్లాలి. నాలుగేళ్ల తర్వాత అమ్మను చూడ్డానికి బయల్దేరాడు. ఇప్పుడు బస్సెక్కితేకాని అర్ధరాత్రికయినా తనవూరు చేర్తాడు. ధర్మయ్యకు చాలా విసుగ్గా వుంది. రెండు రోజుల క్రిందట మారయ్య తాత బజార్లో కనపడి ‘ఒరేయి ధర్మా మీ అమ్మకు బాగాలేదురా నిన్ను చూడాలనుకుంటున్నది. నీకు చెప్పమన్నది. మీ మామ యింటికి రావాలంటే మీ అత్త గుమ్మం […]

సర్వజ్ఞుడు

రచన: G.S.S. కళ్యాణి మహేంద్ర దాదాపుగా నాలుగు గంటలనుంచీ కారు నడుపుతున్నాడు. అతడి ప్రయాణం అతడి స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకి. సాధారణంగా, కారులో దూరప్రయాణాలు చెయ్యడమూ, అందులోనూ అతడి ప్రాణ స్నేహితుడు సుబ్రహ్మణ్యం దగ్గరకి వెళ్లడమూ మహేంద్రకి ఎంతో ఇష్టమైన పని. కానీ ఈసారి ఆ ప్రయాణం అతడికి కాస్త ఇబ్బందిగా తోస్తోంది. అందుకు కారణం లేకపోలేదు! వారం రోజుల క్రితం మహేంద్ర మంచిదనుకుంటూ చేసిన ఒక పని ఇప్పుడతడికి తప్పని అనిపిస్తోంది! “ఆ సాధువు మాటల […]

మారుతున్న యువతరం

రచన: లక్ష్మి చివుకుల “ఈ పెళ్లి సంబంధం అయినా కుదిరితే తిరుపతి వెంకటేశ్వర స్వామీ.. నీ గుడికి నడుచుకుంటూ వచ్చి నీ దర్శనం చేసుకుంటాము తండ్రీ! నూతన వధూవరుల చేత కళ్యాణం చేయిస్తాను”… ఎడాపెడా చెంపలు వాయించుకుంటూ దేవునికి మొక్కుకుంటోంది అలివేలు. “నవీన్ !! రెడీ అయ్యావా ! ప్లీజ్ … ఈ పెళ్లి చూపులలో అయినా, ‘నేను అమ్మాయితో విడిగా మాట్లాడతాను….. మా అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి…. మనమంతా కలిసే వుండాలి……’ అని చెప్పకురా. […]

ప్రగతి (బి) భిక్ష

రచన: అఖిల దొడ్డపనేని మనోహరమైన సుందర దృశ్యం! విమానం కిటికీలోనుండి చూస్తున్న నా మనసు పులకలకు గురైంది. చూస్తున్నంతసేపు నీలి పరదాలు కప్పుకున్న తనివి తీరనన్ని కొండల బారులు! వాటినంటి పెట్టుకున్న దట్టమైన చెట్టూ చేమా. ఇంతకంటే సుందర దృశ్యాలు ఎన్నిటినో చూసాను కాని ఇవ్వన్ని నావి. ఈ నేల, నింగి, మబ్బులు, గాలి సర్వం నా సొంతం. ఏ నిమిషమైనా నేను చూడొచ్చు, అక్కడ తిరగొచ్చు. అన్నీ కుదిరితే సొంతం కూడా చేసుకోవచ్చు. ఇది మనది, […]

తలరాత మార్చిన క్షణాలు

రచన: G.V.L. నరసింహం ఆ ఊరి పేరు కొత్తపేట. ఎంత కొత్తదో తెలియదు కాని, ఆ ఊళ్లోని ఇళ్లన్నీ, తాతలనాటి పాతవే. ఆలా అని, చిన్న చూపు చూడకండి. ఆ గ్రామానికున్న కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు తెలుసుకొంటే, మీరే ఆశ్చర్యపోతారు. అందులోనూ విశేషమేమిటంటే, అంత అభేద్యమయిన భద్రతకు, గ్రామవాసులు ఒక చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం భరించిందనుకొంటున్నారా. అది కలలో మాట. నిజానికి ప్రభుత్వం, ఆ ఏర్పాట్లను నాశనం చేసే దిక్కుగా, అడుగులేస్తోంది. ఆ భద్రతా […]